పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్ - గాట్విక్ మధ్య ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా వారంలో మూడు రోజులు నడవనున్న సర్వీస్

Posted On: 28 MAR 2023 3:42PM by PIB Hyderabad

 ఈరోజు అహ్మదాబాద్ - గాట్విక్ మధ్య నేరుగా నడిచే విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన  ఉక్కు మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈరోజు  ప్రారంభించారు.

  అహ్మదాబాద్-గాట్విక్ మధ్య నాన్-స్టాప్ ఫ్లైట్ ఈరోజు నుంచి ఎయిర్ ఇండియా నిర్వహిస్తుంది.   

 షెడ్యూల్ 

ఫ్లైట్ నెం 

నుండి

కు

నడిచే రోజులు .

బయలుదేరుసమయం 

(ఎల్ టీ )

చేరే  సమయం

 (ఎల్ టీ )

AI171

ఏఎండి 

ఎల్జీ డబ్ల్యు 

వారానికి మూడు సార్లు

1150

1640

AI172

ఎల్జీ డబ్ల్యు 

ఏఎండి 

వారానికి మూడు సార్లు

2000

0850+1

             

 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా కొత్త విమాన సర్వీసు వల్ల నూతన వాణిజ్య,వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. యూకేలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 

 అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం 50 లక్షల దేశీయ, 25 లక్షల అంతర్జాతీయ ప్రయాణీకులకు సేవలు అందించగల  సామర్థ్యం  కలిగి ఉందని చెప్పారు. అహ్మదాబాద్ ప్రయాణీకుల సామర్థ్యాన్ని 1.60 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

2013-14లో అహ్మదాబాద్ నుంచి  కేవలం 20 గమ్యస్థానాలకు విమానాలు నడిచేవని శ్రీ సింధియా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం  గత సంవత్సరాల కాలంలో అమలు చేసిన చర్యల వల్ల అహ్మదాబాద్ నుంచి   57 గమ్యస్థానాలకు విమానాలు నడుస్తున్నాయని  ఆయన తెలిపారు. గత సంవత్సరాల కాలంలో అహ్మదాబాద్ నుంచి వారంలో 2036 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని మంత్రి తెలిపారు. గతంలో వారంలో 980 విమానాలు రాకపోకలు సాగించేవని మంత్రి తెలిపారు. విమానాల రాకపోకలు 128%  మేరకు పెరిగాయని మంత్రి వివరించారు. 

గుజరాత్‌లో పౌర విమానయాన రంగం సాధించిన అభివృద్ధిని శ్రీ సింధియా వివరించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నాదని  అన్నారు. కాండ్లాలో కొత్త టెర్మినల్అభివృద్ధి చేశామని తెలిపిన మంత్రి  రూ. 250 కోట్లతో సూరత్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం,  వడోదరలో కొత్త ఏటీసీ  టవర్ కమ్ టెక్నికల్ భవనం అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో 10 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయని శ్రీ సింధియా తెలిపారు.ధోలేరాలో రూ.1305 కోట్లతోహిరాసర్ రాజ్‌కోట్‌లో రూ. 1405 కోట్లతో రెండు కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు వస్తాయన్నారు. వీటితో  గుజరాత్ లో విమానాశ్రయాల ఈ సంఖ్య 12కి పెరుగుతుంది.

గుజరాత్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్న  2013-14లో  విమానాల సంఖ్య 1175 నుంచి 2500కి పెరిగింది. ఆర్సిఎస్ ఉడాన్  పథకం కింద గుజరాత్‌కు 83 రూట్‌లు కేటాయించారు. 55 మార్గాల్లో విమానాలు నడుస్తున్నాయి. మిగిలిన మార్గాల్లో త్వరలో విమాన సేవలు ప్రారంభమవుతాయి. 

కార్యక్రమంలో గుజరాత్ మంత్రి 

శ్రీ బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్మంత్రిపౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సల్ ఎయిర్ ఇండియా సీఈవో   శ్రీ   క్యాంప్‌బెల్ విల్సన్ కూడా పాల్గొన్నారు.

***


(Release ID: 1911635) Visitor Counter : 193