రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతితో భేటీ అయిన ఆస్ట్రేలియా ప్రధాని

Posted On: 10 MAR 2023 5:49PM by PIB Hyderabad

ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఆంథోనీ అల్బనీస్  10 న రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.   

ప్రధాని అల్బనీస్ కు, ఆయన ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆరాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్-ఆస్ట్రేలియా మధ్య  మంచి స్నేహ సంబంధాలు  ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ప్రోత్సాహకరమన్నారు. ఈ పర్యటనతో భారత్- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత వేగం పుంజుకుంటాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

రక్షణ రంగంలో పెరుగుతున్న సహకారం, సంస్థాగత వ్యవహారాలలో భారత్-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న  బంధం పట్ల రాష్ట్రపాటు సంతృప్తి వ్యక్తం చేశారు. కీలక ఖనిజాలు, నవకల్పనలు,  పునరుత్పాదక ఇంధన రంగాలలో ఆచరణాత్మక సహకారాన్ని ఇరుదేశాలూ కొనసాగించాలని అభిలషించారు.

ఆస్ట్రేలియాలోని భారతీయులు కష్టపడి పనిచేసే తత్వమున్నవారని, శాంతి కాముకులని, వ్యాపార దక్షత ఉన్నవారని రాష్ట్రపతి అన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడి భారతీయులకు సురక్షితమైన, భద్రమైన సానుకూల వాతావరణం కల్పించటానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

***


(Release ID: 1905923)