రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో 10 వేల కోట్లరూపాయలకు పైగా పెట్టుబడితో 18 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన శ్రీ నితిన్ గడ్కరి.
Posted On:
13 MAR 2023 5:03PM by PIB Hyderabad
కేంద్ర రోడ్లు,రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి ఈరోజు , ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో, 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో చేపట్టిన 18 జాతీయ రహదారుల ప్రాజక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈకార్యకమ్రానికి కేంద్ర సహాయమంత్రి శ్రీ పంకజ్ చౌదరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ,అధికారులు హాజరయ్యారు.
.సోనౌలి`గోరఖ్‌పూర్ నాలుగులేన్ల మార్గం, అంతర్జాతీయ సరిహద్దుల వెంట, సరిహద్దు భద్రతను పటిష్టపరుస్తుందని శ్రీ గడ్కరి అన్నారు. బైపాస్ నిర్మాణంతో గోరఖ్‌పూర్ రింగ్‌రోడ్ నిర్మాణం పూర్తి అవుతుందని, దీనితోఒ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. ఇది వాణిజ్య, గృహ నిర్మాణ యూనిట్ల ఏర్పాటుకు కూడా వీలు కల్పిస్తుందన్నారు.
కుషినగర్ నుంచి లుంబిని వరకు రోడ్డు నిర్మాణం, బౌద్ధ పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. బహరాయిచ్` శ్రావస్తి` బలరామ్‌పూర్ మధ్య మెరుగైన అనుసంధానత, గిలోలా బైపాస్ నిర్మాణంతో ఏర్పడుతుందని ఆయన చెప్పారు. దీనితో దేవిపతన్ ఆలయానికి పర్యాటకుల రాకపోకలు సులభతరం అవుతాయని ఆయన చెప్పారు.
బాబా గోరక్షనాథ్‌జీ పుణ్యభూమిలో ఈ ప్రాజెక్టుల ఆవిష్కరణ, శంకుస్థాపనలు జరుగుతున్నాయని, ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి, ఉత్తరప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలు పెరగడానికి, పారిశ్రామిక ప్రగతికి దోహదపడగలదని శ్రీ నితిన్ గడ్కరి అన్నారు.
***
(Release ID: 1906756)
Visitor Counter : 128