రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో రూ.6500 కోట్ల పెట్టుబడితో 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
27 FEB 2023 3:21PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలోని చిత్బాడా గ్రామంలో 6500 కోట్ల పెట్టుబడితో 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ బల్లియా లింక్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో లక్నో నుంచి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా కేవలం నాలుగున్నర గంటల్లో పాట్నా చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. బల్లియా నుండి బక్సర్‌కు అరగంటలో, బల్లియా నుండి ఛప్రాకు ఒక గంటలో, బల్లియా నుండి పాట్నాకు ఒకటిన్నర గంటల్లో చేరుకోవచ్చని ఆయన చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంతో, తూర్పు ఉత్తరప్రదేశ్‌కు బీహార్‌లోని ఛప్రా, పాట్నా, బక్సర్‌లతో మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని ఆయన తెలిపారు.
బల్లియా రైతుల కూరగాయలు లక్నో, వారణాసి, పాట్నా మండీలకు సులభంగా చేరుకోగలవని మంత్రి తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా కూరగాయల ఉత్పత్తి చేసే రైతులు మూడు మల్టీ మోడల్ టెర్మినల్స్ వారణాసి, ఘాజీపూర్ మరియు హల్దియా నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారని ఆయన చెప్పారు. చందౌలీ నుండి మొహానియా వరకు 130 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి ఉత్తరంలోని చందౌలీకి కనెక్టివిటీని కల్పిస్తుందని శ్రీ గడ్కరీ చెప్పారు. ఢిల్లీ-కోల్‌కతా జీటీ రోడ్డు గుండా బీహార్‌లోని కైమూర్ జిల్లా. సైద్‌పూర్ నుండి మర్దా రహదారి నిర్మాణంతో మౌ నుండి సైద్‌పూర్ మీదుగా వారణాసికి నేరుగా కనెక్టివిటీ ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలతో మెరుగైన కనెక్టివిటీ కారణంగా రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక స్థితి మెరుగుపడుతుందని, అలాగే అజంగఢ్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు కొత్త కనెక్టివిటీని పొందుతాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా బల్లియా-అరా మధ్య 1500 కోట్ల వ్యయంతో 28 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ స్పర్ రోడ్డు ద్వారా కొత్త కనెక్టివిటీ మార్గాన్ని కూడా శ్రీ గడ్కరీ ప్రకటించారు.
****
(Release ID: 1902961)
Visitor Counter : 109