సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల ద్వారా మొత్తం 1,09,976 ఫిర్యాదుల పరిష్కారం; సెంట్రల్ సెక్రటేరియట్ లో సగటున 18 రోజుల పరిష్కార సమయం/ ఫిర్యాదు, అత్యల్పంగా పెండెన్సీ స్థాయి 65215 కేసులు


సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించడం లోనూ, పరిష్కార నాణ్యత లోనూ కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల ఫిర్యాదుల పరిష్కార సూచికలో అగ్రస్థానంలో నిలిచిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పెన్షన్ రిఫార్మ్స్), నీతి ఆయోగ్.

ఫిర్యాదుల్లో 60.29 శాతం
కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు అందాయి

ఎ ఐ ఎనేబుల్డ్ ఇంటెలిజెన్స్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ,డ్యాష్ బోర్డులు అమలు, అలవాటైన ఫిర్యాదుల గుర్తింపు, గరిష్ట పెండెన్సీతో పబ్లిక్ గ్రీవెన్స్ అధికారుల గుర్తింపు

Posted On: 03 MAR 2023 10:38AM by PIB Hyderabad

డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ (డీఏఆర్పీజీ) ఫిబ్రవరి, 2023 కు సంబంధించి సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సిపిజిఆర్ఎస్) నెలవారీ నివేదికను విడుదల చేసింది, ఇది ప్రజా ఫిర్యాదుల రకాలు ,వర్గాలు, పరిష్కార స్వభావం యొక్క వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎ- ఐ ఎనేబుల్డ్ పిజి అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్ పై ఐఐటి కాన్పూర్ సహకారంతో డిఎ ఆర్ పి జి చేపట్టిన సాంకేతిక మెరుగుదలలు కూడా నివేదికలో ఉన్నాయి.

ఫిబ్రవరి, 2023 లో కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు 1,09,976 ఫిర్యాదులను పరిష్కరించాయి, సగటు పరిష్కార సమయం  18 రోజులు/ ఫిర్యాదు. సెంట్రల్ సెక్రటేరియట్ లో అత్యల్పంగా 65215 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు  అందిన ఫిర్యాదుల్లో 60.29 శాతం కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అందాయి.

2023 ఫిబ్రవరి నెలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల డీ ఏ ఆర్ పి జి నెలవారీ సీపీజీఆర్ఎంఎస్ నివేదికలోని ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పిజి కేసులు

2023 ఫిబ్రవరిలో సీపీజీఆర్ఎంఎస్ పోర్టల్ లో 107308 పీజీ కేసులు

వచ్చాయి.109976 పీజీ కేసులు పరిష్కారమయ్యాయయి. 2023 ఫిబ్రవరి 25 నాటికి 65215 పీజీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ లో పెండింగ్ కేసులు 2023 జనవరి చివరి నాటికి 67883 పీజీ కేసులు ఉండగా, 2023 ఫిబ్రవరి చివరి నాటికి 65215 పీజీ కేసులకు తగ్గాయి. వరుసగా 7వ నెల కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలలో నెలవారీ పరిష్కారం లక్ష కేసులను దాటింది.డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకింగ్ డివిజన్) [18478 ఫిర్యాదులు], కార్మిక - ఉపాధి మంత్రిత్వ శాఖ [14269 ఫిర్యాదులు], కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (ఆదాయపు పన్ను) [5544 ఫిర్యాదులు] ,వ్యవసాయ - రైతు సంక్షేమ శాఖ [5500 ఫిర్యాదులు] ఫిబ్రవరి, 2023 లో అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులను స్వీకరించాయి.

పిజి అప్పీల్స్

2023 ఫిబ్రవరిలో 15729 అప్పీళ్లు రాగా, 15270 అప్పీళ్లను పరిష్కరించారు. సెంట్రల్ సెక్రటేరియట్ లో 2023 ఫిబ్రవరి చివరి నాటికి 26721 పీజీ అప్పీళ్లు పెండింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (ఆదాయపు పన్ను) [2960 అప్పీళ్లు], కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ [2364 అప్పీళ్లు], డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ [1304 అప్పీళ్లు),] హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ [1120 అప్పీళ్లు] 2023 ఫిబ్రవరి చివరి నాటికి అత్యధికంగా అప్పీళ్లు పెండింగ్ లో ఉన్నాయి.

ఫిర్యాదుల పరిష్కార సూచిక

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలు 2023 ఫిబ్రవరి గ్రూప్ ఎలో గ్రీవెన్స్ రిడ్రెసల్ ఇండెక్స్ లో టాప్ పెర్ఫార్మర్లు గా నిలిచాయి.

