ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎఫ్‌వై2022-23లో 10 మార్చి 2023 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల వివరాలు


ఎఫ్‌వై2022-23లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.68 లక్షల కోట్లు; గతేడాది ఇదే కాలం కంటే 22.58% వృద్ధి

నికర వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లు; గతేడాది ఇదే కాలం కంటే 16.78% ఎక్కువ

మంజూరు చేసిన పన్ను వాపసులు రూ.2.95 లక్షల కోట్ల వాపసు; గతేడాది ఇదే కాలం కంటే 59.44% అధికం

Posted On: 11 MAR 2023 12:14PM by PIB Hyderabad

ఎఫ్‌వై2022-23లో, 10 మార్చి 2023 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల తాత్కాలిక గణాంకాలు స్థిరంగా వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 10, 2023 వరకు, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.16.68 లక్షల కోట్లుగా లెక్క తేలాయి. గత సంవత్సరం ఇదే కాలంలోని స్థూల వసూళ్ల కంటే ఇది 22.58% వృద్ధి. నికర పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలం కంటే ఇది 16.78% ఎక్కువ. ఎఫ్‌వై2022-23 బడ్జెట్‌కు సంబంధించి, ప్రత్యక్ష పన్నుల అంచనాల్లో ఇవి 96.67%. సవరించిన అంచనాల్లో 83.19%.

స్థూల ఆదాయ పన్ను వసూళ్ల పరంగా, కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) వసూళ్లలో వృద్ధి రేటును గమనిస్తే, సీఐటీ వృద్ధి రేటు 18.08% కాగా, పీఐటీ (ఎస్‌టీటీ సహా) వృద్ధి రేటు 27.57%గా ఉంది. పన్ను
వాపసుల సర్దుబాటు తర్వాత, సీఐటీ వసూళ్లలో నికర వృద్ధి 13.62% కాగా & పీఐటీ వసూళ్లలో 20.73% (పీఐటీ మాత్రమే)/ 20.06% (ఎస్‌టీటీ సహా పీఐటీ) నమోదైంది.

ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు రూ.2.95 లక్షల కోట్ల పన్ను వాపసులు మంజూరయ్యాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలోని మంజూరు కంటే ఇది 59.44% ఎక్కువ.

 

****


(Release ID: 1905921) Visitor Counter : 195