పర్యటక మంత్రిత్వ శాఖ

దేశంలో వైద్య పర్యాటకాన్ని పెంపొందించేందుకు మెడికల్, మెడికల్ వెల్నెస్ టూరిజం రోడ్మ్యాప్, జాతీయ వ్యూహాన్ని కేంద్ర పర్యాటకశాఖ రూపొందించింది.

Posted On: 20 MAR 2023 5:57PM by PIB Hyderabad

దేశంలో వైద్య పర్యాటకాన్ని పెంపొందించేందుకు మెడికల్,  మెడికల్ వెల్నెస్ టూరిజం రోడ్మ్యాప్, జాతీయ వ్యూహాన్ని కేంద్ర పర్యాటకశాఖ రూపొందించింది. ఈ వ్యూహం కిందిన కీలక అంశాలను గుర్తించింది.


 1. వెల్నెస్ గమ్యంగా భారత్కు బ్రాండ్ను అభివృద్ధి చేయడం.

2. మెడికల్ , వెల్నెస్ వాతావరణాన్ని బలోపేతం చేయడం.

3. ఆన్లైన్ మెడికల్ వాల్యూ ట్రావెల్ (ఎంవిటి) పోర్టల్ ను ఏర్పాటు చేసి డిజిటలైజేషన్ కు వీలు కల్పించడం.

4. మెడికల్ వాల్యూ ట్రావెల్ అందుబాటును పెంపొందించడం.
5. వెల్నెస్ టూరిజం ను ప్రొత్సహించడం
6. గవర్నెన్స్, వ్యవస్థాగత ఫ్రేమ్వర్క్ 

కేంద్ర కేబినెట్ 30‌‌–11–2016 నాటి నిర్ణయానికి అనుగుణంగా ఈ టూరిస్ట్ వీసా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసింది. ఈ టూరిస్ట్ వీసా  పథకాన్ని ఈ వీసా పథకంగా మార్చారు.
ప్రస్తుతం ఈ మెడికల్ వీసా ఉంది. దీని ఉప కేటగిరీగా ఈ మెడికల్ అటెండెంట్ వీసా  ఉంది.

ఈ మెడికల్ వీసా, ఈ మెడికల్ అటెండెంట్ వీసా లలో  ట్రిపుల్ ఎంట్రీని అనుమతిస్తారు. ఆయా సందర్భాలను బట్టి దీనిని ఆరు నెలల పాటు పొడిగిస్తారు. దీనిని సంబంధిత ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్,
పారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పొడిగిస్తారు. మెడికల్ అటెండెంట్వీసా , ప్రధాన ఈ వీసా దారు వీసా గడువు మిగియగానే ముగిసిపోతుంది.

దీనికితోడు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ , దేశంలో మెడికల్ వాల్యూ ట్రావెల్ను ప్రోత్సహించేందుకు వివిధ ఇతర మంత్రిత్వశాఖలతో కలిసి పనిచేస్తోంది.
వివిధ మంత్రిత్వశాఖలు, ఆస్పత్రులు, ఎం.వి.టి ఫెసిలిటేటర్లు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఎన్.ఎ.బి.హెచ్ తదితరాలతో   ఈ రంగంలోని సవాళ్లను అవకాశాలపై విస్త్రుతంగా చర్చిస్తోంది. 
 కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈరోజు ఈ సమాధానాన్ని  లోక్సభకు ఇచ్చారు.

***



(Release ID: 1908998) Visitor Counter : 154