యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పీవీ సింధుకు తోడ్పాటునందించేలా ఆర్థిక సాయం
- ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లు, ఇతర పోటీలకు పీవీ సింధు కోచ్ & ఫిట్‌నెస్ ట్రైనర్‌కు ఆర్థిక సాయం అందించేందుకు టాప్స్ ఆమోదం
Posted On:
03 MAR 2023 12:18PM by PIB Hyderabad
ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్, స్విస్ ఓపెన్, స్పెయిన్ మాస్టర్స్ పోటీలలో పాల్గొనేందుకు ఆమె కోచ్ విధి చౌదరి & ఫిట్‌నెస్ ట్రైనర్ శ్రీకాంత్ మాడపల్లిలకు ఆర్థిక సహాయం ఆందించే ప్రతిపాదనకు యువజన వ్యవహారాలు క్రీడలు శాఖకు (ఎంవైఏఎస్) చెందిన మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) గురువారం, మార్చి 2వ తేదీన ఆమోదం తెలిపింది. వీరి వీసా, విమాన ఛార్జీలు, ప్రయాణం, బస, బోర్డింగ్ మరియు ఆహార ఖర్చులను కవర్ చేసే విధంగా ఆర్థిక సహాయం ఉంటుంది. ఇతర ఖర్చుల కోసం వీరికి రోజువారీ భత్యాన్ని కూడా అందిస్తారు. ఈ సమావేశంలో, భారత షూటర్ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత అనిష్ భన్వాలా జర్మనీలో విదేశీ కోచ్ రాల్ఫ్ షూమాన్ వద్ద శిక్షణ పొందాలనే ప్రతిపాదనను కూడా ఎంఓసీ ఆమోదించింది. అతను మొత్తం 28 రోజుల పాటు సుహ్ల్‌లో శిక్షణ పొందుతాడు. మార్చి చివరి వారంలో ఇందుకోసం విదేశాలకు వెళ్లనున్నాడు, టాప్స్ ఆర్థిక సహాయం అనీష్ యొక్క కోచ్, శిక్షణ మరియు మందుగుండు సామగ్రి ఖర్చులతో పాటు అతని విమాన ఛార్జీలు, వీసా, ప్రయాణం, బస, బోర్డింగ్ మరియు ఆహార ఖర్చులను కూడా అందిచేలా ఈ సాయం ఉంటుంది.
*****
(Release ID: 1904114)