సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సంస్కృతిపై తొలి జి20 వర్కింగ్ గ్రూప్ సమావేశపు (సిడబ్ల్యుజి) ప్రారంభ సెషన్ మధ్యప్రదేశ్, ఖజురాహోలోని మహారాజ్ ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ (ఎంసిసిసి)లో గురువారం ప్రారంభం
నిలకడైన, సమ్మిళిత అభివృద్ధి పథాలను సృష్టించేందుకు మన దేశాలు, సమాజాల మధ్య బంధాలను ఏర్పరచే వేదిక సంస్కృతిః డాక్టర్ వీరేంద్ర కుమార్
జి20లో సంస్కృతిపై వర్కింగ్ గ్రూప్ దేశాల మధ్య వారధిగా ఉంటుండటమే కాక, ఈ బృందం మానవ కృషిని, మానవతను సాంస్కృతిక దృష్టికోణం నుంచి చూస్తుందిః శ్రీమతి మీనాక్షీ లేఖి
Posted On:
23 FEB 2023 2:14PM by PIB Hyderabad
సంస్కృతిపై తొలి జి20 వర్కింగ్ గ్రూప్ సమావేశపు (సిడబ్ల్యుజి) ప్రారంభ సెషన్ గురువారం మధ్యప్రదేశ్, ఖజురాహోలోని మహారాజ్ ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ (ఎంసిసిసి)లో ప్రారంభమైంది. ఈ సెషన్‌ను ఉద్దేశించి సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షీ లేఖీ ప్రసంగించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిలకడైన, సమ్మిళిత పథాన్ని సృష్టించేందుకు మన దేశాలు, సమాజాల మధ్య బంధాలను ఏర్పరిచేందుకు సంస్కృతి ఒక వేదిక అని డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. జి20 ఎజెండాలో సంస్కృతిని సమగ్ర అంశంగా పొందుపరచడం అనేది ఒక కీలక విజయమని, ఆర్థిక వృద్ధి, సామాజిక ఐక్యత, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు సంస్కృతి ఒక బలమైన పరికరం కాగలదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్ళను పరిష్కరించేందుకు అత్యంత అవవసరమైన అంతర్ సాంస్కృతిక అవగాహనను, సహకారాన్ని పెంపొందించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని అన్నారు.
నిలకడైన జీవన ప్రచారం కోసం కల్చర్ ఫర్ లైఫ్ (జీవితం కోసం సంస్కృతి) అన్న భావనపై భారత్ జి20 సాంస్కృతిక విధానాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ భావన నీటి నిర్వహణ, నీటి పరిరక్షణ, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల వంటి సుసంపన్నమైన భారత సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన నిలకడైన జీవన విధానాలను ప్రోత్సహించాలని భావిస్తోంది. వసుధైక కుటుంబకం - ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న 2023 జి20 ఇతివృత్తం ప్రపంచవ్యాప్తంగా న్యాయమైన, బాధ్యతాయుతమైన, సంపూర్ణమైన, నిలకడైన అభివృద్ధి కోసం కృషి అనే గంభీరమైన సందేశాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి వివరించారు.
జి20లో సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ అన్నది దేశాల మధ్య వారధిగా పని చేయడమే కాక, సంస్కృతి మనందరినీ అనుసంధానం చేస్తుంది కనుక మానవ కృషిని, మానవతను సాంస్కృతిక కోణం నుంచి చూస్తుందని తన ప్రసంగంలో శ్రీమతి మీనాక్షీ లేఖీ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో, జెండర్ హక్కులు, మహిళల సమానవత్వంపై ఉద్ఘటిస్తున్నారని, కానీ హరప్పా కాలానికి చెందిన డాన్సింగ్ గర్ల్ (నాట్యం చేస్తున్న యువతి) కాంశ్య విగ్రహం ఈ జెండర్ సమానత్వం అంటే ఏమిటనే విషయాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుందని అన్నారు. అంటే, మన దేశంలో కొన్ని వేల ఏళ్ళకిందటే జెండర్ సమానత్వం అనేది ఉందని, మహిళలకు గుర్తింపు, దేవతలుగా, శక్తి రూపాలుగా కొలవడం అనేది ఉందని మంత్రి వివరించారు. భారతీయ సంస్కృతిని మరింత లోతుగా వివరిస్తూ, నేడు ప్రపంచం ఎదుట సవాళ్ళుగా నిలిచిన మహిళల సమానత్వానికి, పర్యావరణ పరిరక్షణ, నిలకడకు భారతీయ ఆచారవిచారాలు ఎప్పుడూ అండగా ఉన్నాయని చెప్పారు.
