వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2023 మార్చి 28న వాణిజ్యం, పెట్టుబడిపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశంలో జీ-20 వాణిజ్య సహకారం పై అంతర్జాతీయ సదస్సు
Posted On:
27 MAR 2023 2:47PM by PIB Hyderabad
వాణిజ్యం, పెట్టుబడిపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశాలు 2023 మార్చి 28,29,30 తేదీల్లో ముంబైలో జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే సమావేశాలకు జీ-20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, ప్రాంతీయ గ్రూపులు, అంతర్జాతీయ సంస్థల నుంచి దాదాపు 100 మంది ప్రతినిధులు హాజరవుతారు. అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడి రంగాలు వేగంగా అభివృద్ధి సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి.
మార్చి 28న ' ట్రేడ్ ఫైనాన్స్' అంశంపై అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. సదస్సును ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) మరియు ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాయి.
ఆర్థికాభివృద్ధికి వాణిజ్య నిధులు దోహదపడతాయి. అవసరమైన నగదు నిల్వలు అందుబాటులో ఉండే విధంగా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పెట్టుబడులు సహకరిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 80% వాణిజ్యం లెటర్ ఆఫ్ క్రెడిట్, సప్లై చైన్ ఫైనాన్సింగ్, ఇన్‌వాయిస్ డిస్కౌంట్ , రిసీవబుల్స్ ఫైనాన్సింగ్ వంటి కొన్ని రకాల సాధనాల ద్వారా జరుగుతోంది. ప్రపంచ వాణిజ్య రంగంలో బ్యాంకులు, ట్రేడ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎగుమతి క్రెడిట్ ఏజెన్సీ, బీమా సంస్థలు, దిగుమతి దారులు, ఎగుమతిదారులు వంటి అనేక సంస్థల పాత్ర ఉంటుంది. దేశాల మధ్య జరిగే వాణిజ్య కార్యకలాపాల్లో ద్రవ్య లభ్యత కీలక అంశంగా ఉంటుంది. 2020లో ప్రముఖ బ్యాంకుల ద్వారా $ 9 ట్రిలియన్ విలువ చేసే వాణిజ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఒక అంచనా. అయితే, ద్రవ లభ్యత కొరత ఏర్పడుతూనే ఉంది. 2018లో $ 1.5 ట్రిలియన్ వరకు ఉన్న ద్రవ్య లోటు ప్రస్తుతం $ రెండు ట్రిలియన్ వరకు పెరిగిందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ద్రవ్యలోటును తగ్గించడానికి తక్షణం పటిష్ట చర్యలు అమలు జరగాల్సిన అవసరం ఉంది. డిజిటల్ సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా ద్రవ్యలోటును తగ్గించడానికి చర్యలు అమలు చేయాలని నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే అంశంలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న,మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ద్రవ్యలోటు వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
ప్రస్తుత ప్రపంచ వాణిజ్య రంగంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో రెండు సదస్సులు జరగనున్నాయి. వాణిజ్య ద్రవ్యలోటును భర్తీ చేసే అంశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్థిక అభివృద్ధి సంస్థలు, ఎగుమతి రుణ సంస్థలు పోషించాల్సిన పాత్రపై ఒక సదస్సులో చర్చలు జరుగుతాయి. 2వ సదస్సులో డిజిటలైజేషన్, ఫిన్‌టెక్ ద్వారా ద్రవ్య లభ్యత ఏ విధంగా మెరుగు పరచవచ్చు అన్న అంశంపై చర్చలు జరుగుతాయి.
