పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశంలో 148 క్రియాశీలక విమానాశ్రయాల ద్వారా ఆపరేట్ అవుతున్న 17 షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్


718 ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసి) జారీ చేసిన డిజిసిఏ

ఉడాన్ కింద ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు రూ.2454 కోట్ల విజిఎఫ్ నిధులు విడుదల

Posted On: 20 MAR 2023 4:22PM by PIB Hyderabad

భారతదేశంలో 2023 మర్చి 9వ తేదీ నాటికి 17 షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ పనిచేస్తున్నాయి. ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసి)పై డిజిసిఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆమోదించిన విమానాల సంఖ్య 718. ప్రస్తుతం, దేశంలో క్రియాశీలకంగా పనిచేసే 148 విమానాశ్రయాలు ఉన్నాయి, ఇందులో 137 విమానాశ్రయాలు, 02 వాటర్ ఏరోడ్రోమ్‌లు మరియు 09 హెలిపోర్ట్‌లు ఉన్నాయి. 2017 మర్చి  నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 96 ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు మాత్రమే ఉండేవి. 

దేశవ్యాప్తంగా ఉడాన్ విమానాల నిర్వహణ కోసం 07.03.2023 నాటికి ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు విజిఎఫ్ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) కింద మొత్తం సుమారు రూ. 2454 కోట్లు విడుదలయ్యాయి. విమానయాన సంస్థలకు రాష్ట్రాల వారీగా విజిఎఫ్ వివరాలు కింద అనుబంధం లో ఉన్నాయి. 

అనుబంధం: 

ఈ ఏడాది మర్చి 7వ తేదీ నాటికి రాష్ట్రాల వారీగా వివిధ ఎయిర్లైన్స్ కి విడుదల చేసిన విజిఎఫ్ 

క్రమ సంఖ్య 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 

విడుదల చేసిన విజిఎఫ్ (కోట్ల రూపాయలలో)

1

నాగాలాండ్ 

21.80

2

సిక్కిం 

9.12

3

ఉత్తరఖండ్ 

42.34

4

పశ్చిమ బెంగాల్ 

84.15

5

ఒడిశా 

150.53

6

అరుణాచల్ ప్రదేశ్ 

38.81

7

ఆంధ్రప్రదేశ్ 

126.41

8

కర్ణాటక 

570.36

9

ఉత్తరప్రదేశ్ 

243.54

10

మధ్యప్రదేశ్ 

149.83

11

తమిళనాడు 

23.14

12

మహారాష్ట్ర 

282.22

13

ఛత్తీస్గఢ్ 

63.76

14

మేఘాలయ 

36.10

15

డయ్యు 

1.49

16

గుజరాత్ 

82.57

17

అస్సాం  

51.57

18

కేరళ 

105.09

19

హర్యానా 

0.66

20

పంజాబ్ 

86.42

21

రాజస్థాన్ 

176.05

22

హిమాచల్ ప్రదేశ్ 

47.57

23

ఝార్ఖండ్ 

1.29

24

త్రిపుర 

12.90

25

మిజోరాం 

3.93

26

మణిపూర్ 

12.57

27

బీహార్ 

10.15

28

ఢిల్లీ 

18.52

29

తెలంగాణ 

1.40

మొత్తం 

2454.29

 

 పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

                                                                                                                                         *****



(Release ID: 1908999) Visitor Counter : 107