మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

సమ్మిళిత అభివృద్ధి కోసం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకాలపై అవగాహన కల్పించేందుకు 2023 ఫిబ్రవరి 22, 23 తేదీల్లోఆకాంక్షిత జిల్లాలలో 4000 గ్రామస్థాయి శిబిరాలను నిర్వహించిన పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ

Posted On: 25 FEB 2023 10:56AM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ జాతీయ పశుసంవర్థక మిషన్ (ఎన్ ఎల్ ఎం), రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాల గురించి వివరించారు.

దాణా,  పశుగ్రాసం అభివృద్ధితో సహా గ్రామీణ కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకంలో వ్యవస్థాపకత అభివృద్ధి,జాతి మెరుగుదల ప్రాముఖ్యతను ఎ హెచ్ డి కార్యదర్శి నొక్కి చెప్పారు.

సుస్థిరమైన లాభదాయకమైన రీతిలో పశు ఉత్పాదకతను పెంపొందించడమే డిపార్ట్ మెంట్ ప్రధాన దార్శనికత.

అవగాహన కార్యక్రమంలో  కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న సుమారు 2 లక్షల మంది రైతులు

(శిబిరాల ద్వారా కనెక్ట్ అయిన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల)

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ ఆకాంక్షాత్మక జిల్లాల్లో 4000 గ్రామస్థాయి శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ల నెట్ వర్క్ ద్వారా తమ శాఖకు చెందిన ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఇతర లబ్ధిదారుల ఆధారిత పథకాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ వరుసగా 22.02.2023 23.02.2023 న ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు.

 

ఈ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు స్కీమ్ పోర్టల్ లలో సి ఎస్ సి ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేశారు. కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి వర్చువల్ విధానంలో సుమారు 2 లక్షల మంది రైతులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా శిబిరాల ద్వారా అనుసంధానమైన రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ, జాతీయ పశుసంవర్థక మిషన్ , రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాలు ఇప్పుడు బ్రీడర్ ఫామ్ వ్యవస్థాపకులు, పశుగ్రాస పారిశ్రామికవేత్తల భాగాన్ని కలిగి

ఉన్నాయని చెప్పారు. జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్ ఎల్ ఎం)  గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను సృష్టించడంలో సహాయం చేస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా పశువులు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకం, మేత, పశుగ్రాసం రంగంలో నిరుద్యోగ యువత, పశువుల పెంపకందారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలను కల్పించడంలో సహాయం చేస్తుంది. .

 

(రైతులతో మాట్లాడుతున్న పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్)

 

పశుసంవర్ధక, పాడిపరిశ్రమ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ రైతులతో ముఖాముఖి సందర్భంగా, ఈ పథకాలు గ్రామీణ కోళ్లు, గొర్రెలు, మేకలు,

పందుల పెంపకం అభివృద్ధితో పాటు దాణా, పశుగ్రాసం అభివృద్ధిపై దృష్టి పెడతాయని చెప్పారు. పౌల్ట్రీ ఉత్పాదకత, పాలు , మాంసం ఉత్పత్తిని పెంచడానికి, పోషకాహార భద్రత, ఉపాధి కల్పన, దేశానికి ఆర్థిక శ్రేయస్సును సాధించడానికి ప్రభుత్వం వివిధ పథకాలు / కార్యక్రమాలను అమలు చేస్తోంది. సుస్థిరమైన ,లాభదాయకమైన రీతిలో పశుసంపద ఉత్పాదకతను పెంపొందించడంలో ఈ రంగం పై  డిపార్ట్ మెంట్ విస్తృత దార్శనికత,  సంబంధం కలిగి ఉంటుంది. పథకాల ప్రభావం, విజయాన్ని ప్రజెంటేషన్ లు, వీడియోల సాయంతో వివరించారు.

 

***



(Release ID: 1902342) Visitor Counter : 217