సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులు ప్రదానం చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్


జీవన సాఫల్య అవార్డు స్వీకరించిన సిప్రా దాస్

దేశ వారసత్వ విలువలను ఫొటోగ్రాఫర్లు ప్రపంచానికి ప్రపంచానికి పరిచయం చేయగలరు: డాక్టర్ మురుగన్

Posted On: 07 MAR 2023 1:54PM by PIB Hyderabad

8 వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులను కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. 

 ఒక  జీవన  సాఫల్య అవార్డు   అవార్డుతో సహా మొత్తం 13 అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. జీవన  సాఫల్య అవార్డు గా 3,00,000 రూపాయలు,  ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా 1,00,000 రూపాయలు,  అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ తరగతిలో 75,000 నగదు బహుమతి,  5 ప్రత్యేక ప్రస్తావన అవార్డులు ప్రొఫెషనల్ మరియు అమెచ్యూర్ కేటగిరీలలో వరుసగా రూ.50,000/- మరియు రూ.30,000/- నగదు బహుమతి అందించారు. 

 

 

జీవన సాఫల్య  అవార్డును   సిప్రా దాస్ స్వీకరించారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును శ్రీ శశి కుమార్ రామచంద్రన్‌ అందుకున్నారు.  అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును శ్రీ  అరుణ్ సాహా గెలుచుకున్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో  ప్రొఫెషనల్, అమెచ్యూర్ విభాగంలో ఒక్కొక్కటి 6 అవార్డులతో సహా మొత్తం పదమూడు అవార్డులు ప్రదానం చేశారు. ప్రొఫెషనల్ తరగతిలో  “లైఫ్ అండ్ వాటర్” ఇతివృత్తంతో తీసిన ఫోటోలకు, అమెచ్యూర్ విభాగంలో  “కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా” ఇతివృత్తంతో తీసిన ఫోటోలను అవార్డులకు ఎంపిక చేశారు. 

అవార్డులు సాధించిన వారిని డాక్టర్ మురుగన్ అభినందించారు.  విభిన్న వృత్తిపరమైన నేపథ్యాలు  కలిగి ఉన్న వారిని  ఫోటోగ్రఫీ పట్ల ఉన్న మక్కువ ఏకం చేసిందని డాక్టర్ మురుగన్ అన్నారు.  అసాధారణ ప్రతిభ, అత్యుత్తమ సామర్థ్యాలను గుర్తించి అవార్డులు అందించామని  ఆయన తెలిపారు.

ఫోటోగ్రఫీని  సార్వత్రిక దృశ్య భాషగా డాక్టర్ మురుగన్ అభివర్ణించారు. ఫోటోగ్రఫీ సమయం,స్థలాన్ని అధిగమించి వర్తమాన కాలం, గతాన్ని చూసేందుకు సంహరిస్తుంది అని అని మంత్రి అన్నారు. 'ఫోటోగ్రాఫ్‌లు అబద్ధం చెప్పవు.  ప్రతి చర్య ,భావోద్వేగం  సత్యాన్ని ఎల్లప్పుడూ మాట్లాడతాయి' అని పేర్కొన్న డాక్టర్ మురుగన్ స్వాతంత్య్ర ఉద్యమం, స్వాతంత్ర సమరయోధులు   చిరస్థాయిగా నిలిచేలా   ఛాయాచిత్రాలు చేశాయన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో అలనాటి సంఘటనలు, చరిత్రను ఛాయాచిత్రాలు  గుర్తు చేస్తున్నాయని ఆయన అన్నారు.


 వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే ఫోటోగ్రాఫర్లు చిత్రాల ద్వారా కథలు చెప్పాలి అని తపన పడుతుంటారని డాక్టర్ మురుగన్ వ్యాఖ్యానించారు. వాస్తవాలు, గణాంకాలు వెలికి తీసే   ఫోటోగ్రాఫర్‌లు అబద్ధాలు, నకిలీల ముసుగులను తొలగించగల సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. దేశ  అద్భుతమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం పై  అవగాహన పెంపొందించడం తో పాటు  సాంస్కృతిక విలువలను  ప్రపంచానికి పరిచయం చేయడంలో  ఫోటోగ్రాఫర్‌లు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.

అంతకుముందు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బ్రోచర్‌ను  ప్రముఖులు విడుదల చేశారు.

సమాచార ప్రసార  మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ దేశంలో ఫోటోగ్రాఫర్లు చేస్తున్న అపారమైన కృషిని గుర్తించి ప్రోత్సహించడానికి  జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులు అందిస్తున్నామని  అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేస్తున్న  ప్రధాన పథకాల విభాగంలో  అవార్డులు ప్రదానం చేయాలని   శ్రీ చంద్ర సూచించారు. 
జీవన సాఫల్య  అవార్డు కోసం మొత్తం 9 ఎంట్రీలు అందాయని తెలిపిన  అవార్డుల జ్యూరీ చైర్మన్ శ్రీ విజయ్ క్రాంతి  జ్యూరీ సభ్యుల సిఫార్సు మేరకు 12 ఎంట్రీలను పరిశీలించామన్నారు.  ప్రొఫెషనల్ కేటగిరీకి సంబంధించి మొత్తం 4,535 చిత్రాలతో 462 ఎంట్రీలు వచ్చాయని ఆయన తెలియజేశారు. ఈ ఎంట్రీలు 21 రాష్ట్రాలు మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాల అందాయి. . అమెచ్యూర్ విభాగంలో 24 రాష్ట్రాలు మరియు 6 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి  6,838 చిత్రాలతో 874 ఎంట్రీలు వచ్చాయి.
8 వ  జాతీయ ఫోటోగ్రఫీ అవార్డుల విజేతలు
1. జీవన సాఫల్య అవార్డు
• శ్రీమతి సిప్రా దాస్
2. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
• శ్రీ శశికుమార్ రామచంద్రన్
3. ప్రొఫెషనల్ విభాగంలో ప్రత్యేక ప్రస్తావన అవార్డులు
• శ్రీ దీపజ్యోతి బానిక్
• శ్రీ మనీష్ కుమార్ చౌహాన్
• శ్రీ ఆర్ ఎస్ గోపకుమార్
• శ్రీ సుదీప్తో దాస్
• శ్రీ ఉమేష్ హరిశ్చంద్ర నికమ్
4. అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
• శ్రీ అరుణ్ సాహా
5. అమెచ్యూర్ విభాగంలో ప్రత్యేక ప్రస్తావన అవార్డులు
• శ్రీ సిఎస్ శ్రీరంజ్
• డాక్టర్ మోహిత్ వధావన్ 
• శ్రీ రవిశంకర్ ఎస్.ఎల్
• శ్రీ శుభ దీప్ బోస్
• శ్రీ తరుణ్ అదురుగట్ల 
8 వ  జాతీయ ఫోటోగ్రఫీ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటైన జ్యూరీ సభ్యులు 
• శ్రీ విజయ్ క్రాంతి, చైర్మన్
• శ్రీ జగదీష్ యాదవ్, సభ్యుడు
• శ్రీ అజయ్ అగర్వాల్, సభ్యుడు
• శ్రీ కె. మాధవన్ పిళ్లై, సభ్యుడు
• శ్రీమతి అషిమా నారాయణ్, సభ్యుడు మరియు

* శ్రీ సంజీవ్ మిశ్రా, ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్, ఫోటో డివిజన్, సభ్య కార్యదర్శి. 

 

Saurabh Singh


(Release ID: 1904867) Visitor Counter : 222