విద్యుత్తు మంత్రిత్వ శాఖ
హరిత అమ్మోనియా ప్లాంట్ కోసం రేయింబవళ్ళూ 1400 మెగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ అందించేలా గ్రీన్ కో తో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్
ఒక పారిశ్రామిక సంస్థకు రేయింబవళ్ళూ పునరుత్పాదక ఇంధన సరఫరాకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతి పెద్దది
Posted On:
29 MAR 2023 3:33PM by PIB Hyderabad
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంపూర్ణ యాజమాన్యంలోని ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కాకినాడలో రాబోతున్న తన తన హరిత అమ్మోనియా ప్లాంట్ కోసం రేయింబవళ్ళూ 1400 మెగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ అందించేలా గ్రీన్ కో గ్రూప్ కంపెనీ అయిన గ్రీన్ కో జీరో సి ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండ్ సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఒక పారిశ్రామిక సంస్థకు రేయింబవళ్ళూ పునరుత్పాదక ఇంధన సరఫరాకు చేసుకున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఒప్పందం.

నిన్న న్యూ ఢిల్లీలోని ఎన్టీపీసీ కార్యాలయంలో చేసుకున్న ఈ ఒప్పందం మీద ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రాజీవ్ గుప్తా, గ్రీన్ కో గ్రూప్ వ్యవస్థాపకుడు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ మహేశ్ కొల్లి సంతకాలు చేశారు. ఎన్టీపీసీ రెన్యూవబూల్ ఎనర్జీ సీఈవో శ్రీ మోహిత్ భార్గవ, గ్రీన్ కో వ్యవస్థాపకుడు, ఎండీ శ్రీ అనిల్ చలమలశెట్టి, ఎన్టీపీసీ, ఆర్ ఈ ఎల్ కు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
*****
(Release ID: 1912040)