ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ చేసి సంస్థలో ప్రభుత్వం కలిగి ఉన్న వాటాలో కొంత భాగాన్ని తాజా ఈక్విటీ షేర్లు జారీ ద్వారా అదనపు నిధులు సేకరించడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
17 MAR 2023 7:24PM by PIB Hyderabad
ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ చేసి సంస్థలో ప్రభుత్వం కలిగి ఉన్న వాటాలో కొంత భాగాన్ని తాజా ఈక్విటీ షేర్లు జారీ ద్వారా అదనపు నిధులు సేకరించడానికి ఐఆర్ఈడిఏ అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయించింది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కక్కటి 10 రూపాయల ముఖ విలువ కలిగిన 13.90 లక్షల ఈక్విటీ వాటాలను ఐపీవో ద్వారా విడుదల చేయడానికి 2017 జూన్ నెలలో ఐఆర్ఈడిఏ కి సీసీఏఏ ఇచ్చిన అనుమతి రద్దు అవుతుంది. కొత్తగా 1500 కోట్ల రూపాయల పెట్టుబడి సమీకరించాలని 2022 మార్చి నెలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి మూలధనం వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండటంతో తాజా నిర్ణయం అమలు జరుగుతుంది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల ఐపీవో ద్వారా ప్రభుత్వ పెట్టుబడి విలువ పెరగడంతో పాటు జాతీయ అభివృద్ధిలో ప్రజలు వాటాల రూపంలో పాలుపంచుకుని లాభం పొందడానికి అవకాశం కలుగుతుంది. విస్తరణ కార్యక్రమాలకు అవసరమైన పెట్టుబడి కోసం ప్రజాధనాన్ని కాకుండా సొంత నిధులు ఉపయోగించడానికి ఐఆర్ఈడిఏ కి అవకాశం లభిస్తుంది. మార్కెట్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా నిధులు ఉపయోగించడానికి ఐఆర్ఈడిఏ కృషి చేస్తుంది.
ప్రభుత్వ రంగ సంస్థగా పనిచేస్తున్న ఐఆర్ఈడిఏ మినీ రత్న ( తరగతి-I)గా గుర్తింపు పొందింది. 1987లో ఏర్పాటైన ఐఆర్ఈడిఏ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఇంధన సామర్థ్య సంస్థలకు అవసరమైన నిధులు అందిస్తుంది. ఆర్బీఐ లో నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థగా ఐఆర్ఈడిఏ నమోదయ్యింది.
వాతావరణ మార్పులపై కుదిరిన ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా 2022 నాటికి 175 గిగావాట్ల విద్యుత్తును, 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. భారతదేశం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వాణిజ్య సరళిలో ఐఆర్ఈడిఏ అమలు చేసే ప్రాజెక్టుల వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
***
(Release ID: 1908303)
Visitor Counter : 183