హోం మంత్రిత్వ శాఖ

చత్తీస్ ఘడ్ జగదల్పూర్లో జరిగిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్) 84 వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా.


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో , భద్రతా బలగాలు గత 9 సంవత్సరాలుగా భీకర పోరు చేస్తూ, వామపక్ష తీవ్రవాదంపై నిర్ణయాత్మక విజయం సాధించాయి.

–సిఆర్పిఎఫ్ తొలిసారిగా తన వ్యవస్థాపక దినోత్సవానిన, వామపక్ష తీవ్రవాదానికి కేంద్ర బిందువైన ఛత్తీస్ఘడ్లోని బస్తర్లో నిర్వహించింది.

ఇది దేశం మొత్తానికి గర్వకారణం.

–దేశ అంతర్గత భద్రత, శాంతికి ప్రజలు సిఆర్పిఎఫ్ జవాన్లపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. సిఆర్పిఎఫ్ , ధైర్యసాహసాలకు పెట్టింది పేరు.
‌‌
– వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో, జమ్ము కాశ్మీర; ఈశాన్యరాష్ట్రాలలో సిఆర్పిఎఫ్ గర్వించదగ్గ పాత్రను పోషించింది.

–ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతంలో హింస బాగా తగ్గింది.
దీనితో ఇప్పుడు, ఈ ప్రాంతాలలో, సమాజంలోని అట్టడుగు వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి.

–దశాబ్దాల కాలం పాటు వామపక్ష తీవ్రవాదానికి బలంగా ఉంటూ వచ్చిన బీహార్, జార్ఖండ్ లలోని బుద్ధ పహాడ్
చక్రబంధ, పరశ్ నాథ్ ప్రాంతాలను వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి చేయడం జరిగింది..

–గిరిజన ప్రాంతాల అభివృద్దికి అడ్డంకిగా నిలిచి వామపక్ష

Posted On: 25 MAR 2023 2:13PM by PIB Hyderabad

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా , ఛత్తీస్ఘడ్లోని జగదల్ పూర్ లో జరిగిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా పరేడ్ లో వందన స్వీకారం చేశారు. శ్రీ అమిత్ షా  బస్తర్ డివిజన్ కు ప్రసార భారతి న్యూస్ బులిటన్ ను హాల్బి భాషలో ప్రారంభించారు.

అ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,    సిఆర్పిఎఫ్ ఏర్పడిన తర్వాత , వామపక్ష తీవ్ర వాదం  ప్రారంభమైన తర్వాత, తొలిసారిగా సి.ఆర్.పి.ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని చత్తీస్ఘడ్లో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. చత్తీస్ఘడ్లో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో 763 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం వా మపక్ష తీవ్రవాదంపై తమ పోరాటం నిర్ణయాత్మక స్థాయికి చేరుకున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు అమరులైన జవాన్ల త్యాగం గొప్పదని అన్నారు.