సదస్సు 1: వాణిజ్య ద్రవ్యలోటును భర్తీ చేసే అంశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్థిక అభివృద్ధి సంస్థలు, ఎగుమతి రుణ సంస్థలు పోషించాల్సిన పాత్ర
సంధానకర్త: శ్రీమతి లతా వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీఎన్బీసీ టీవీ18
ప్యానెల్ సభ్యులు: శ్రీ స్టీవెన్ బెక్, ట్రేడ్ ఫైనాన్స్ హెడ్, ఏడీబీ, ప్రొఫెసర్ ఆండ్రియాస్ క్లాసెన్, ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రొఫెసర్, డైరెక్టర్,ఐఎఫ్టీఐ అఫెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం, జర్మనీ, శ్రీ గౌరవ్ భట్నాగర్, మేనేజింగ్ డైరెక్టర్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
అంతర్జాతీయ వాణిజ్య, ద్రవ్య రంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, భవిష్యత్తుపై సదస్సులో సూక్ష్మ స్థాయిలో చర్చలు జరుగుతాయి. సదస్సులో చర్చకు వచ్చే ముఖ్య అంశాలు:
1. మహమ్మారి నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో నెలకొన్న వాణిజ్య, వాణిజ్య ద్రవ్య పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లుల ప్రభావం
2. ప్రైవేట్ రంగంలో తగ్గిన రుణ పరపతి, ద్రవ్యోల్బణం వల్ల బ్యాంకు రుణ పరిమితులపై కోతలతో సహా వాణిజ్య ఆర్థిక లోటుకు దారి తీస్తున్న పరిస్థితులు
3. వాణిజ్య ద్రవ్య అవసరాలు తీర్చడంలో ఎగుమతి క్రెడిట్ సంస్థల పాత్ర
సదస్సు 2: వాణిజ్య ద్రవ్య అవసరాలు తీర్చడానికి డిజిటలైజేషన్, ఫిన్‌టెక్ వినియోగం
సంధానకర్త: శ్రీమతి తమన్నా ఇనామ్దార్, టైమ్స్ గ్రూప్
ప్యానెల్ సభ్యులు: శ్రీ జాన్ డ్రమ్మండ్, OECD ట్రేడ్ ఇన్ సర్వీసెస్ డివిజన్ హెడ్, శ్రీ ఫరీద్ అలసలీ, అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాల డిప్యూటీ గవర్నర్, సౌదీ అరేబియా, శ్రీ . కేతన్ గైక్వాడ్,ఎండ్,సీఈఓ రిసీవబుల్స్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
వాణిజ్య రంగం డిజిటలైజేషన్‌లో వస్తున్న మార్పులపై సదస్సు చర్చిస్తుంది. వాణిజ్య సంస్థలకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ లకు అవసరమైన నిధులు అందుబాటులోకి తెచ్చే అంశంలో డిజిటలైజేషన్, సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సహకరిస్తాయి అన్న అంశంపై సదస్సు చర్చిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ రంగం, ఆవిష్కరణలు, సామర్ధ్య అభివృద్ధి ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి నిధులు సమకూర్చడానికి గల అవకాశాలను సదస్సులో చర్చిస్తారు. సదస్సులో చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాలు:
1. వాణిజ్య పర్యావరణ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించడానికి అధునాతన సాంకేతికతలను ఆవిష్కరించడానికి బహుళ వాటాదారులతో కలిసి పని చేయడం ద్వారా వాణిజ్య ద్రవ్య రంగాన్ని డిజిటల్ విధానంలో అమలు చేయడం
2. అధిక-ధర సేవలు, సైబర్ సెక్యూరిటీ భద్రతకు అమలు చేస్తున్న చర్యల వల్ల ఏర్పడిన అవాంతరాలను అధిగమించడానికి, సమయం ఖర్చు ఆదా చేయడానికి ఎంఎస్ఎంఈ రంగంలో తక్కువ-విలువ లేదా ఒకే లావాదేవీల కోసం డిజిటల్ వ్యవస్థ అమలు
3. నెట్‌వర్క్ డేటా, నిజ-సమయ చెల్లింపు ప్రవర్తనలు, SaaS ఆధారిత సాంకేతికతలు, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వంటి ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం అమలు.
***
(Release ID: 1911325)
Visitor Counter : 335