సహకార మంత్రిత్వ శాఖ
గుజరాత్ గాంధీనగర్ లో ఈరోజు ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నిర్వహించిన పాడి పరిశ్రమ 49వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రపంచంలో అతి పెద్ద పాల ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ముమ్మర చర్యలు అమలు జరుగుతున్నాయి.. శ్రీ అమిత్ షా
ఎగుమతులు ప్రోత్సహించడానికి బహుళ రాష్ట్ర సహకార ఎగుమతి సంఘం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ .. శ్రీ అమిత్ షా
ప్రతిపాదిత 2 లక్షల గ్రామీణ డెయిరీలతో కలిసి బహుళ రాష్ట్ర సహకార ఎగుమతి సంఘం పనిచేయడం ద్వారా పాల ఉత్పత్తుల ఎగుమతులు 5 రెట్లు పెరిగే అవకాశం .. శ్రీ అమిత్ షా
శ్వేత విప్లవం-2 సాధన కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కృషి సాగుతోంది .. శ్రీ షా
ప్రపంచానికి పాడి పరిశ్రమ ఒక వ్యాపార రంగం అయితే భారతదేశంలో పాడి పరిశ్రమ ఉపాధి కల్పన రంగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, పౌష్టికాహార లోపం సమస్య పరిష్కారానికి, మహిళలకు సాధికారత కల్పిస్తున్న రంగం గా ఉంది .. శ్రీ అమిత్ షా
దేశానికి స్వాతంత్య్రం సాధించిన తర్వాత 1948లో ఆవిర్భవించిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్ దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.. శ్రీ అమిత్ షా
Posted On:
18 MAR 2023 3:32PM by PIB Hyderabad
గుజరాత్ గాంధీనగర్ లో ఈరోజు ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నిర్వహించిన పాడి పరిశ్రమ 49వ సదస్సులో ముఖ్య అతిథిగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పాల్గొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తో సహా పలువురు ప్రముఖులు సదస్సుకు హాజరయ్యారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. 130 కోట్ల జనాభా కలిగి ఉన్న భారతదేశంలో పాడి పరిశ్రమ రంగం భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందించడంతో పాటు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, పౌష్టిక ఆహార సరఫరా,మహిళలకు సాధికారత కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలు పాడి పరిశ్రమ రంగాన్ని ఒక వాణిజ్య రంగంగా పరిగణిస్తున్న సమయంలో భారతదేశంలో పాడి పరిశ్రమ రంగం బహుళ రంగ వ్యవస్థగా రూపు దిద్దుకుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు అమలు జరుగుతున్నాయని శ్రీ అమిత్ షా వివరించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన సహకార డెయిరీ రంగం దేశాభివృద్ధికి తన వంతు సహకారం అందించిందన్నారు. సహకార డెయిరీ వ్యవస్థ వల్ల మహిళలు అభివృద్ధి సాధించి ఆర్థిక సాధికారత సాధించారని శ్రీ షా పేర్కొన్నారు. ' సహకారం ద్వారా సమృద్ధి' నినాదంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు అని శ్రీ షా వివరించారు.
దేశానికి స్వాతంత్య్రం సాధించిన తర్వాత 1948లో ఆవిర్భవించిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్ దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది అని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రపంచంలో భారత డెయిరీ రంగాన్ని ప్రపంచంలోనే పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అమలు చేయాల్సిన చర్యలపై చర్చించి సదస్సు సూచనలు అందించాలని శ్రీ షా సూచించారు. దేశ జిడిపి ఆదాయంలో 4.5% ఆదాయాన్ని పాడి పరిశ్రమ అందిస్తున్నదని శ్రీ షా అన్నారు. వ్యవసాయ రంగానికి పాడి పరిశ్రమ ద్వారా 10 లక్షల కోట్ల రూపాయల ఆదాయం (23%) సహకారం అందిస్తున్నదని తెలిపిన శ్రీ షా ప్రపంచంలోనే అత్యధికమని అన్నారు. పాడి పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం అని పేర్కొన్న శ్రీ షా ఈ రంగం ద్వారా 9 కోట్ల గ్రామీణ కుటుంబాలకు చెందిన దాదాపు 45 కోట్ల మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు అని వివరించారు. ముఖ్యంగా సన్నకారు రైతులు, మహిళలు పాడి పరిశ్రమతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారని శ్రీ షా అన్నారు.
