స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు
azadi ka amrit mahotsav

పిఎం గతి శక్తి నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌పై మార్చి 10, 11 తేదీలలో కోచి లో సౌత్‌జోన్‌ రీజనల్‌ వర్క్‌షాప్‌.

Posted On: 09 MAR 2023 4:06PM by PIB Hyderabad

పి.ఎం. గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌పై 2023 మార్చి10, 11 తేదీలలో సౌత్‌జోన్‌ రీజనల్‌ వర్క్‌షాప్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డిపిఐఐటి) నిర్వహించనుంది. కోచి లోని లీ మెరిడియన్‌ లో దీనిని నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో వివిధ కేందప్ర్రభుత్వ మంత్రిత్వశాఖలు , విభాగాల నుంచి సీనియర్‌ ప్రభుత్వ అధికారులు, పాల్గొంటారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు, అండమాన్‌,నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, దాద్రా నాగర్‌ హవేలి , డామన్‌ డయ్యూ ల ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. వర్క్‌షాప్‌ తొలిరోజు, మౌలికసదుపాయాలు, సామాజిక రంగ ప్రణాళిక, పిఎం గతిశక్తిని సమగ్ర స్థాయిలో చేపట్టడం , వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను చర్చిస్తారు. అలాగే యూనిఫైడ్‌ లాజిస్టిక్‌ ఇంటర్‌ఫేస్‌ ప్లాట్‌ఫారం (యులిప్‌) కు సంబంధించి ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఇందులో వివిధ లాజిస్టిక్‌లకు సంబంధించి వివిధ కాంపొనెంట్‌లను ప్రదర్శిస్తారు.

రెండో రోజు వర్క్‌షాప్‌లో నేషనల్‌ లాజిస్టిక్‌న పాలసీ, సమగ్ర లాజిస్టిక్స్‌ కార్యాచరణ ప్రణాళిక లోని ముఖ్యాంశాలపై ప్రెజెంటేషన్‌ ఉంటుంది. దీనితోపాటు సిస్థిర నగరాలను తీర్చిదిద్దేందుకు స్టేట్‌ లాజిస్టిక్‌ విధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు. రెండోరోజు కార్యక్రమంలో అనుసంధానత, తీరప్రాజెక్టులపై అధ్యయనానికి కోచి పోర్టు సందర్శన కూడా ఉంటుంది.

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఐదు ప్రాంతీయ వర్క్‌షాప్‌లలో , కోచిలో నిర్వహించనున్న ప్రాంతీయ వర్క్‌షాప్‌ రెండవది. తొలి ప్రాంతీయ వర్క్‌షాప్‌ 2023 ఫిబ్రవరి 20న గోవాలో జరిగింది. వీటిని డిపిఐఐటి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. పిఎం గతి శక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ (ఎన్‌ఎంపి)కి సంబంధించిన భాగస్వాములందరి మధ్య సమన్వయంతోపాటు దీనికి మరింత ఊపును తీసుకురావడం దీని ఉద్దేశం. ఈ ప్రాంతీయ వర్క్‌షాప్‌లు సమీకృత ప్రణాళిక, రాష్ట్రాల సాంకేతిక మద్దతు యూనిట్లకు సంబంధించిన వ్యవస్థాగత యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిపెడతాయి. అలాగే పిఎం గతిశక్తి ఎన్‌ ఎం పి అమలులో ,దానిని చేపట్టడంలో ఉమ్మడి సవాళ్లను గుర్తించడం, జిల్లా స్థాయిలో పిఎం గతిశక్తి ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి రోడ్‌ మ్యాప్‌కు రూపకల్పన చేయడం వంటివి ప్రధానంగా దృష్టిపెట్టనున్న అంశాలు.

36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ పిఎం గతిశక్తి ఎన్‌.ఎం.పికి సంబంధించి సమీకృత ప్రణాళిక, ప్రాజెక్టు అమలుకు ఎంపవర్‌డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌ (ఇ జిఒఎస్‌), నెట్‌ వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ (ఎన్‌పిజి), టెక్నికల్‌ సపోర్ట్‌ యూనిట్‌ (టిఎస్‌యు) లను ఏర్పాటు చేశాయి.

 

****


(Release ID: 1905431) Visitor Counter : 219