    జమ్ము కాశ్మీర్ లో , ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన అయినా లేక వామపక్ష తీవ్రవాదాన్ని అంతంచేసి గిరిజనుల వద్దకు అభివృద్దిని తీసుకువెళ్ళడంలో
అయినా , సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ రంగంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన కొనియాడారు.
దేశ అంతర్గత భద్రతలో సిఆర్ పిఎఫ్ సువర్ణ చరిత్రను లిఖించిందని,  జవాన్ల స్ఫూర్తి, ధైర్య సాహసాలు, త్యాగంతో ఈ చరిత్ర నిండిపోయినదని ఆయన అన్నారు.
సిఆర్ పి ఎఫ్ కు సంబంధించిన , 174 కోట్ల రూపాయల వ్యయం కాగల మూడు అభివృద్ధి ప్రాజెక్టులను  శ్రీ అమిత్ షా ఈరోజు ప్రారంభించారు.
  ఆకాశవాణి, ప్రసార భారతి వారపు వార్తా బులిటన్ ను హాల్బి భాషలో ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు అమిత్ షా చెప్పారు. చత్తీస్ఘడ్ లో గిరిజన భాషలో ఆలిండియా రేడియో, దూరదర్శన్లు తొలి వార్తా బులిటన్ ను ప్రారంభించినందుకు కేంద్ర మంత్రి, అభినందనలు తెలిపారు. ఇది మన స్థానిక భాషలను బలోపేతం చేయడమే కాక, ఈ ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గల విశేషాలను తెలుసుకోగలుగుతారని ఆ రకంగా ప్రపంచపరిణామాలు, దేశ పరిణామాలతో వారు అనుసంధానం కాగలుగుతారని ఆయన అన్నారు.
సిఆర్పిఎఫ్ మహిళా మోటార్ సైకిల్ బృందానికి సంబంధించి ఫ్లాగ్ ఇన్ కార్యక్రమం కూడా ఈరోజు ఉన్నట్టు శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ 75 మంది సిఆర్ పిఎఫ్ మహిళా జవాన్లు 38 మోటారు సైకిళ్లపై 1848 కిలోమీటర్ల దూరం ప్రయాణించారన్నారు. వీరు దీనిని  2023 మార్చి 9న ప్రారంభించారని ఆయన చెప్పారు. ఈ మహిళా జవాన్ల ధైర్యసాహసాలు, నారీశక్తి గురించి దేశం మొత్తానికి తెలియజెప్పాయని ఆయన అన్నారు.
సిఆర్ పి ఎఫ్ ను 1939 జూలై 27న ఏర్పాటు చేశారు. అయితే దీనికి ఆధునిక రూపాన్ని , దేశ తొలి హోం మంత్రి , ఉక్కు మనిషి, శ్రీ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్
ఇచ్చారని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. 1949 డిసెంబర్ 28న సర్దార్ పటేల్ ఈ దళానికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా నామకరణం చేశారు.
అలాగే మార్చి 19న ఈ దళానికి ఇన్ సిగ్నియాను ఇచ్చారు. ఒకే ఒక బెటాలియన్ తో ప్రారంభమైన ఈ దళం, ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద సిఎపిఎఫ్ దళమని ఆయన చెప్పారు.
దీనికి 246 బెటాలియన్లు, 4 జోనల్ కేంద్ర కార్యాలయాలు, 21 సెక్టర్ హెడ్ క్వార్టర్లు, 2 ఆపరేషనల్ సెక్టర్ హెడ్ క్వార్టర్లు, 17 ఆపరేషనల్ రేంజ్లు, 42 అడ్మినిస్ట్రేటివ్ రేంజ్లు 3.25 లక్షల మందికిపైగా సిబ్బంది ఉన్నారన్నారు. 1959 అక్టోబర్ 21న  లద్దాక్ లో హాట్ స్ప్రింగ్ వద్ద  చైనా సైన్యంతో పోరాడుతూ , సిఆర్పిఎఫ్ జవాన్లు అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించారని, కొందరు అమరత్వం పొందారని అన్నారు. వారి అమరత్వాన్ని స్మరించుకుంటూ 21 అక్టోబర్ను పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారని శ్రీ అమిత్ షా తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని చాణక్యపురిలో నేషనల్ పోలీస్ మొమోరియల్ కట్టించారని తెలిపారు. అక్కడ ప్రతి సంవత్సరం, అక్టోబర్ 21న అమరులైన పోలీసులకు నివాళులర్పించడం జరుగుతోందన్నారు.1965 ఏప్రిల్ 9న సిఆర్.పి.ఎఫ్ కచ్ ఎడారిలో సర్దార్ పోస్ట్ వద్ద  పాకిస్థాన్ సైన్యానికి గట్టిగా బుద్ధి చెప్పిందని, సి.ఆర్.పి.ఎఫ్ చూపిన సాహసానికి గుర్తుగా ఏప్రిల్ 9 వ తేదీన దేశం మొత్తం శౌర్యదివస్ జరుపుకుంటుందని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ భద్రతా బలగాలు , గత 9 సంవత్సరాలలో వామపక్ష తీవ్రవాదంపైన, అలుపెరుగని పోరాటం సాగించి అద్భుత విజయం సాధించాయని అమిత్ షా తెలిపారు. వామపక్ష తీవ్రవాదం వల్ల  అభివృద్ధి పథంలో ఏర్పడిన అడ్డంకులను సి.ఆర్.పి.ఎఫ్ తొలగించ గలిగిందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో
