రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పిఎంబిజెపి గురించి పిల్ల‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు 5వ ఔష‌ధి దివ‌స్‌లో భాగంగా 34 ప్ర‌దేశాల‌లో బాలమిత్ర దివ‌స్ నిర్వ‌హ‌ణ‌


పిఎంబిజెపిలో మైగ‌వ్ ప్లాట్‌ఫార్మ్‌పై బాల‌మిత్రుల‌కు ఆన్‌లైన్ క్విజ్ పోటీ నిర్వ‌హ‌ణ

Posted On: 04 MAR 2023 8:23PM by PIB Hyderabad

ప్ర‌స్తుతం సాగుతున్న జ‌న ఔష‌ధి దివ‌స్ 2023లో నాలుగ‌వ రోజును ఆదివారంనాడు బాల మిత్ర దివ‌స్‌గా జ‌రుపుకున్నారు. ఐద‌వ జ‌న ఔష‌ధి దివ‌స్ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా వారంరోజు వేడుక‌ల‌ను ఫార్మ‌స్యూటిక‌ల్స్ & మెడిక‌ల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ) నిర్వ‌హిస్తోంది.  ప్ర‌ధాన మంత్రి భార‌తీయ జనౌష‌ధి ప‌రియోజ‌న (పిఎంబిజెపి) నాలుగ‌వ రోజు వేడుక‌ల‌ను పిల్ల‌ల‌కు అంకితం చేశారు. 
ఈ సంద‌ర్భంగా, పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్విజ్ పోటీని నిర్వ‌హించి, ఇందులో గెలిచిన 50మంది విజేత‌ల‌కు రూ. 500 చొప్పున న‌గ‌దు బ‌హుమానం ఇచ్చారు. ఈ క్విజ్ ద్వారా జ‌న ఔష‌ధి ప‌థ‌కం, దాని ప్ర‌యోజ‌నాల గురించి పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. 
ఆదివారం జ‌న ఔష‌ధి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకునేందుకు పెద్ద సంఖ్య‌లో పిల్ల‌లు ఈ వేడుక‌లో భాగ‌మ‌య్యారు. పిఎంబిజెపికి సంబంధించిన జ్ఞానాన్ని వ్యాప్తి చేసేందుకు పిల్ల‌ల‌కు మాస్కుల‌ను, బెలూన్ల‌ను, స్కైలాంట‌ర్న్‌ల‌ను ఎగుర‌వేయ‌డాన్ని పిఎంబిఐ నిర్వ‌హించింది. 
ప‌రియోజ‌న ప్ర‌యోజ‌నాలు దేశంలో న‌లుమూల‌ల‌కు చేరేందుకు మ‌హిళ‌లు,  వృద్ధుల‌ను, విద్యార్దులు, పిల్ల‌లు స‌హా సాధార‌ణ ప్ర‌జానీకంతో  క‌లిసి ప‌ని చేసేందుకు పిఎంబిజెపి కింద  పిఎంబిజెపి అమ‌లు సంస్థ అయిన‌ ఫార్మ‌స్యూటీక‌ల్స్‌& మెడిక‌ల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ) ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. 
జ‌న ఔష‌ధి ప‌థ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంపై దృష్టిపెట్టి వివిధ న‌గ‌రాల‌లో 1 మార్చి 2023 నుంచి 7 మార్చి 2023 వ‌ర‌కు ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఫార్మ‌స్యూటిక‌ల్స్ విభాగం ప్ర‌ణాళిక‌కు రూప‌క‌ల్ప‌న చేసింది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/  కేంద్రపాలిత ప్రాంతాలలో పిఎంబిజెకె య‌జ‌మానులు, ల‌బ్ధిదారులు, రాష్ట్ర‌/  యుటి అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, న‌ర్సులు, ఫార్మ‌సిస్టులు & జ‌న ఔష‌ధి మిత్రుల‌ను క‌లుపుకుని  సెమినార్లు, పిల్లలు, మ‌హిళ‌లు, ఎన్జీవోల‌ కోసం కార్య‌క్ర‌మాలు, హెరిటేజ్ వాక్స్‌, ఆరోగ్య శిబిరాలు నిర్వ‌హిస్తోంది. 
దేశంలోని ప్ర‌తిమారుమూల ప్రాంతంలో కూడా స‌ర‌స‌మైన ధ‌ర‌లో ఔష‌ధాలు ప్ర‌జ‌ల‌కు సులువుగా అందుబాటులోకి వ‌చ్చేలా ఈ ప‌థ‌కం ఖ‌రారు చేస్తుంది.
ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి కేంద్రాల‌ను(పిఎంబిజెకె) డిసెంబ‌ర్ 2023 నాటికి 10,000కు పెంచాల‌నే ల‌క్ష్యాన్ని ప్ర‌భుత్వం పెట్టింది. పిఎంబిజెపిలోని ఉత్ప‌త్తుల బాస్కెట్‌లో 1759 మందులు, 280 శ‌స్త్ర ప‌రిక‌రాలు ఉన్నాయి. అంతేకాక‌,  కొత్త మందులు, ప్రోటీన్ పొడి, మాల్ట్ ఆధారిత ఆహార స‌ప్లిమెంట్లు, ప్రోటీన్ బార్లు, ఇమ్యూనిటీ (రోగ‌నిరోధ‌క‌త‌)  బార్లు, వంటి న్యూట్రాస్యూటిక‌ల్స్ ఉత్ప‌త్తులు, శానిటైజ‌ర్లు, మాస్కులు, గ్లూకోమాట‌ర్లు, ఆక్సిమీట‌ర్లు త‌దిత‌రాల‌ను కూడా ప్రారంభించింది.
పిఎంబిజెపి కింద అందుబాటులో ఉండే మందులు బ్రాండెడ్ ధ‌ర‌ల‌క‌న్నా 50%-90% త‌క్కువ ధ‌ర‌లో ఉంటాయి. ఆర్థిక సంవ‌త్స‌రం 2021-2022లో పిఎంబిజెపి రూ. 893.56 కోట్ల (ఎంఆర్‌పిలో) అమ్మ‌కాల‌ను సాధించింది. ఆర్థిక సంవ‌త్స‌రం (2022-2023)లో పిఎంబిజెపి రూ. 1100 కోట్ల‌కు పైగా అమ్మ‌కాల‌ను సాధించి, ప్ర‌స్తుత ఆర్ధిక‌ సంవ‌త్స‌రంలో పౌరుల‌కు దాదాపు రూ. 6600 కోట్ల‌ను ఆదా చేసేందుకు తోడ్ప‌డింది. 


 

****


(Release ID: 1904597) Visitor Counter : 125
Read this release in: English , Urdu , Marathi , Hindi