2023 ఫిబ్రవరి గ్రూప్ బిలో ఫిర్యాదుల పరిష్కార సూచీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పెన్షన్ రిఫార్మ్స్), నీతి ఆయోగ్ టాప్ పెర్ఫార్మర్లు గా నిలిచాయి.

పెండింగ్ 

25 ఫిబ్రవరి, 2023 నాటికి 17 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ లకు 1000 కంటే ఎక్కువ పెండింగ్ ఫిర్యాదులు ఉన్నాయి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (ఆదాయపు పన్ను) [7768 ఫిర్యాదులు] డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ [2432 గ్రీవెన్స్] అత్యధికంగా 30 రోజులకు పైగా పెండింగ్ లో ఉన్నాయి.

సగటు పరిష్కార సమయం

2023 సంవత్సరంలో అన్ని మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో సగటు ఫిర్యాదుల పరిష్కార సమయం 2023 జనవరి 1 నుండి ఫిబ్రవరి 25 వరకు 18 రోజులు

బిఎస్ ఎన్ ఎల్ కాల్ సెంటర్ నుంచి ఫీడ్ బ్యాక్

2023 ఫిబ్రవరి 1 నుండి 25 వరకు బిఎస్ఎన్ఎల్ కాల్ సెంటర్ ద్వారా సేకరించిన ఫీడ్ బ్యాక్ లో కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల కోసం, 4321 ఫిర్యాదులు పౌరుల నుండి నేరుగా ఎక్సలెంట్ అండ్ వెరీ గుడ్ రేటింగ్ పొందాయి.

పరిష్కార నాణ్యతను మెరుగుపరచడానికి, సమయ రేఖలను తగ్గించడానికి

డి ఎ ఆర్ పి జి  అనుసరించిన 10-దశల సి పి జి ఆర్ ఎ ఎం ఎస్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఈ నివేదికలు ఉన్నాయి. 10 దశల సంస్కరణల్లో ఈ క్రిందివి  ఉన్నాయి:

సి పి జి ఆర్ ఎ ఎం ఎస్ 7.0 సార్వత్రికీకరణ - ఫిర్యాదులను చివరి మైలు వరకు ఆటో-రూటింగ్ చేయడం

సాంకేతిక మెరుగుదలలు - ఎ ఐ/ ఎం ఎల్  ద్వారా అత్యవసర ఫిర్యాదులను ఆటోమేటిక్ గా ఫ్లాగ్ చేయడం

లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ - ఇంగ్లిష్ తో పాటు 22 షెడ్యూల్డ్ భాషల్లో సీపీజీఆర్ ఎంఎస్ పోర్టల్

ఫిర్యాదుల పరిష్కార సూచిక - మంత్రిత్వ శాఖలు/ విభాగాల పనితీరు ఆధారంగా వాటి ర్యాంకింగ్

ఫీడ్ బ్యాక్ కాల్ సెంటర్ - ఫిర్యాదును పరిష్కరించిన ప్రతి పౌరుడి నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ సేకరించడానికి 50 సీట్ల కాల్ సెంటర్

వన్ నేషన్ వన్ పోర్టల్ - రాష్ట్ర పోర్టల్, ఇతర ప్రభుత్వ పోర్టల్ లను సి పి జి ఆర్ ఎ ఎం ఎస్ తో అనుసంధానం చేయడం

ఇన్ క్లూజివిటీ,  ఔట్ రీచ్ - సి ఎస్ సిల ద్వారా ఫిర్యాదులను దాఖలు చేయడానికి మారుమూల పౌరుడికి సాధికారత కల్పించడం

శిక్షణ, సామర్ధ్యాన్ని పెంపొందించడం - సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం సేవోత్తమ్ పథకం కింద ఐఎస్ టిఎమ్ , స్టేట్ ఎటిఐ ల ద్వారా నిర్వహణ

మానిటరింగ్ ప్రాసెస్ - కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు,రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటి కోసం నెలవారీ నివేదికలు

డేటా స్ట్రాటజీ యూనిట్ - అంతర్లీన డేటా విశ్లేషణల కోసం డి ఎ ఆర్ పి జి లో ఏర్పాటు. భవిష్యత్తులో ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించడానికి కూడా డి ఎ ఆర్ పి జి తన ప్రణాళికలను ఆవిష్కరించింది.

ఇందు కోసం డి ఎ ఆర్ పి జి  ఐఐటి కాన్పూర్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాల గ్రీవెన్స్ ఆఫీసర్ల ప్రయోజనం కోసం ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు ను అమలు చేసింది.

 

<><><><><>


(Release ID: 1904111) Visitor Counter : 187