భారత పోటీ ప్రోత్సాహక సంఘం
మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆమోదం
Posted On:
15 MAR 2023 11:59AM by PIB Hyderabad
మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం ద్వారా, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (లక్ష్యిత సంస్థ) జారీ చేసిన, పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్ క్యాపిటల్ 100% రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (కొనుగోలు సంస్థ) చేతికి వస్తుంది.
కొనుగోలు సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ. కొనుగోలు సంస్థ, తన అనుబంధ సంస్థల ద్వారా భారతదేశంలో ఆహారం, కిరాణా సామగ్రి, వస్తువులు, దుస్తులు, పాదరక్షల వంటి ఉత్పత్తుల టోకు, చిల్లర విక్రయాలను చేస్తోంది.
లక్ష్యిత సంస్థ భారతదేశంలో క్యాష్ అండ్ క్యారీ టోకు వ్యాపారం చేస్తోంది.
సీసీఐ వివరణాత్మక ఆదేశం రావలసివుంది.
***
(Release ID: 1907180)