ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇన్ ఫ్లూయెంజా తాజా సమాచారం


ఐడి ఎస్ పి వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని సమీక్షిస్తూ కేసుల వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఇన్ ఫ్లూయెంజా ఉపరకం హెచ్3ఎన్2 కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రిత్వ శాఖ

ఇన్ ఫ్లూయెంజా నివారణ కోసం మార్గదర్శకాలు జారీచేసిన ఐసిఎంఆర్
మార్చి నెలాఖరు నాటికి ఇన్ ఫ్లూయెంజా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం

Posted On: 10 MAR 2023 4:21PM by PIB Hyderabad
ఐడి ఎస్ పి వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  సీజనల్ ఇన్ ఫ్లూయెంజా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది.  ఇన్ ఫ్లూయెంజా ఉపరకం  హెచ్3ఎన్2 వల్ల కలుగుతున్న అనారోగ్యాలు, మరణాలను మంత్రిత్వ శాఖ నిశితంగా సమీక్షిస్తున్నది. ఇతర ఆరోగ్య సమస్యలు కలిగి ఉన్న పిల్లలు, వృద్ధులు సీజనల్  ఇన్ ఫ్లూయెంజా బారిన పడే అవకాశం ఉంది. ఇంతవరకు  హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా బారిన పడి కర్ణాటకలో ఒకరు, హర్యానాలో మరొకరు మరణించారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో సీజనల్  ఇన్ ఫ్లూయెంజా ఉంది. సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా అనేది ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ల వల్ల కలిగే తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్. కొన్ని నెలల్లో కేసులు పెరుగుతాయి. భారతదేశంలో ఏడాదిలో రెండుసార్లు ఇన్ ఫ్లూయెంజా ప్రభావం కనిపిస్తుంది. జనవరి నుంచి మార్చి నెలల మధ్య ఒకసారి. వర్షాకాలం ముగిసిన తర్వాత మరోసారి ఇన్ ఫ్లూయెంజా వ్యాపిస్తుంది. మార్చి నెలాఖరు నాటికి ఇన్ ఫ్లూయెంజా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇన్ ఫ్లూయెంజా వల్ల ఏర్పడే పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాల ప్రజారోగ్య విభాగాలు సిద్ధంగా ఉన్నాయి. 
దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల ద్వారా నిజ సమయ నిఘా 
ఇన్ ఫ్లూయెంజా వల్ల కలిగే అనారోగ్య సమస్యలు (ILI),తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు  (SARI) వంటి లక్షణాలతో ఓపీడీలు, ఆరోగ్య సౌకర్యాల ఐపీడీ లకు వస్తున్న కేసులను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) ద్వారా సమీక్షిస్తున్నారు. 
•ఐడీఎస్ పీ -ఐహెచ్ఐపి  (ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫారమ్)లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం  ప్రకారం 2023 మార్చి 9 నాటికి  హెచ్3ఎన్2 తో సహా వివిధ రకాల  ఇన్ ఫ్లూయెంజా   సంబంధించిన మొత్తం 3038 కేసులు నమోదయ్యాయి. జనవరి నెలలో 1245, ఫిబ్రవరిలో 1307, మార్చి నెలలో 486 కేసులు (మార్చి 9 వరకు ) నమోదయ్యాయి. 
•  ఐడీఎస్ పీ -ఐహెచ్ఐపి  సమాచారం ప్రకారం 2023  జనవరి  నెలలో దేశంలో మొత్తం 397,814 తీవ్ర శ్వాస కోస సంబంధిత కేసులు, ఇన్‌ఫ్లుఎంజా  కేసులు నమోదయ్యాయి.  ఫిబ్రవరిలో కేసుల సంఖ్య కొద్దిగా పెరిగి  436,523కి చేరింది.  2023. మార్చి 2023 మొదటి 9 రోజుల్లో ఈ సంఖ్య 133,412కి చేరింది. 
• తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో  (SARI) ఆస్పత్రిలో  జనవరి 2023 లో 7041 మంది,, ఫిబ్రవరి 2023 లో 6919 మంది, 2023 మార్చి మొదటి 9 రోజులలో 1866 మంది చేరారు. 
2023లో (ఫిబ్రవరి 28 వరకు )  మొత్తం 955   హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు (545), మహారాష్ట్ర (170), గుజరాత్ (74), కేరళ (42), పంజాబ్ (28)లో అత్యధికంగా హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి.
ఐసిఎంఆర్  నెట్‌వర్క్ ఆఫ్ లాబొరేటరీల నుండి ఇన్ఫ్లుఎంజా డేటా
 ILI/SARI నిఘా నెట్‌వర్క్ ద్వారా  భారతదేశంలో మానవ ఇన్‌ఫ్లుఎంజా వైరస్, సార్స్ కోవ్-2   వైరస్‌ను గుర్తించడం కోసం అనారోగ్యం (ILI) మరియు తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (SARI) వంటి ఇన్‌ఫ్లుఎంజా పై  సమగ్ర పర్యవేక్షణ  28 సైట్‌ల ద్వారా  కొనసాగుతోంది. నిఘా నెట్‌వర్క్‌లో 27 డిహెచ్ఆర్ - ఐసిఎంఆర్ కి చెందిన వైరస్ రీసెర్చ్, డయాగ్నోస్టిక్ లాబొరేటరీలు, పూణే ఐసిఎంఆర్   -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉన్న ఐసిఎంఆర్- నేషనల్ ఇన్‌ఫ్లుఎంజా సెంటర్ (WHO-NIC), ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో నడుస్తున్న  గ్లోబల్ ఇన్‌ఫ్లుఎంజా సర్వైలెన్స్అండ్ రెస్పాన్స్ సెంటర్  (GISRS) ఉన్నాయి.
2023 మొదటి 9 వారాల (జనవరి 2  నుంచి మార్చి 5 వరకు ) కాలంలో  నిఘా నెట్‌వర్క్ తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం కేసులు,ఇల్లీ కేసులలో ఉన్న  హ్యూమన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ,సార్స్-కోవ్-2  ఇన్‌ఫెక్షన్‌ను సమీక్షించింది.  ఇన్ఫ్లుఎంజా ఫలితాలు క్రింద విధంగా ఉన్నాయి. 
  

 

వారం

వారం 1

2వ వారం

వారం 3

వారం 4

5వ వారం

వారం 6

7వ వారం

8వ వారం

9వ వారం

ఇన్ఫ్లుఎంజా ఏ హెచ్1ఎన్1 పిడిఎమ్  09

8

8

4

6

5

3

0

2

5

ఇన్ఫ్లుఎంజా ఏ  హెచ్3ఎన్2

46

57

44

42

47

61

46

52

56

ఇన్ఫ్లుఎంజా బి విక్టోరియా

4

11

6

4

12

18

10

13

13

 

ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇన్ఫ్లుఎంజా పాజిటివ్ పరీక్షిస్తున్న నమూనాలలో ఇన్ఫ్లుఎంజా హెచ్3ఎన్2   ప్రధాన ఉప-రకంగా ఉందని గుర్తించారు.  

ప్రజారోగ్య చర్యలు

కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా పై మార్గదర్శకాలు :

రోగుల వర్గీకరణ, చికిత్స, వెంటిలేటర్ నిర్వహణపై  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ   మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ వెబ్ సైట్   (www.mohfw.nic.in) మరియు ఎన్ సి డిసి  (ncdc.gov.in). వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలు  అందుబాటులో ఉన్నాయి . .gov.in ).హెచ్1ఎన్1  కేసులు చూస్తున్న  ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకుమంత్రిత్వ శాఖ  సలహా ఇచ్చింది.

 

ఔషదాలు, రవాణా  

ప్రపంచ ఆరోగ్య సంస్థ Oseltamivir ని సిఫార్సు చేసింది. Oseltamivir ని ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ఉచితంగా అందిస్తారు.అవసరమైన వారికి అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో  ఫిబ్రవరి 2017లో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ షెడ్యూల్ హెచ్ఐ  ప్రకారం ఒసెల్టామివిర్ అమ్మకానికి ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రాల వద్ద తగిన నిల్వలు  అందుబాటులో ఉన్నాయి. అయితేఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సంక్షోభాన్ని అధిగమించడానికి  రాష్ట్రాలకు సహాయాన్నిఅందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. 

 

 రాష్ట్రాలలో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా పరిస్థితిని సమీక్షించడానికి నీతి ఆయోగ్  రేపు అంటే  2023 మార్చి 11,  ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు ప్రజారోగ్య చర్యలునిర్వహణ మార్గదర్శకాలు  ప్రోటోకాల్‌ల పరంగా అందించాల్సి ఉన్న సహకారం వంటి అంశాలను వివిధ మంత్రిత్వ శాఖలు పాల్గొనే సమావేశంలో చర్చించి ఖరారు చేస్తారు. 

***


(Release ID: 1905817) Visitor Counter : 243