రక్షణ మంత్రిత్వ శాఖ
చిరుధాన్యాలతో రేషన్లను రీబూట్ చేస్తున్న సైన్యం
Posted On:
22 MAR 2023 1:19PM by PIB Hyderabad
చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో, భారతీయ సైన్యం సైనికుల రేషన్‌లో చిరుధాన్యాల పిండిని ప్రవేశపెట్టేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మైలురాయి నిర్ణయం సైనిక దళాలకు దేశీయ, సంప్రదాయ ధాన్యాలను అరశతాబ్దం తరువాత సరఫరా అయ్యేలా చూస్తుంది. ఐదు దశాబ్దాల కింద గోధుమ పిండిని సరఫరా చేయడం కోసం వీటిని నిలిపివేశారు.
సంప్రదాయ చిరుధాన్యాల వంటకాలు మన భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు తగినవి కావడమే కాక ఆరోగ్యకరమైన లాభాలను కలిగిస్తాయని రుజువు అయింది. దీనితోపాటుగా, జీవనశైలి వ్యాధులను నివారించడమే కాక దళాల సంతృప్తిని, ఉత్సాహ స్థాయిని పెంచుతాయి. దళాల రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు ఇప్పుడు అంతర్భాగం కానున్నాయి.
2023-24 సంవత్సరం నుంచి సైనికుల రేషన్‌లో తృణధాన్యాల (బియ్యం, గోధుమపిండి) అధీకృత అర్హతలో 25 శాతానికి మించికుండా చిరుధాన్యాల పిండిని సేకరించేందుకు ప్రభుత్వ అనుమతిని కోరడం జరిగింది. కొనుగోలు, సరఫరా అన్నవి చేసుకున్న ఎంపిక, పరిమాణ డిమాండ్ ఆధారంగా ఉంటాయి. ప్రజాదరణ పొందిన మూడు చిరుధాన్యాల పిండి - సజ్జలు, జొన్న & రాగి పిళ్ళను ఎంపికను పరిగణనలోకి తీసుకుని జారీ చేయడం జరుగుతుంది. చిరుధాన్యాలు మాంసకృతులు, సూక్ష్మ పోక్షకాలు, ఫైటో కెమికల్స్ వంటి ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా సైనికుల పౌష్టికాహార విలువను పెంచుతుంది.
అదనంగా, వ్యవస్థీకృత వేడుకలు, బారాఖానాలు,, కాంటీన్లు, ఇంటి వంటలలో చిరుధాన్యాలను విస్త్రతంగా ఉపయోగించేందుకు సూచనలను జారీ చేయడం జరిగింది. సంపూర్ణమైన, రుచికరమైన, పౌష్టికమైన చిరుధాన్యాల వంటకాలను తయారు చేసేందుకు చెఫ్‌లకు కేంద్రీకృత శిక్షణను చేపట్టడం జరిగింది. ఉత్తర సరిహద్దుల వెంట మోహరించిన సైనికులకు విలువ జోడించిన చిరుధాన్యాల వంటలను, స్నాక్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధను పెట్టడం జరిగింది. సిఎస్‌డి కాంటీన్లతో పాటుగా షాపింగ్ కాంప్లెక్స్‌లలో ప్రత్యేకంగా అరలను కేటాయించడం ద్వారా చిరుధాన్యాల వంటలను ప్రవేశపెట్టడం జరుగుతోంది. మీ చిరుధాన్యాలను తెలుసుకోండి అన్న శీర్షికతో అవగాహనా ప్రచారాలను విద్యా సంస్థలలో నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 1909736)
Visitor Counter : 171