భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశం యొక్క విస్తారమైన సముద్ర వనరులను అన్వేషించడానికి మునుపటి ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని, శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సముద్ర వనరులను అన్వేషించడానికి మరియు ఉపయోగించుకోవడానికి మరియు భారతదేశం యొక్క నీలి ఆర్థికాభివృద్ధి కి ప్రాధాన్యత ఇవ్వడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతుందని అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ రోహన్ ఖౌంటే నేతృత్వంలోని గోవా మంత్రుల బృందం ఇతర సీనియర్ అధికారులతో కలిసి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను న్యూఢిల్లీలో కలుసుకుంది.
Posted On:
18 MAR 2023 4:09PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి ఎర్త్ సైన్సెస్ (స్వతంత్ర బాధ్యత), పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ భారతదేశంలోని విస్తారమైన సముద్ర వనరులను అన్వేషించడానికి మునుపటి ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి సముద్ర వనరులను అన్వేషించడానికి మరియు ఉపయోగించుకోవడానికి మరియు భారతదేశం యొక్క నీలి ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలలో ఒకటి కాదు, రెండుసార్లు డీప్ ఓషన్ మిషన్ గురించి ప్రస్తావించారని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ మరియు గోవా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే నేతృత్వంలోని ఉన్నత స్థాయి గోవా అధికారిక ప్రతినిధి బృందంతో మాట్లాడారు. గోవా రాష్ట్రంలో పర్యాటకం మరియు సముద్ర సంబంధిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి వివిధ సంభావ్య ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ప్రతినిధి బృందం ఆయనను కలిసింది.
గోవా టూరిజం మంత్రి రోహన్ ఖౌంటే మరియు ఆయన శాఖ అధికారుల బృందం ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ క్రింద వివిధ పథకాల కోసం కొన్ని ప్రతిపాదనలను డాక్టర్ జితేంద్ర సింగ్ ముందు ఉంచారు. ప్రతిపాదనలను పరిశీలిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి హామీ ఇస్తూ, గత ఏడాది మాత్రమే భారత ప్రభుత్వం ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత ప్రక్షాళన 75 రోజుల పాటు కొనసాగింది, 17 సెప్టెంబర్ 2022 నాటికి మొత్తం తీరం మరియు ప్రత్యేకంగా కేటాయించిన 75 బీచ్‌లు శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఓషన్ అక్వేరియంను రూపొందించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు, దీని కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం తొలిసారిగా నీలి ఆర్థిక వ్యవస్థ కింద భారతదేశంలోని సముద్ర వనరులను అన్వేషించడం ప్రారంభించిందని, తదుపరి కాలంలో భారీ సంభావ్యత కలిగిన పలు అభివృద్ధి పథకాలు అమలు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు విపరీతమైన విలువను అందజేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ సముద్ర వనరులను గతంలో 25 సంవత్సరాలు ఎన్నడూ అన్వేషించలేదని ఆయన తెలిపారు.
హిందూ మహాసముద్ర ప్రాంత సముద్ర ఆర్థిక కార్యకలాపాలలో స్మార్ట్, స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధి మరియు అవకాశాలను ప్రోత్సహించడం మరియు సముద్ర వనరులు, పరిశోధన మరియు అభివృద్ధి యొక్క స్థిరమైన వినియోగం కోసం తగిన కార్యక్రమాలను ప్రారంభించడం నీలి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యం అని కేంద్ర మంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ముందుకు వస్తున్న తీరును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అభినందించారు.
***
(Release ID: 1908442)
Visitor Counter : 207