నీతి ఆయోగ్

రెండు దేశాలు ఎదుర్కొంటున్న జాతీయ సవాళ్లు, రెండు దేశాలకు ప్రయోజనం కలిగించే రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో కలిసి పనిచేయనున్న భారతదేశం, ఆస్ట్రేలియా


ఏఐ-ఐటీసీ కార్యక్రమాన్ని అమలు చేయనున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్, సీఎస్ఐఆర్ఓ

Posted On: 11 MAR 2023 11:50AM by PIB Hyderabad

రెండు దేశాలు ఎదుర్కొంటున్న జాతీయ సవాళ్లు, రెండు దేశాలకు ప్రయోజనం కలిగించే  రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో కలిసి పనిచేయడానికి  భారతదేశం, ఆస్ట్రేలియా ఒక అంగీకారానికి వచ్చాయి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), నీతి  ఆయోగ్, ఆస్ట్రేలియా జాతీయ సైన్స్ ఏజెన్సీ కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( సీఎస్ఐఆర్ఓ)ల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. జాతీయ సవాళ్లు, రెండు దేశాలకు ప్రయోజనం కలిగించే రంగాల్లో కలిసి పనిచేయడానికి నూతన ఆవిష్కరణ కోసం కార్యకలాపాలు చేపట్టడానికి వీలు కల్పించే ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.

దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్ 2023 మార్చి 10న న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశం అయ్యారు. రెండు దేశాలకు ఆసక్తి ఉన్న అనేక రంగాలపై రెండు దేశాల ప్రధాన మంత్రులు చర్చలు జరిపారు. ఆవిష్కరణల రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రెండు దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి గల అవకాశాలపై శ్రీ ఆంథోనీ అల్బనీస్, శ్రీ నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. 

రెండు దేశాలు  పరస్పర ఆసక్తి కనబరుస్తున్న రంగాలు, వ్యూహాత్మక ప్రాధాన్యతా రంగాల్లో మరింత సహకారంతో రెండు దేశాలు కలిసి పనిచేయడానికి ఏఐఎం, సీఎస్ఐఆర్ఓ   మధ్య కుదిరిన అవగాహన వీలు కల్పిస్తుంది. గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడానికి రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒక వ్యవస్థను రూపొందించడానికి ఒప్పందం  పనిచేస్తుంది.

అంకుర సంస్థలు, ఎస్ఎంఈ లకు తగిన సహకారం అందించి వాణిజ్య పరంగా అభివృద్ధి సాధించడానికి, సమస్యల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక సహకారం అందించడానికి రెండు దేశాలు కృషి చేస్తాయి. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఇంధన పరివర్తన,ఆహార రంగం అభివృద్ధికి రెండు దేశాలు కలిసి పనిచేసి తమ దేశాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరిజ్ఞాన మార్పిడి లాంటి అంశాలపై ఇండియా ఆస్ట్రేలియా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఛాలెంజ్ (ఏఐ-ఐటీసీ) దృష్టి సారించి పనిచేస్తుంది. వనరులు, ఆవిష్కరణల రంగంలో సాధించిన అభివృద్ధి తదితర అంశాలపై రెండు దేశాలు అవగాహనతో పనిచేస్తాయి.   

2021లో నిర్వహించిన ఇండియా ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ (IACE) హ్యాకథాన్ సాధించిన విజయం ఆధారంగా ఏఐ-ఐటీసీ రూపుదిద్దుకుంది.  హ్యాకథాన్ లో పాల్గొన్నభారతదేశం, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల  విద్యార్థులు, అంకుర సంస్థలు,  ఎస్ఎంఈ లు ఆహార వ్యవస్థలో  విలువ ఆధారిత గొలుసు వ్యవస్థ రూపకల్పన కోసం వినూత్న సాంకేతిక-ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చేశారు. 

ఇండియా ఆస్ట్రేలియా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఛాలెంజ్‌ను అభివృద్ధి చేయడం,  సహ-అభివృద్ధిలో ఆవిష్కరణలను తీసుకురావడానికి  సీఎంఐఆర్ఓ తో కలిసి పని చేస్తామని  ఏఐఎం   నీతి  ఆయోగ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ అన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల రెండు దేశాలకు చెందిన అంకుర సంస్థలు, ఎస్ఎంఈ సంస్థలు, వ్యాపార ఇంక్యుబేటర్లు,   యాక్సిలరేటర్‌ సంస్థలు ప్రయోజనం పొందుతాయన్నారు. వివిధ స్థాయిలలో రెండు దేశాల మధ్య సహకారాన్ని ఒప్పందం మరింత పటిష్టం చేస్తుందని పేర్కొన్న డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ దీనివల్ల కొత్త అవకాశాలు అందిస్తుందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తనకు ఉన్న అనుభవాన్ని, జ్ఞానాన్ని  సీఎస్ఐఆర్ఓ భారతదేశానికి అందించి రెండు దేశాల అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు.       

ఏఐఎం తో కుదిరిన అవగాహన పట్ల  సీఎస్ఐఆర్ఓ గ్రోత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోనాథన్ లా హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు పరిష్కారానికి ఒప్పందం సహకరిస్తుందని అన్నారు. ప్రపంచ-స్థాయి ఆవిష్కరణలు, వ్యవస్థాపకులను ప్రోత్సహించడంలో  ఏఐఎం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. 

 ప్రపంచ సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ ప్రభావాన్ని చూపే శాస్త్రీయ పురోగతులను రూపొందించడానికి రెండు సంస్థలు కలిసి కృషి చేస్తాయని  జోనాథన్ లా అన్నారు.

ఏఐ-ఐటీసీ కార్యక్రమం రూపకల్పనపై సీఎస్ఐఆర్ఓ, ఏఐఎం దృష్టి సారించాయి. సుస్థిరంగా కార్యక్రమం అమలు జరిగేలా వినూత్న విధానంలో ఏఐ-ఐటీసీ కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. 2023 జూలై నెలలో ఏఐ-ఐటీసీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

***



(Release ID: 1905927) Visitor Counter : 160