నిధుల తరలింపు మార్గంలో గల ప్రతిబంధకాలపై జి20 వర్కింగ్ గ్రూప్ చర్చించాలని శ్రీమతి మీనాక్షీ లేఖీ అన్నారు. ఈ నిధులు మానవ నిధులని, ఇవి ఆర్థిక దృష్టికోణం నుంచి మాత్రమే కాక దేశ సాంస్కృతిక ఆచారవ్యవహారాలకు అనుసంధానమైన ఈ నిధులు కీలకమని అన్నారు. అందుకు అనుగుణంగానే, .ఇ20 దేశాలు చర్చలకు అతీతంగా ముందుకు వెళ్ళి, ఒక దేశం నుంచి తీసుకువెళ్ళిన పురాతన వస్తువులను ఆ దేశానికి అప్పగించేందుకు మార్గాన్ని సుగమం చేసే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందన్నారు.
కోవిడ్ సమయంలో సాంస్కృతిక మార్గాలు అన్నీ మూసుకుపోవడంతో సాంస్కృతిక రంగం సవాళ్ళను ఎదుర్కొందని సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ పేర్కొన్నారు. పర్యావవరణ మార్పు ఈ రంగాన్ని మరింత బలహీనం చేయడం వల్ల, మన ఉమ్మడి వారసత్వాన్ని పరరక్షించేందుకు అందరూ కలసిన పని చేయడం అత్యావశ్యమని అన్నారు. సంస్కృతి అనేది ప్రధానంగా బలహీన రంగాన్ని కలుపుకుపోయేందుకు ఒక గొప్ప సాధనంగా పని చేస్తుందని, జీ20లో ఈ అంశాన్ని చేర్చడం అన్నది ఈ రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను ఎదుర్కొనడానికి ఎంతగానో తోడ్పడుతుందని కార్యదర్శి ఉద్ఘాటించారు.
భారత దేశానికి విజయవంతంగా తీసుకువచ్చిన సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఆస్తులలో ఎంపిక చేసిన సాంస్కృతిక ఆస్తుల ద్వారా రీ (అడ్)డ్రెస్ః రిటర్న్ ఆఫ్ ట్రజర్స్ అన్న ప్రదర్శనను సాంస్కృతిక ఆస్తులను తిరిగి తెచ్చుకునేందుకు స్ఫూర్తి, అవసరం, భవిష్యత్తు పై 22 ఫిబ్రవరిన మధ్యప్రదేశ్ , ఖజురాహోలోని మహారాజా ఛత్రశాల కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభించారు. హోలోగ్రామ్ సహా అత్యాధునిక సాంకేతిక తోడ్పాటుతో, ప్రాచీన నిధులను తిరిగి తీసుకురావడంలో ఎదురయ్యే వివిధ అంశాలను, సవాళ్ళను పట్టి చూపారు. ఈ ప్రదర్శనలో వరాహ, డాన్సింగ్ గణేష అమీన్ పిల్లర్, టెర్రకోటా యక్ష, ఆంత్రోమార్ఫిక్ ఫిగర్, ఖజురాహోకు చెందిన పారెట్ లేడీ సహా 26 అమూల్యమైన వస్తువులను భౌతికంగా ప్రదర్శించారు.
సంస్కృతిపై తొలి జి20 వర్కింగ్ గ్రూప్ (సిడబ్ల్యుజి)లో నాలుగు వర్కింగ్ గ్రూపు సెషన్లు ఉంటాయి. ఇందులో జి20 సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పాటు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు పాలుపంచుకుంటారు. ఫిబ్రవరి 25 వరకు జరుగనున్న ఈ సమావేశ కాలంలో ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ సాంస్కృతిక ప్రదర్శనలు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
***
(Release ID: 1901755)
Visitor Counter : 196