ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 30 MAR 2023 9:46AM by PIB Hyderabad

   శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర భగవానుని జీవితం యుగయుగాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“పవిత్ర పర్వదినం శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అపర పురుషోత్తముడైన భగవాన్‌ శ్రీరామచంద్రుడు త్యాగానికి, తపో సంపన్నతకు, ఆత్మనిగ్రహానికి ప్రతీక. ఆయన జీవితం ప్రతి యుగంలోనూ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

DS/AK


(रिलीज़ आईडी: 1912220) आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam