కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
భారత దేశ అధ్యక్షతన లేబర్ 20 ప్రారంభ సమావేశానికి అమృత్ సర్ విచ్చేసిన 20 దేశాల ప్రతినిధులు, నిపుణులు
Posted On:
18 MAR 2023 5:48PM by PIB Hyderabad
20 దేశాలకు చెందిన ట్రేడ్యూనియన్ ప్రతినిధులు, నిపుణులు, కార్మిక నాయకులు , ఇండియా నుంచి ట్రేడ్ యూనియన్ నాయకులు,
నిపుణులు లేబర్ 20 (ఎల్ –20) ప్రారంభ సమావేశానికి పంజాబ్ లోని అమృత్ సర్ తరలి వస్తున్నారు. ప్రపంచంలోని అత్యున్నత అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల అంతర్జాతీయ గ్రూప్లో జి–20 కీలకమైనది.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఎల్ 20 ప్రారంభ సమావేశంలో ప్రతినిధులతో మాట్లాడనున్నారు. 2023లో ఇండియాకు జి20 అధ్యక్ష బాధ్యతలు లభించడం చరిత్మాత్మక మైనది. కీలక అంతర్జాతీయ విషయాలలో పరస్పర సమన్వయానికి ఇది కీలక సమయం.
భారతదేశపు అతిపెద్ద కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ లేబర్ 20 చర్చలకు ఆతిథ్యం ఇస్తోంది. బిఎం.ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ హిరణ్మయ్ పాండే ఎల్ 20 కి అధ్యక్షత వహిస్తారు. ఆయన పంజాబ్లోని అమృత్సర్ లో జరిగే ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పలు ఇతర ప్రముఖ ట్రేడ్ యూనియన్లకు చెందిన నాయకులు కూడా ఇందులో పాల్గొననున్నారు.
మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో మాట్లాడుతూ బి.ఎం.ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ హిరన్మయ్ పాండే, ఎల్.20 సమావేశం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. ఈ ప్రారంభ సమావేశం సుస్థిర జీవనోపాధి విధానాలు,ఉపాధి సంబంధిత అంశాలను చర్చించనున్నారు. అలాగే సార్వత్రిక సామాజిక భద్రత, అంతర్జాతీయంంగా కార్మికుల వలసలు, సామాజిక భద్రతా నిధుల పోర్టిబిలిటీ, ఎలాంటి ఉపాధి భద్రత, కార్మిక ప్రయోజనాలకు నోచుకోని వారి సమస్యలు, నైపుణ్యాభివృద్ధి, నైపుణ్యాల స్థాయి పెంపు, యాజమాన్యాల , ఉద్యోగుల, ప్రభుత్వాల విధులు బాధ్యతలు వంటి అంశాలపై ప్రారంభ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా పనిలో వస్తున్న మార్పులు, జి–20 దేశాలలో నూతన ఉపాధి అవకాశాలు, సుస్థిర గౌరవప్రదమైన పని,
వేతనాలపై ఆయా దేశాల అనుభవాలను పంచుకోవడం, మహిళలు, భవిష్యత్ పని పరిస్థితులు వంటి అంశాలపై కూడా ఎల్ 20 ప్రారంభ సదస్సులో చర్చించనున్నారు.
కార్మిక సమస్యలపై నిపుణులు ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా, డాక్టర్ ప్రవీణ్ సిన్హా, ప్రొఫెసర్ రవిశ్రీవాత్సవ్, అడ్వకేట్ సి.కె.సాజి నారాయణన్, తమిళనాడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ .సంతోష్ కుమార్, బిలాస్ పూర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎ.డి.ఎన్ . వాపేయీ కూడా ఈ చర్చలలో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను తెలియజేస్తారు. అలాగే వివిధ జి 20 దేశాలకు చెందిన కార్మికరంగ నిపుణులు, కార్మిక నాయకులు, కార్మిక సంస్థలు, ఎంపిక చేసిన స్నేహపూర్వక దేశాల
ప్రతినిధులు పై అంశాలపై చర్చిస్తారు.
జి 20: గ్రూప్ ఆఫ్ 20, అంతర్జాతీయ ఆర్దిక సహకారానికి సంబంధించిన ప్రముఖ ఫోరం. అంతర్జాతీయ వ్యవస్థ, అన్ని అంతర్జాతీయ ఆర్ధిక
పాలనకు ఒక రూపునిచ్చి దానిని బలోపేతం చేయడం వంటి అంశాలలో కీలక పాత్ర పోషిస్తుంది. 2023లో జి 20కి ఇండియా అధ్యక్షత వహిస్తోంది.
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు చూడండి: https://www.g20.org/en/
ఎల్ 20: జి 20 లోని 11 చర్చా గ్రూప్లలో ఇది ఒకటి. ఇది ప్రభుత్వేతర కృషికి సంబంధించినది. ఎల్ 20, కార్మికులు, ఉపాధి కి సంబంధించి, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థుతుల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తుంది. మరిన్ని వివరాలకు : https://www.l20india.org/.
బి.ఎం.ఎస్ : భారతీయ మజ్దూర్ సంఘ్ భారతదేశపు అతిపెద్ద కార్మిక సంస్థ. ఇది లేబర్ 20 ( ఎల్ 20) కి నాయకత్వం వహిస్తోంది. ఇది జి 20లోని 11 గ్రూప్లలో ఒకటి . మరిన్ని వివరాలకు https://bms.org.in/.
***
(Release ID: 1908622)
Visitor Counter : 154