భారత ఎన్నికల సంఘం

‘ఎన్నికల సమగ్రత’పై సమష్టి బాధ్యత తో‘ 'సమిష్టి ఎన్నికలు మరియు ఎన్నికల సమగ్రత’పై 3వ అంతర్జాతీయ సదస్సును ఈ సీ ఐ నాయకత్వ హోదా లో నిర్వహించనుంది.


సమావేశానికి హాజరు కావడానికి 25 ఎన్నికల నిర్వహణ సంస్థలు (EMBలు)/దేశాలు;

మారిషస్, గ్రీస్ మరియూ అంతర్జాతీయ సంస్థ ఐ ఎఫ్ ఈ ఎస్ ఎన్నికల సమగ్రతపై సమిష్టి కృషి కి సహ-నాయకులుగా ఈ సీ ఐ తో చేరనున్నాయి

Posted On: 08 MAR 2023 6:22PM by PIB Hyderabad

భారత ఎన్నికల సంఘం (ECI) వర్చువల్ విధాన మాధ్యమం లో 'సమిష్టి ఎన్నికలు మరియు ఎన్నికల సమగ్రత’' అనే థీమ్‌పై 3వ అంతర్జాతీయ సమావేశాన్ని 09 మార్చి 2023న నిర్వహించనుంది. ఈ సీ ఐ ఎన్నికల సమగ్రతపై కోహోర్ట్‌కు నాయకత్వం వహిస్తోంది. తొలి ప్రజాస్వామ్య సదస్సు'  డిసెంబర్, 2021లో జరిగింది.

 

అంగోలా, అర్మేనియా, ఆస్ట్రేలియా, కెనడా, చిలీ కోస్టారికా, క్రొయేషియా, డెన్మార్క్, డొమినికా, జార్జియా, గయానా, కెన్యా, కొరియా, మారిషస్, మోల్డోవా, నార్వే, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, రొమేనియాతో సహా 25 దేశాలు/ ఈ ఎం బీ లసెయింట్ లూసియా, సురినామ్, స్వీడన్, స్విట్జర్లాండ్ మరియు జాంబియా అలాగే ఇంటర్నేషనల్ ఐడియా  నుండి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు మరియు ఎలక్టోరల్ సిస్టమ్స్ కోసం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుండి ప్రతినిధులు. ఇండోనేషియాలో డిసేబిలిటీ యాక్సెస్ కోసం జనరల్ ఎలక్షన్ నెట్‌వర్క్ మరియు నేపాల్‌లోని అసోసియేషన్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్లునుండి 46 మందికి పైగా కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని భావిస్తున్నారు.  ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్లు శ్రీ అనుప్ చంద్ర పాండే మరియు శ్రీ అరుణ్ గోయెల్ కూడా సదస్సులో ప్రసంగిస్తారు.

 

కోహోర్ట్ యొక్క మొదటి అంతర్జాతీయ సమావేశం 31 అక్టోబర్ - 01 నవంబర్, 2022 న న్యూ ఢిల్లీలో 'ఎన్నికల నిర్వహణ సంస్థల పాత్ర, ఫ్రేమ్‌వర్క్ మరియు సామర్థ్యం' అనే అంశంపై నిర్వహించబడింది, ఇందులో 11 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల (ఇఎంబిలు) నుండి దాదాపు 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.' ఎన్నికల నిర్వహణ లో సాంకేతిక వినియోగం మరియు ఎన్నికల సమగ్రత' అనే అంశంపై 2వ కాన్ఫరెన్స్‌ను ఈ సీ ఐ 23-24 జనవరి 2023న న్యూఢిల్లీలో నిర్వహించింది, ఇందులో తొమ్మిది ఈ ఎం బీ ల అధిపతులు/ డెప్యూటీ హెడ్‌లు లేదా అంతర్జాతీయ ఐ డి ఈ ఎ నుండి ఎన్నికల అధికారులు మరియు ప్రతినిధులు సహా 16 దేశాల నుండి  న్యూ ఢిల్లీలో ఉన్న 8 విదేశీ మిషన్ల నుండి దౌత్యవేత్తలతో పాటు 40 మందికి పైగా   పాల్గొన్నారు.

 

నేపథ్య సమాచారం 

 

4. ' ప్రజాస్వామ్యం కోసం సదస్సు ' అమెరికా అధ్యక్షుడు చొరవతో మరియు డిసెంబర్ 2021లో నిర్వహించబడింది. డిసెంబర్ 9, 2021న జరిగిన లీడర్స్ ప్లీనరీ సెషన్‌లో భారత ప్రధాని ప్రసంగించారు. ఈ సమ్మిట్ తర్వాత,  "కార్యచరణ సంవత్సరం" ప్రతిపాదించబడింది. దీనిలో భాగంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇతివృత్తాలపై సదస్సు మరియు చర్చలు,ప్రత్యేక దృష్టిగ్రూపులు’ మరియు ‘ప్రజాస్వామ్య సమిష్టి ’ కార్యాచరణ సంవత్సరంలో భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి సమ్మిట్ రెండు ప్లాట్‌ఫారమ్‌లకు  రూపకల్పన చేసింది. ప్రజాస్వామ్యం కోసం 2వ సదస్సు 29-30 మార్చి 2023న జరగనుంది. దీనికి కోస్టారికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, నెదర్లాండ్స్, జాంబియా మరియు అమెరికా ప్రభుత్వాలు సహ- అతిదేయులుగా వ్యవహరిస్తారు.

 

5.  'ఎన్నికల సమగ్రత'పై సమిష్టి కి నేత గా,ఈ సీ ఐ సహకార విధానాన్ని తీసుకుంది, ఈ కోహోర్ట్‌కు సహ-నాయకులుగా ఉండటానికి గ్రీస్, మారిషస్ మరియు ఐ ఎఫ్ ఈ ఎస్ లను ఆహ్వానించింది. ఈ సీ ఐ  ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ఈ ఎం బీ లు మరియు ప్రభుత్వ సహచరులతో పాటు ఎలక్టోరల్ సిస్టమ్స్ మరియు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను కూడా ఆహ్వానించింది.

 

6. ‘ప్రజాస్వామ్యం కోసం సదస్సు’ కార్యచరణ సంవత్సరం' లో భాగంగా,  భారతదేశం ఈ సీ ఐ  ద్వారా తన జ్ఞానం, సాంకేతిక నైపుణ్యం మరియు అనుభవాలను ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పంచుకోవడానికి ‘ఎన్నికల సమగ్రత కోసం ప్రజాస్వామ్య సమిష్టి ’’కి నాయకత్వం వహిస్తోంది. ఈ సీ ఐ , దాని నాయకత్వంలో, ప్రపంచవ్యాప్తంగా 46 ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈ ఎం బీ లు) నుండి 60 మంది అధికారులకు కోహోర్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య నాలుగు శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.

***



(Release ID: 1905228) Visitor Counter : 193


Read this release in: English , Urdu , Hindi , Marathi