వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

రెండ‌వ బి20 కార్య‌క్ర‌మానికి 1-3 మార్చి 2023 వ‌ర‌కు ఆతిథ్య‌మివ్వ‌నున్న ఐజ్వాల్‌

Posted On: 28 FEB 2023 3:14PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతంలో నిర్వ‌హించేందుకు ఉద్దేశించిన‌ నాలుగు బి20 ఇండియా కార్య‌క్ర‌మాల‌లో  భాగంగా1-3 మార్చి 2023 వ‌ర‌కు జ‌రుగ‌నున్న రెండ‌వ చ‌ర్చా కార్యక్ర‌మానికి ఐజ్వాల్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. బిజినెస్ 20 (బి20) అనేది ప్ర‌పంచ వ్యాపార స‌మాజానికి అధికారిక జి20 చ‌ర్చా ఫోరం. 
జి20లో అత్యంత గుర్తింపుపొందిన కార్య‌క్ర‌మ బృందాలుగా, బి20 అన్న‌ది జి20 వాణిజ్య స‌మూహాల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తూ, ప్ర‌పంచ ఆర్థిక‌, వాణిజ్య‌పాల‌న‌పై ప్ర‌పంచ వాణిజ్య నాయ‌కుల అభిప్రాయాల‌ను స‌మీక‌రిస్తుంది. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని పెంచేందుకు బి20 వంతుల‌వారీగా వ‌చ్చే  ప్ర‌తి  అధ్య‌క్షుల‌కు స్ప‌ష్ట‌మైన విధాన సూచ‌న‌ల‌ను అందిస్తుంది. బి 20 స‌ద‌స్సు సంద‌ర్భంగా, త‌మ అంతిమ సూచ‌న‌ల‌ను జి20 అధ్య‌క్షుల‌కు బి20 పంపుతుంది. 
మార్చి 1 నుంచి 3వ తేదీవ‌ర‌కు ఐజ్వాల్‌లో జ‌రుగ‌నున్న బి20 కార్య‌క్ర‌మం ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక‌, మౌలిక స‌దుపాయాలు, వెదురు, స్టార్ట‌ప్‌లు, నైపుణ్యాల అభివృద్ధి, న‌ర్సింగ్‌, పారామెడిక్స్‌ల‌లోని ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర అందించే బ‌హుపాక్షిక వ్యాపార భాగ‌స్వామ్య అవ‌కాశాల‌ను ప‌ట్టిచూపుతుంది. ఈ మూడు రోజుల కార్య‌క్ర‌మంలో మంత్రుల నుంచి, సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారులు, రాయ‌బారులు, వాణిజ్య స‌మాజ ప్ర‌తినిధుల వ‌ర‌కు దాదాపు 500మంది  పాలుపంచుకుంటార‌ని అంచ‌నా.
ఈ మూడు రోజుల కార్య‌క్ర‌మం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం విస్త్ర‌త‌మైన ఏర్పాట్లు చేసింది. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తినిధులు వ‌చ్చిన త‌ర్వాత సాంస్కృతిక సాయంత్రం, రాజ‌భ‌వ‌న్‌లో ఆహ్వాన విందుతో ప్రారంభం అవుతుంది. రెండవ రోజున మిజోరాం స్టేట్ యూనివ‌ర్సిటీలో బి20 స‌ద‌స్సు, అనంత‌రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. 
ఐజ్వాల్‌లో బి20 స‌ద‌స్సు ముగింపుగా  మూడవ రోజు ఎఆర్ గ్రౌండ్‌లో మిజోరాం వ‌సంతోత్స‌వ‌మైన చ‌ప్‌చార్ కుట్ ను ప్ర‌తినిధుల‌కు ప్ర‌ద‌ర్శిస్తారు.  
ఈశాన్యానికి ఉద్దేశించిన నాలుగు బి20 కార్య‌క్ర‌మాలు అనేవి ఈశాన్య రాష్ట్రాల‌లో ఉప‌యోగించ‌ని సంభావ్య‌త‌, అవ‌కాశాల‌ను ప‌ట్టిచూపే ల‌క్ష్యంతో నిర్వ‌హిస్తున్నారు. 

***
 



(Release ID: 1903084) Visitor Counter : 204