గత దశాబ్దంలో డెయిరీ రంగం వార్షికంగా 6.6 శాతం వృద్ధి సాధించిందని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ, జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి), పశుసంవర్ధక శాఖ దేశంలోని 2 లక్షల పంచాయతీలలో గ్రామీణ డెయిరీలను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నాయని శ్రీ షా వెల్లడించారు. దీనివల్ల పది పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి సాధించి 13.80 వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆయన అన్నారు. రోజుకు దాదాపు 126 మిలియన్ లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యం భారతదేశం కలిగి ఉందని చెప్పిన శ్రీ షా ఇది ప్రపంచంలోనే అత్యధికమని అన్నారు. మొత్తం పాల ఉత్పత్తిలో 22 శాతం పాలు ప్రాసెస్ అవుతున్నాయని దీనివల్ల ఆదాయం పెరిగి రైతులు ప్రయోజనం పొందుతున్నారని శ్రీ షా చెప్పారు. పాల ఉత్పత్తుల ఎగుమతిల్లో పాలపొడి, వెన్న, నెయ్యి వంటి ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎగుమతులు మరింత పెరగడానికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల కోసం బహుళ రాష్ట్ర సహకార సంఘాన్ని ఏర్పాటు చేసిందని, దీనిని 2 లక్షల గ్రామీణ డెయిరీలతో అనుసంధానం చేయడం ద్వారా ఎగుమతులు 5 రెట్లు పెరిగే అవకాశం ఉందన్నారు.
దేశంలో 1970 నాటికి రోజుకు 6 కోట్ల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి ఉండడంతో దేశం పాల కొరత ఎదుర్కొందని శ్రీ షా తెలిపారు.2022 నాటికి రోజుకు 58 కోట్ల లీటర్ల పాలు దేశంలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపిన శ్రీ షా దీనిలో డెయిరీ రంగం కీలక పాత్ర పోషించిందన్నారు.1970 నుంచి 2022 వరకు దేశ జనాభా 4 రెట్లు పెరిగితే పాల ఉత్పత్తి 10 రెట్లు పెరిగిందని ఆయన అన్నారు. తలసరి పాల వినియోగం కూడా పెరిగిందన్నారు. 1970లో దేశంలో తలసరి పాల వినియోగం 107 గ్రాములుగా ఉండగా నేడు తలసరి వినియోగం 427 గ్రాములకు పెరిగిందని, ఇది ప్రపంచ సగటు 300 గ్రాములకు మించి ఉందన్నారు. పాడి పరిశ్రమ రంగం అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని శ్రీ షా హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద పాలను ఎగుమతి చేసే దేశంగా భారతదేశం అభివృద్ధి సాధించేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్రీ షా అన్నారు.
దేశంలో శ్వేత విప్లవం-2 రావాల్సిన అవసరం ఉందని శ్రీ షా స్పష్టం చేశారు. శ్వేత విప్లవం-2 సాధించే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. పాడి పరిశ్రమ రంగంలో ఆదాయం, పోషకాహారం, పశువుల సంరక్షణ, మానవ ప్రయోజనాల పరిరక్షణ, ఉపాధి, మహిళా సాధికారత వంటి అన్ని అంశాలను స్పృశిస్తూ సహకార వ్యవస్థను అమలు చేస్తామని ఆయన అన్నారు. రైతులు, వినియోగదారుల మధ్య మధ్య దళారుల బెడద లేకుండా చూస్తామని తెలిపిన శ్రీ షా దీనివల్ల రైతులు గరిష్ట లాభం పొందుతారని శ్రీ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం డెయిరీ రంగం లో సహకార స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 21% పాలు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయని శ్రీ షా తెలిపారు. దీనికి అమూల్ మోడల్ ఎంతగానో దోహదపడిందని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో డెయిరీ రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన అన్నారు. దేశంలో 2 లక్షల ప్రాథమిక పాల ఉత్పత్తి సొసైటీలు ఏర్పాటయ్యాక ప్రపంచ పాల ఉత్పత్తిలో 33 శాతం భారత్‌లోనే జరిగే అవకాశం ఉందన్నారు. సహకార వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయని శ్రీ షా చెప్పారు. పాల ఉత్పత్తి తో పాటు పాల ప్రాసెసింగ్ పరికరాల రంగంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించాలన్నారు. 2033-34 నాటికి దేశంలో ప్రతి సంవత్సరం 330 ఎంఎంటీ పాలు ఉత్పత్తి అయ్యేలా చూసేందుకు చర్యలు అమలు చేస్తున్నామని శ్రీ షా తెలిపారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పాలులో 33 శాతం పాలు భారతదేశంలో ఉత్పత్తి అవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని శ్రీ షా అన్నారు.
***
(Release ID: 1908444)
Visitor Counter : 390