సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం సంధర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గోవా మల్టీమీడియా ప్రదర్శనను ఏర్పాటు చేసింది
పీ ఐ బీ ముంబై ద్వారా పోస్ట్ చేయబడింది: 28 ఫిబ్రవరి 2023 మధ్యాహ్నం 1:55,
Posted On:
28 FEB 2023 1:55PM by PIB Hyderabad
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, గోవా పనాజీలోని కదంబ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్‌లో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంపై మల్టీమీడియా ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్‌ను నార్త్ గోవా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) నిధిన్ వల్సన్ ఈరోజు ప్రారంభించారు. మార్చి 3 వరకు ప్రదర్శన ప్రజలకు తెరిచి ఉంటుంది, ఎగ్జిబిషన్ లో సందర్శకులకు తృణధాన్యాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం మరియు రోజువారీ ఆహారంలో వాటిని చేర్చడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఐ సీఏ ఆర్-సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ కార్యక్రమంలో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది, ఇక్కడ సందర్శకులు తృణధాన్యాల పై సబ్జెక్ట్ నిపుణులతో సంభాషించవచ్చు మరియు వాటి ప్రత్యక్ష నమూనాలను చూడవచ్చు. ఎగ్జిబిషన్ లో నాలెడ్జ్ పార్ట్‌నర్‌లుగా ఇన్‌స్టిట్యూట్ గోవా తృణధాన్యాలపై అవగాహన అందిస్తోంది, ఇందులో చారిత్రక మరియు ప్రస్తుత పరిస్థితుల యొక్క అవలోకనం కూడా ఉంది.
ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, క్యాన్సర్ సర్వైవర్ మరియు ట్రయాథ్లాన్ అథ్లెట్ అయిన ఎస్పీ నిధిన్ వల్సన్ తన ఆరోగ్యాన్ని మార్చడంలో తృణధాన్యాలు చాలా ముఖ్య భాగమని అన్నారు. తన సొంత తృణధాన్యాల అనుభవాన్ని పంచుకుంటూ, అధికారి ఇటీవలి విజయవంతంగా పూర్తి చేసిన ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌లో తన శిక్షణలో తృణధాన్యాలు ఎలా కీలకమైన పాత్ర పోషించాయో వివరించారు. “గత 10 నెలలుగా, నా డిన్నర్ మరియు అల్పాహారం తృణధాన్యాలే అని ఆయన అన్నారు. నేను మొట్టమొదట మారటం చేసినప్పటి నుండి రాగి మాల్ట్ ప్రతిరోజూ నా డిన్నర్, దానితో నా బరువు పెరగకుండానే నా బలం మరియు శక్తి ఓర్పు గణనీయంగా మెరుగుపడింది”, ఆరోగ్యకరమైన రేపటి కోసం తృణధాన్యాలను వారి ఆహారంలో చేర్చుకోవాలని సందర్శకులను ప్రోత్సహిస్తూ ఎస్ పీ మాట్లాడారు.
ఐ సీఏ ఆర్ - సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తృణధాన్యాల ఉత్పత్తి కొన్ని సంవత్సరాల్లో స్వల్పంగా మాత్రమే పెరిగింది. తృణధాన్యాలకు చాలా తక్కువ ఇన్‌పుట్‌లు అవసరమవుతాయి మరియు చాలా తక్కువ నీటిని వినియోగిస్తాయని, వాటిని సులభంగా రైతులు ఎలా పండించాలి అనే విషయం వివరించారు. శరీరానికి పెద్ద మొత్తంలో పోషకాహారాన్ని అందించడంతోపాటు వివిధ రకాల జీవనశైలి వ్యాధులతో పోరాడేందుకు తృణధాన్యాలు సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ బరువు తగ్గడానికి మరియు రక్తం లో మధుమేహ స్థాయిని మెరుగుపరిచేందుకు తన ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకున్న ఘనత ఆయనది.
ఈ కార్యక్రమంలో తయారు చేసిన తృణధాన్యాల అల్పాహార ఉత్పత్తుల పంపిణీ చేయడంతో పాటు స్థానిక కళాకారులచే చిన్న సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది. ఎగ్జిబిషన్‌కు ప్రవేశం అందరికీ ఉచితం మరియు ప్రదర్శన అందరికీ అందుబాటులో ఉంటుంది.
అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం గురించి
తృణధాన్యాలు సాంప్రదాయ ధాన్యాలు, వీటిని భారత ఉపఖండంలో పండిస్తారు మరియు వినియోగిస్తారు. తృణధాన్యాలు గడ్డి కుటుంబానికి చెందిన చిన్న-ధాన్యాలు, వార్షిక, వెచ్చని-వాతావరణ తృణధాన్యాలు.
ఇతర ప్రసిద్ధ తృణధాన్యాలతో పోల్చినప్పుడు అవి తక్కువ నీటి అవసరాలు మరియు సంతానోత్పత్తిని కలిగి ఉండే వర్షాధార, ధృడ ధాన్యాలు. ప్రస్తుతం 130 కంటే ఎక్కువ దేశాలలో పండిస్తున్నారు, తృణధాన్యాలు ఆసియా మరియు ఆఫ్రికా అంతటా ఏబై కోట్ల కంటే ఎక్కువ మందికి సాంప్రదాయ ఆహారంగా పరిగణించబడుతున్నాయి. భారతదేశం చేసిన ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రపంచ జనాభాను పోషించడానికి ప్రపంచ ఆహార వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నందున, తృణధాన్యాలు సరసమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందిస్తాయి మరియు వాటి సాగును ప్రోత్సహించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఏప్రిల్ 2018లో, మిల్లెట్‌లను "న్యూట్రి సెరియల్స్"గా రీబ్రాండ్ చేశారు, భారీ ప్రచారం మరియు డిమాండ్ ను పెంచే లక్ష్యంగా చేసుకుని 2018 సంవత్సరాన్ని తృణధాన్యాల జాతీయ సంవత్సరంగా ప్రకటించారు . ప్రపంచ తృణధాన్యాల మార్కెట్ 2021-2026 మధ్య వ్యవధిలో 4.5% వార్షిక సగటు వృధ్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా వేయబడింది.
***
(Release ID: 1903082)
Visitor Counter : 188