కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య సౌకర్యాలు దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేలా దేశవ్యాప్తంగా 9,000కు పైగా జన్‌ ఔషధి కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించిన శ్రీ భూపేందర్‌ యాదవ్ చెప్పారు

प्रविष्टि तिथि: 07 MAR 2023 3:43PM by PIB Hyderabad

దిల్లీలోని ద్వారకలో ఈ రోజు నిర్వహించిన జన్‌ ఔషధి దివస్ 2013 కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ భూపేందర్‌ యాదవ్ పాల్గొని, ప్రసంగించారు. ఆరోగ్య సౌకర్యాలు దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంచేలా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  దేశవ్యాప్తంగా 9,000కు పైగా జన్‌ ఔషధి కేంద్రాలను ప్రారంభించినట్లు శ్రీ భూపేందర్‌ యాదవ్ చెప్పారు.

ఈ కేంద్రాల్లో తక్కువ ధరలకు మందులు లభిస్తున్నాయని, ఖరీదైన ఔషధాల భారం నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారని కేంద్ర మంత్రి అన్నారు. దీంతో పాటు, మహిళల సౌలభ్యం కోసం, జన్‌ ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్‌లు కూడా లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

ఈ ఏడాది చివరి నాటికి దేశంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000కు పెంచే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీ యాదవ్ వెల్లడించారు.

****


(रिलीज़ आईडी: 1904916) आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil