పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
భారత్ డెన్మార్క్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాల్లో కాకుండా యూరప్ తో సహా ప్రపంచ దేశాల ప్రజల జీవనశైలిలో మార్పు తెచ్చి సుస్థిర అభివృద్ధి సాధనకు దోహదపడే ఆలోచనలు,విధానాలు, జ్ఞానం, సాంకేతికత, సామర్థ్య నిర్మాణం కోసం ఉపయోగపడతాయి ... శ్రీ భూపేంద్ర యాదవ్
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఇంధన లక్ష్యాల సాధన సాధ్యమేనని రెండు దేశాలు ప్రపంచానికి రుజువు చేయగలవు.. శ్రీ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
28 FEB 2023 11:57AM by PIB Hyderabad
భారత్ డెన్మార్క్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాల్లో కాకుండా యూరప్ తో సహా ప్రపంచ దేశాల ప్రజల జీవనశైలిలో మార్పు తెచ్చి సుస్థిర అభివృద్ధి సాధనకు దోహదపడే ఆలోచనలు,విధానాలు, జ్ఞానం, సాంకేతికత, సామర్థ్య నిర్మాణం కోసం ఉపయోగపడతాయని కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర సింగ్ అన్నారు.

దేశంలో ఈ రోజు 'ఇండియా - డెన్మార్క్: పార్టనర్స్ ఫర్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ సదస్సులో శ్రీ భూపేంద్ర యాదవ్ ప్రసంగించారు. డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడరిక్‌సెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 సెప్టెంబర్ 28న వర్చువల్ విధానంలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో రెండు దేశాల మధ్య హరిత , సుస్థిర అభివృద్ధి సాధనకు ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిందని శ్రీ యాదవ్ తెలిపారు. ఒప్పందం అమలులోకి వచ్చిన రోజు నుంచి రెండు దేశాలు హరిత , సుస్థిర అభివృద్ధి సాధనకు కృషి చేస్తున్నాయన్నారు. 2022 మే నెలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డెన్మార్క్ పర్యటనలో గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, వ్యర్థ జలాల నిర్వహణ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారతదేశం, డెన్మార్క్ అంగీకరించాయని ఆయన చెప్పారు. డెన్మార్క్, భారతదేశం మధ్య కుదిరిన హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం దేశాల మధ్య స్నేహపూర్వక, సహకార సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని మంత్రి అన్నారు.

వాతావరణం, ఇంధన రంగాల్లో కుదిరిన ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి భారతదేశం,డెన్మార్క్ దేశాలు జాతీయ లక్ష్యాలను నిర్ణయించుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నాయని శ్రీ యాదవ్ పేర్కొన్నారు. వాతావరణ, సుస్థిర ఇంధన రంగాల్లో లక్ష్యాలను ఏ విధంగా సాధించవచ్చు అన్న అంశాన్ని రెండు దేశాలు ప్రపంచ దేశాలకు తెలియజేయవచ్చు అని శ్రీ యాదవ్ అన్నారు.లక్ష్య సాధనకు కృషి చేస్తూనే రియో సదస్సు నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి పని చేయాల్సి ఉంటుందని శ్రీ యాదవ్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని శ్రీ యాదవ్ అన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిలకడలేని ఉత్పత్తి, వినియోగం పై తక్షణం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. పరిస్థితి అదుపు తప్పే లోగా చర్యలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన కాప్-27 సమావేశం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల పట్ల చేసి, సవాళ్ళను ఎదుర్కోవడానికి సుస్థిర జీవన శైలి, వినియోగంలో మార్పులు రావడం తప్పనిసరి అని స్పష్టం చేసిందని శ్రీ యాదవ్ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యావరణహిత జీవనశైలి కోసం ప్రతిపాదించిన లైఫ్ విధానాన్ని శ్రీ యాదవ్ ప్రస్తావించారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం లైఫ్ విధానం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తుందని శ్రీ యాదవ్ వివరించారు.వాతావరణ మార్పులతో సహా సుస్థిర నగరాలు సమాజాలు (ఎస్‌డిజి 11), బాధ్యతాయుతమైన ఉత్పత్తి, వినియోగం (ఎస్‌డిజి 12), ( ఎస్‌డిజి 13), భూమిపై జీవితం ( ఎస్‌డిజి 15), నీటి అడుగున జీవితం ( ఎస్‌డిజి 14) లాంటి అన్ని ఎస్‌డిజి లక్ష్య సాధనకు మిషన్ లైఫ్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దోహదపడుతుందని ఆయన అన్నారు.

గ్రహం మీద అందుబాటులో ఉన్న వనరులతో జీవనశైలి అన్ని స్థాయిలలో సంబంధం కలిగి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని శ్రీ యాదవ్ అన్నారు. “అలసట లేకుండా వెనుకంజ వేయకుండా స్థిరమైన సమగ్ర భవిష్యత్తును నిర్మించడానికి అవిశ్రాంతంగా కలిసి పనిచేయాలని సంకల్పిద్దాం!” అని శ్రీ యాదవ్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి , అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం పర్యావరణం, సుస్థిర అభివృద్ధి సాధన అంశాల్లో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని భావిస్తున్నదని శ్రీ యాదవ్ అన్నారు. దీనికోసం భారతదేశం అమలు చేస్తున్న వ్యక్తిగత, కుటుంబ, సమాజ ఆధారిత చర్యల కోసం లైఫ్ మిషన్ లో పాల్గోవాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చారు. సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధి వైపు భారతదేశం వేగంగా అడుగులు వేస్తోందని శ్రీ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ యాదవ్ పర్యావరణ కోణంలో జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
పర్యావరణ సమస్యల పరిష్కారానికి భారతదేశం, డెన్మార్ దేశాలు కలిసి కృషి చేస్తున్నాయని శ్రీ యాదవ్ అన్నారు. ఆఫ్‌షోర్ విండ్, పునరుత్పాదక ఇంధనంపై వ్యూహాత్మక సహకారం, ఆఫ్‌షోర్ విండ్ రంగాలలో సామర్థ్యం పెంపుదల, సాంకేతిక బదిలీ మధ్య రెండు దేశాల మధ్య అవగాహన ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డెన్మార్క్ రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ , క్రౌన్ ప్రిన్సెస్ మేరీ పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1903040)
సందర్శకుల సూచీ సంఖ్య : : 195