విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పునరావృత ఇంధన ఆస్తులను ఎన్‌టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జిఇఎల్)కు బదిలీ చేసిన ఎన్‌టిపిసి లిమిటెడ్
Posted On:
01 MAR 2023 10:17AM by PIB Hyderabad
ఎన్‌టిపిసి లిమిటెడ్ తన పునరుత్పాదన ఇంధన (ఆర్ ఇ) పోర్ట్‌ఫోలియోను తన నూతన సంస్థ ఎన్‌టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జిఇఎల్) కింద ఏకీకృతం చేయడాన్ని పూర్తి చేసింది.
ఏకీకరణలో వ్యాపార ఒప్పందం ద్వారా 15 ఆర్ఇ ఆస్తులను బదిలీ చేయడం జరిగింది
కార్పొరేట్ వ్యాపార ప్రణాళికలో భాగంగా ఆర్థిక సంవత్సరం 32 నాటికి 60 గిగావాట్ల సామర్ధ్యాన్ని సాధించడం ఈ ఏకీకరణ లక్ష్యం
దేశ ఆస్తుల విలువను నిర్ధారించేందుకు, ద్రవ్యీకరణ మార్గంగా ఈ ఏకీకరణకు భారత ప్రభుత్వం జాతీయ విత్త మార్గం ద్వారా మార్గాన్ని సుగమం చేసింది
భారత ప్రభుత్వ నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్ ఆధ్వర్యంలో ఎన్‌టిపిసి లిమిటెడ్ (ఎన్‌టిపిసి) తన పునరావవృత ఇంధన (ఆర్ఇ) పోర్ట్‌ఫోలియాను తన గొడుగు సంస్థలలో ఒకటైన ఎన్‌టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జిఇఎల్)తో ఏకీకృతం చేసేందుకు సంబంధిత లావాదేవీలను ఫిబ్రవరి 28, 2023న పూర్తి చేసింది. ఎన్‌టిపిసి యాజమాన్యంలోని ఆర్ఇ ఆస్తులను/ సంస్థలను ఏప్రిల్ 07, 2022 ఏర్పాటు చేసిన, పూర్తిగా తన యాజమాన్యంలోని, ఎన్‌జిఇఎల్‌కు బదిలీ చేయడం ఇది.
ఈ లావాదేవీలలో 15 ఆర్ఇ ఆస్తులను వ్యాపార బదిలీ ఒప్పందం (బిటిఎ) ద్వారా బదిలీ చేయడంతో పాటుగా, ఎన్‌టిపిసి పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్‌టిపిసి రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్ఆర్ఇఎల్) లో జులై 08, 2022న అమలు చేసిన100% ఈక్విటీ వాటాలను షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్‌పిఎ - వాటాల కొనుగోలు ఒప్పందం) ద్వారా బదిలీ చేయడం ఉన్నాయి.
ఆర్థిక సంవత్సరం 2032 నాటికి 60 గిగావవాట్ల ఆర్ ఇ సామర్ధ్యాన్ని సాధనను వేగవంతం చేయడం పై దృష్టి పెట్టిన ఈ పథకాన్ని గ్రూప్ కార్పొరేట్ వాణిజ్య ప్రణాళికలో భాగంగా అమలు చేశారు.
***
(Release ID: 1903682)
Visitor Counter : 155