వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కృత్రిమ వజ్రాల (ల్యాబ్ గ్రోన్ వజ్రాల (ఎల్ జీడీ)) యంత్రాలు, విత్తనాలు, దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఐఐటీ మద్రాస్ కు ఐదేళ్ల రీసెర్చ్ గ్రాంట్ ఐఐటీ మద్రాస్‌లో ఐదేళ్లలో రూ.242.96 కోట్ల అంచనా వ్యయంతో ఇండియా సెంటర్ లియాబ్ గ్రోత్ డైమండ్ (ఇన్సెంట్- ఎల్ జీడీ ) ఏర్పాటుకు ప్రతిపాదన

Posted On: 23 FEB 2023 4:04PM by PIB Hyderabad
దేశంలో కృత్రిమ వజ్రాల (ల్యాబ్ గ్రోన్   వజ్రాల (ఎల్ జీడీ)) యంత్రాలు, విత్తనాలు, ఉత్పత్తిని ప్రోత్సహించడానికి దేశంలో పనిచేస్తున్న  ఇండియన్ ఇన్‌గ్రేడ్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఒకదానికి ఐదేళ్ల రీసెర్చ్ గ్రాంట్‌ను అందించడానికి కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రతిపాదించారు. 
ప్రభుత్వ, ఎగుమతి ప్రోత్సాహక మండలి, పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా   ఏర్పాటైన సంయుక్త కమిటీ ఈ ప్రాజెక్టును ఐఐటీ మద్రాస్‌కు కేటాయించాలని నిర్ణయించింది. అమలు చేయడానికి ఐఐటీ మద్రాస్ లో 242.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెంటర్ ల్యాబ్ గ్రోత్ డైమండ్ (ఇన్ సెంట్-ఎల్ జీడీ)ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
వాణిజ్య కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్ అధ్యక్షతన ఏర్పాటైన సంయుక్త కమిటీ ప్రాజెక్టును అధ్యయనం చేసి అందించిన ప్రతిపాదనను  వాణిజ్య మరియు పరిశ్రమలు , జౌళి, ఆహారం మరియు ప్రజా పంపిణీ పంపిణీ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆమోదించారు. ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన నిధులు వచ్చే అయిదేళ్ల కాలంలో విడుదల అవుతాయి. 
పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు సాంకేతిక సహకారం అందించడం దేశంలో  అధిక  పీడనం ఉష్ణోగ్రత (హెచ్‌పి హెచ్‌టి), రసాయన ఆవిరి నిక్షేపణ ( సివిడి ) విధానంలో కృత్రిమ వజ్రాల (ఎల్‌జీడీ) ఉత్పత్తి , ఉత్పత్తికి అవసరమైన విత్తనాలు, ఇతర సహకారం అందించడం, అంకుర సంస్థలకు  సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం అందుబాటులోకి తీసుకొచ్చి ఎల్ జీడీ రంగాన్ని అభివృద్ధి చేయడం,  ఉపాధి అవకాశాలను పెంచడం, ఎల్ జీడీ ఎగుమతులను పెంచడం లక్ష్యంగా ప్రాజెక్టు అమలు జరుగుతుంది. దీనివల్ల భారతదేశ ఆర్థిక రంగం మరింత అభివృద్ధి సాధిస్తుంది. 
భారత ఆర్థిక వ్యవస్థలో రత్నాలు , ఆభరణాల రంగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. భారతదేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో  రత్నాలు ,  ఆభరణాలు వాటా 9% వరకు ఉంది.గత  దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా రత్నాలు , ఆభరణాల  రంగంలో అనేక సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక సహకారంతో   ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే వజ్రాల ( ఎల్జిడి ) రంగానికి ప్రాధాన్యత పెరిగింది.   
ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే  వజ్రాలను  ఆభరణాల తయారీ పరిశ్రమలతో పాటు, కంప్యూటర్ చిప్‌లు, ఉపగ్రహాలు, 5 జి నెట్‌వర్క్‌లో ఉపయోగిస్తున్నారు. సిలికాన్ ఆధారిత చిప్స్ కంటే తక్కువ శక్తిని ఉపయోగిస్తూ అధిక వేగంతో పనిచేసే వాయువు ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే వజ్రాలు ఉంటాయి. తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తూ ఎక్కువ వేగంగా పనిచేసే ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే  వజ్రాలను   క్లిష్ట వాతావరణంలో ఉపయోగిస్తున్నారు. రక్షణ,ఆప్టిక్స్,ఆభరణాలు, థర్మల్, రంగాల్లో ఎల్ జీడీ వినియోగం ఎక్కువగా ఉంది.  
 
   ప్రపంచవ్యాప్తంగా 2020లో 1 బిలియన్ డాలర్లుగా ఉన్న వజ్రాభరణాల మార్కెట్ 2025 నాటికి 5 బిలియన్ డాలర్లు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

గత 5 సంవత్సరములతో పోల్చి చూస్తే   ప్రస్తుత సంవత్సరంలో కట్   పాలిష్డ్ (పని చేసిన) ప్రయోగశాలలో పండించిన వజ్రాల ఎగుమతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

ఉన్నాయి:

 

(విలువలు US$ మిలియన్)

సరుకు

2017-18

2018-19

2019-20

2020-21

2021-22

2022-23 (ఏప్రి-డిసెంబర్ 2022)

కట్  పాలిష్ (పని) ల్యాబ్ పెరిగిన వజ్రాలు*

237.89

274.75

473.65

637.97

1,348.24

1,387.33

మూలం: డీజీసిఐఎస్  

హై ప్రెజర్ హై టెంపరేచర్ (హెచ్ పిహెచ్ టి) మరియు కెమికల్ వేపర్ డిపాజిషన్ (సీవీడి) అనే 2 సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కృత్రిమ వజ్రాల ఉత్పత్తి జరుగుతుంది. సీవీడి వజ్రాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది.  పరిశ్రమ అంచనాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం వాటా 25.8. హా ఉంది. అయితే సింథటిక్ వజ్రాల తయారీకి అవసరమైన ముఖ్యమైన యంత్ర భాగాలు,   ముడిసరుకు అయిన  'విత్తనాలు' సరఫరా కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. 

సహజ వజ్రాల రంగం తరహాలో కృత్రిమ వజ్రాల రంగంలో యంత్రాలు, ఇతర పరికరాల అవసరాల కోసం విదేశాలపై ఆధారపడకుండా దిగుమతులు తగ్గించడానికి భారతదేశం తన స్వంత, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యతతో ప్రమాణాల మేరకు ఉత్పత్తి చేసి నాణ్యత గుర్తింపు పొందిన కృత్రిమ వజ్రాలకు విదేశాల్లో ఎక్కువ గిరాకీ ఉంటుంది. ప్రమాణాల మేరకు ఉత్పత్తి అయ్యే వజ్రాలను ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. 

ప్రమాణాలు నిర్ణయించి, విత్తనాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవడం ద్వారా  వజ్రాల వ్యాపారం లోకి ప్రవేశించడానికి కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం లభిస్తుంది. సులభంగా వ్యాపా రాన్ని ప్రారంభించి  తక్కువ ఖర్చుతో ఉపాధి అవకాశాలు ఎక్కువ చేయడానికి ప్రభుత్వ నిర్ణయం సహకరిస్తుంది. 

 

***



(Release ID: 1901873) Visitor Counter : 188