వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోధుమల 6వ ఇ-వేలం నిర్వహించిన భారత ఆహార సంస్థ


23 ప్రాంతాల్లో 611 డిపోల నుంచి 10.69 ‘ఎల్‌ఎంటి’ల విక్రయానికి నిర్ణయం;

ప్రస్తుత వేలంలో 970 మంది పాటదారులకు 4.91 ‘ఎల్‌ఎంటి’ గోధుమల అమ్మకం

Posted On: 16 MAR 2023 12:24PM by PIB Hyderabad

   గోధుమలు, గోధుమ పిండి ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ జోక్యంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) 15.03.2023న వారంవారీ గోధుమల 6వ ఇ-వేలం నిర్వహించింది. ఈ మేరకు 23 ప్రాంతాల్లోని 611 డిపోల నుంచి 10.69 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటి) గోధుమలను విక్రయానికి పెట్టింది. తదనుగుణంగా ఇ-వేలంలో పాల్గొన్న 970 మంది పాటదారులకు 4.91 ‘ఎల్‌ఎంటి’ గోధుమలను విక్రయించింది.

   ప్రస్తుత 6వ ఇ-వేలంలో అఖిలభారత ప్రాతిపదికన క్వింటాలుకు సగటు నిర్దిష్ట ధర రూ.2140.46 కాగా, సగటు అమ్మకపు ధర రూ.2214.32/క్వింటా వంతున పలికింది. ప్రస్తుత 6వ వేలంలో 100 నుంచి 499 మెట్రిక్‌ టన్నుల మధ్య పరిమాణానికి గరిష్ఠ డిమాండ్‌ ఉండగా, తర్వాతి స్థానాల్లో 500-999 మెట్రిక్‌ టన్నులు, 50-100 మెట్రిక్‌ టన్నుల మధ్య గరిష్ఠ డిమాండ్‌ ఉంది.

  గోధుమల తొలి వేలం 2023 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించగా, 9.13 లక్షల మెట్రిక్‌ టన్నులను 1016 మంది పాటదారులకు వెయిటెడ్ సగటు ధర రూ.2474/క్వింటా వంతున విక్రయించారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 15 రెండో వేలంలో 3.85 ‘ఎల్‌ఎంటి’ పరిమాణాన్ని 1060 మంది పాటదారులకు సగటు ధర రూ. 2338/క్వింటా వంతున అమ్మారు. ఇక 3వ ఇ-వేలంలో 5.07 ‘ఎల్‌ఎంటి’ గోధుమలను 875 పాటదారులకు రూ.2173/క్వింటా వంతున, 4వ ఇ-వేలంలో 5.40 ‘ఎల్‌ఎంటి’లను 1049 మంది పాటదారులకు సగటు ధర రూ.2193.82/క్వింటా వంతున, 5వ ఇ-వేలంలో 5.39 ‘ఎల్‌ఎంటి’లను 1248 మంది పాటదారులకు సగటు ధర రూ.2197.91/క్వింటా వంతున విక్రయించారు. కాగా, 5వ ఇ-వేలం సమయానికి 28.86 ‘ఎల్‌ఎంటి’ గోధుమలను విక్రయించగా, 14.03.2023నాటికి కొనుగోలుదారులు 23.30 ‘ఎల్‌ఎంటి’లను తరలించుకు వెళ్లారు.

   ప్రస్తుత 6వ ఇ-వేలం తర్వాత 45 ‘ఎల్‌ఎంటి’ గోధుమల మొత్తం కేటాయింపులో దేశీయ బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం (ఒఎంఎస్‌ఎస్‌-డి) కింద సంచిత విక్రయం 33.77 ‘ఎల్‌ఎంటి’కి చేరింది. దీంతో దేశవ్యాప్తంగా గోధుమలు, పిండి ధరలు అదుపులోకి వచ్చినట్లయింది. ఈ విక్రయం ప్రభావంతో భవిష్యత్తులో ఈ పథకం కింద గోధుమల బహిరంగ అమ్మకాలకు నిర్వహించే టెండర్లలో ధరలు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది.

*****


(Release ID: 1907818) Visitor Counter : 149