రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రూ. 339.55 కోట్ల అంచ‌నా వ్య‌యంతో దీమాపూర్ నుంచి కోహిమా (ప్యాకేజీ -2) వ‌ర‌కు 14,71 కిలోమీట‌ర్ల 4లేన్ ర‌హ‌దారి నిర్మాణాన్ని చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించిన శ్రీ నితిన్ గ‌డ్క‌రీ

Posted On: 06 MAR 2023 2:45PM by PIB Hyderabad

 దీమాపూర్ నుంచి కోహిమా (ప్యాకేజ్ -2) 14.71 కిలోమీట‌ర్ల పొడ‌వైన ఫోర్‌-లేన్ ర‌హ‌దారిని నిర్మాణం చేసేందుకు ప్ర‌ధానమైన మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ప్రాజెక్టును నాగాల్యాండ్‌లో చేప‌డుతున్నట్టు  త‌న ట్వీట్‌ల ప‌రంప‌ర‌లో, కేంద్ర ర‌హ‌దారి ర‌వాణా & జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.  ఈ ప్రాజెక్టు మొత్తం అంచ‌నా వ్య‌యం రూ. 339.55 కోట్ల‌ని తెలిపారు. 

Image


రాష్ట్రంలో రాజ‌ధాని న‌గ‌రాన్ని, ఇత‌ర ప్ర‌ధాన వాణిజ్య కేంద్రాల మ‌ధ్య అనుసంధాన‌త‌ను మెరుగుప‌ర‌చ‌డం ద్వారా వృద్ధి, శ్రేయ‌స్సు కోసం ప్ర‌జ‌ల‌, స‌రుకు ర‌వాణా వేగంగా జ‌రిగేందుకు తోడ్ప‌డ‌డం ఈ ప్రాజెక్టు ప్రాధ‌మిక ల‌క్ష్య‌మ‌ని శ్రీ గడ్క‌రీ అన్నారు. 

 

Image


ప్ర‌ధాన‌మంత్రి నాయ‌క‌త్వంలో త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన‌, స్థిర‌మైన ర‌హ‌దారి మౌలిక‌స‌దుపాయాల‌ను స‌మ‌య‌పాల‌న‌తో, నాణ్య‌తా ప్ర‌మాణాల‌పై రాజీ ప‌డ‌కుండా అందించ‌డం త‌మ ల‌క్ష్య‌మ‌ని మంత్రి తెలిపారు. 

Image

***
 



(Release ID: 1904547) Visitor Counter : 130