యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారిస్ ఒలింపిక్స్ 2024 తొలి ఉన్నతస్థాయి కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర క్రీడల మంత్రి; సమావేశానికి హాజరైన ఐఒఎ, ఎంవైఎఎస్ ప్రతినిధులు
Posted On:
06 MAR 2023 5:07PM by PIB Hyderabad
పారిస్ ఒలింపక్స్ 2024కు సంబంధించి కేంద్ర సమాచార & ప్రసారశాఖ & యువజన వ్యవహారాలు, క్రీడలు (ఎంవైఎఎస్) మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, ఎంవైఎఎస్ సహాయ మంత్రి శ్రీ నిషిత్ ప్రమాణిక్‌తో కలిసి సోమవారం తొలి ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఎంవైఎఎస్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఎఐ), భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) ప్రతినిధులు హాజరైన ఈ సమావేశం వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ రోడ్ మ్యాప్ వివరాలను చర్చించి, ఈ ఏడాది హాంఝౌలో జరుగనున్న ఏషియన్ గేమ్స్ తయారీ గురించిన వివరాలను తెలుసుకున్నారు.
సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ ఏడాది హంగఝౌలో భారత్ ఉత్తమంగా రాణించేందుకు ఏషియన్ గేమ్స్‌లో మన క్రీడాకారులు సరిగ్గా ప్రదర్శించేందుకు నిరంతర కృషి జరుగుతోందని మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. ఎంఒసి (మిషన్ ఒలింపిక్ సెల్) సభ్యులు వారం వారం సమావేశమవుతున్నారని, క్రమం తప్పకుండా క్రీడాకారులతో బృందాలు టచ్‌లో ఉండి వారి పురోగతిని పరీక్షిస్తున్నారని, ప్రతీదీ క్రమబద్ధంగా ఉందాలేదో చూస్తున్నారని చెప్పారు.
సోమవారం మూల్యాంకన సమావేశం ఈ అంశాలపై జరుగగా, హాజరైన వాటాదారులందరూ ఈ ఆసియా క్రీడలలో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తుందని అంగీకరించారు. అది ప్రభుత్వం కావచ్చు లేదా క్రీడాకారులు అందరూ కూడా ఈ ఆసియా క్రీడలకు సంసిద్ధంగా ఉండేందుకు ప్రతి ప్రయత్నాన్ని చేస్తున్నారని అన్నారు.
ఆసియా క్రీడలు ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వరకు చైనాలోని హంగ్‌ఝౌలో జరుగనుండగా, ఒలింపిక్ క్రీడలు 26 జులై 2024 నుంచి 11 ఆగస్టు 2024 వరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో వచ్చే ఏడాది జరుగనున్నాయి.
***
(Release ID: 1904722)
Visitor Counter : 169