సిఆర్ పి ఎఫ్  , స్థానిక పోలీసుల సహాయంతో, స్థానిక పోలీసులను ప్రోత్సహిస్తూ, ఒక అద్భుతమైన బలగం గా రూపొందిందని, ఆ రకంగా అది తన సంస్థాగత   సామర్ధ్యాన్ని రుజువు చేసుకున్నదన్నారు.
2010 లో గరిష్ఠంగా ఉన్న వామపక్ష తీవ్రవాద ఘటనలు 76 శాతం తగ్గిపోయాయని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ప్రాణ నష్టం కూడా 78 శాతం తగ్గిందన్నారు. దీనికితోడు, సి.ఆర్.పి.ఎఫ్ వివిధ రాష్ట్రాల పోలీసులతో కలసి , వామపక్ష తీవ్రవాదాన్ని  నిలువరించేందుకు అంతర్ రాష్ట్ర సరిహద్దుల సానుకూలతలను వాడుకుంటూ సంయుక్త టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఇవాళ బుద్ధ పహాడ్, చకర్ బంద, పరస్ నాథ్లు వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి పొందాయని ఆయన తెలిపారు. ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యకలాపాలు, పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పారు. బీహార్,జార్ఖండ్ లలో భద్రత కు సంబంధించి కొరత తీరనున్నదని, ఇది సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు, పోలీసుల సమష్టి కృషితో సాథ్యం కానున్నదని తెలిపారు. వామపక్ష తీవ్రవాదులకు   నిధులు అందకుండా చేయడంలో, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నదని, ఎన్.ఐ.ఎ, ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వ అభివృద్ధి పనులు , వామపక్ష తీవ్ర వాద ప్రభావిత ప్రాంతాలలో అట్టడుగు స్థాయి వ్యక్తి వరకు చేరుతున్నాయని చెప్పారు.
అభివృద్ధి ప్రక్రియలో భాగంగా 70 వేల కిలోమీటర్ల రోడ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే 11 వేల కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు.
243  మొబైల్ టవర్లు ఏర్పాటయ్యాయని, ప్రాధాన్యతా ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. 5 సంవత్సరాల  వ్యవధిలోనే 1258 బ్యాంకు శాఖలు, 1348 ఏటిఎం లు, ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 47 ఐటిఐలు, 68 నైపుణ్య శిక్షణా కేంద్రాలు పూర్తి అయ్యాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంయుక్త కృషి, సిఆర్పిఎఫ్ బలగాలు, స్థానిక పోలీసుల సమన్వయంతో  అభివృద్ధి వేగం పుంజుకున్నదని అమిత్ షా తెలిపారు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
ఛత్తీస్ఘడ్, బస్తర్ బెటాలియన్ లో సుమారు 400 మందిని చేర్చుకున్నట్టు తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో
రోడ్లు నిర్మించడం జరిగిందని, 398 పెద్ద , చిన్న బ్రిడ్జిలు నిర్మితమయ్యాయని చెప్పారు.  ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే హర్ ఘర్ తిరంగా   అభియాన్ను సి.ఆర్.పి.ఎఫ్ విజయవంతం చేసిందని చెప్పారు. ఈ ప్రాంతంలో  25 లక్షలకు పైగా  త్రివర్ణపతాకాలను ఇళ్లపై ఎగురవేశారని చెప్పారు. ప్రధానమంత్రి నేతృత్వంలో సి.ఆర్.పి.ఎఫ్ ఆధునీకరణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. 2022‌‌–23 లోనే 14 ప్రాజెక్టులు పూర్తి చే యడం జరిగిందని, 4, 309 కోట్ల రూపాయల తో సిఆర్పిఎఫ్ వారి కోసం జగదల్ పూర్ లో ట్రామా కేర్ సెంటర్  ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే బెటాలియన్లలో మౌలిక సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో సంతృప్తి కలిగించేందుకు 11 వేల ఇళ్లను నిర్మించినట్టు చెప్పారు. మరో 28 ,500 ఇళ్లు సిఎపిఎఫ్ లకోసం  నిర్మితం కానున్నాయన్నారు. ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం కింద ప్రతి నెల బాలురకు 2,500 రూపాయలు, బాలికలకు 3000 రూపాయలు  అందజేయడం జరుగుతోందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లకు అండగా ఉంటుందని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. 84 సంవత్సరాల ఘన చరిత్ర గల సిఆర్పిఎఫ్  ను మరింత బలోపేతం చేయనున్నట్టు శ్రీ  అమిత్ షా చెప్పారు.ఈ దళం తల్లి బారతి
కి అంకిత భావంతో కృషి చేసి , పట్టుదలతో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడంలో, అంకితభావంతో తన కృషిని కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

***(Release ID: 1911317) Visitor Counter : 129