రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ రైల్వేలు ఫిబ్రవరి నెలవారీ సరుకు రవాణాను ఫిబ్రవరి 23లో అత్యదికంగా 124.03 మెట్రిక్‌ టన్నుల రవాణాను నమోదు చేసింది.


2022లో సాధించిన మునుపటి అత్యదిక ఫిబ్రవరి గణాంకాల కంటే ఇది 3.55% వృద్ధి.

ఏప్రిల్ 22 నుండి ఫిబ్రవరి 23 వరకు 1367.49 మెట్రిక్ టన్నుల సంచిత సరుకు రవాణాను నమోదు చేసింది.

భారతీయ రైల్వేలు 30 నెలలపాటు అత్యదిక నెలవారీ సరుకు రవాణాను చేసాయి.

Posted On: 04 MAR 2023 11:07AM by PIB Hyderabad

భారతీయ రైల్వేలు ఫిబ్రవరి నెలవారీ  సరుకు రవాణాను ఫిబ్రవరి '23లో అత్యదికంగా 124.03 మెట్రిక్ టన్నుల రవాణాను నమోదు చేసింది. ఫిబ్రవరి నెలలో  లోడింగ్ వృధ్ధి 4.26 ఎం టీ, అంటే 2022లో సాధించిన మునుపటి ఉత్తమ ఫిబ్రవరి గణాంకాల కంటే ఇది 3.55% వృద్ధి.

 

దీనితో, భారతీయ రైల్వేలు వరుసగా 30 నెలలపాటు అత్యుత్తమ నెలవారీ సరుకు రవాణా చేశాయి.

 

ఐ ఆర్ బొగ్గులో 3.18 ఎం టీ, ఎరువులలో 0.94 ఎం టీ, ఇతర వస్తువులలో 0.66 ఎం టీ, పీ ఓ ఎల్ లో 0.28 ఎం టీ మరియు కంటైనర్‌లో 0.27 ఎం టీ వృధ్ధిని సాధించింది.

 

ఆటోమొబైల్ లోడింగ్‌లో వృధ్ధి ఎఫ్ వై 2022-23లో ఫ్రైట్ వ్యాపారంలో మరో ముఖ్యాంశం మరియు 2022-23 ఎఫ్ వై లో ఫిబ్రవరి వరకు 5015 రేక్‌లు లోడ్ చేయబడ్డాయి, గత సంవత్సరం ఇదే కాలంలో 2966 రేక్‌లు అంటే ఇది గత ఏడాది కంటే 69% వృద్ధి.

 

2021-22లో సాధించిన 1278.84 ఎం టీ నుండి ఏప్రిల్'22 నుండి ఫిబ్రవరి'23 వరకు సంచిత సరుకు లోడ్ 1367.49 ఎం టీ గా ఉంది అంటే లోడింగ్ 88.65 ఎం టీ లు వృధ్ధి చెందింది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.93% వృద్ధి.

 

సరుకు రవాణా  ఫిబ్రవరి'22లో 70 బిలియన్ల నుండి ఫిబ్రవరి'23 నాటికి ఎన్ టి కే ఎం (NTKM)లు (నికర టన్ను కిలోమీటర్లు) 73 బిలియన్లకు పెరిగాయి, ఇది 4.28% వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్'22 నుండి ఫిబ్రవరి'23 వరకు సంచిత సరుకు రవాణా గత ఏడాది 74 బిలియన్ల నుండి ఎన్‌టికెఎమ్‌లు 82 బిలియన్‌లులకు పెరిగింది , గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 10.81% వృద్ధిని సాధించింది.

 

విద్యుత్ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖలతో సన్నిహిత సమన్వయంతో పవర్ హౌస్‌లకు బొగ్గు సరఫరాను పెంచడానికి భారతీయ రైల్వేలు చేసిన నిరంతర ప్రయత్నాలు ఫిబ్రవరి నెలలో సరుకు రవాణా పనితీరు లో వృధ్ధి మరో ముఖ్య అంశాలలో ఒకటి. గత ఏడాది 42.24 ఎం టీ నుండి 45.63 ఎం టీ బొగ్గు పవర్ హౌస్‌లకు తరలించబడింది, అంటే 8.02 % వృద్ధితో పవర్ హౌస్‌లకు జనవరిలో బొగ్గు (దేశీయ మరియు దిగుమతి రెండూ) లోడ్ చేయడం  3.39 ఎం టీ లకు పెరిగింది. సంచితంగా, సంవత్సరం మొదటి పదకొండు నెలల్లో, ఐ ఆర్ గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 79.69 ఎం టీ అదనపు బొగ్గును పవర్ హౌస్‌లకు లోడ్ చేసింది, అంటే లోడింగ్ లో కూడా 15.44% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది.

 

కమోడిటీ వారీగా వృద్ధి సంఖ్యలు ఈ క్రింది వృద్ధి రేట్లతో దాదాపు అన్ని కమోడిటీ విభాగాలలో ఐ ఆర్ వృద్ధిని సాధించిందని చూపుతున్నాయి:

సరుకు

వైవిధ్యం (ఎం టీ)

% వైవిధ్యం

బొగ్గు

3.18

5.70 %

ఎరువులు

0.94

25 %

ఇతర వస్తువుల బ్యాలెన్స్

0.66

6.51 %

పీ ఓ ఎల్ 

0.28

7.77 %

కంటైనర్

0.27

4.32%

 

***


(Release ID: 1904312) Visitor Counter : 154