రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ పరికరాల కోసం నిర్వహించే తనికీ ప్రక్రియను సరళీకృతం చేయడంపై వర్క్‌షాప్
प्रविष्टि तिथि:
15 MAR 2023 4:12PM by PIB Hyderabad
రక్షణ పరికరాల కోసం నిర్వహించే తనికీ ప్రక్రియను సరళీకృతం చేయడం అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ సేకరణ విభాగం ఈరోజు ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్‌లో వర్క్‌షాప్ జరిగింది.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన విధానంపై సంబంధిత వర్గాల నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ సలహాలు, అభిప్రాయాలు స్వీకరించింది. సాయుధ దళాలలోకి ప్రవేశించడానికి ముందు రక్షణ పరికరాల సామర్ధ్యాన్ని పరీక్షించడానికి అనుసరించాల్సిన విధానంపై వర్క్‌షాప్ లో చర్చించారు.
రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అర్మానే రక్షణ పరికరాల సామర్ధ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తున్న విధానం సరళీకృతంగా నిర్వహించాలని అన్నారు. సరళీకృత ట్రయల్ ప్రాసెస్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ, త్రివిధ దళాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నిపుణులు వర్క్‌షాప్ కు హాజరయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ (DDP), రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు,డిజిక్యూఏ, డిజిఎక్యూఏ,సెమిలాక్, ఏసీఈ CEMILAC వంటి వివిధ సంస్థల ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 1907252)
आगंतुक पटल : 129