మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని హజీరా రేవు నుంచి సాగర్ పరిక్రమ ఫేజ్-3 ని ప్రారంభించిన శ్రీ పురుషోత్తం రూపాల

Posted On: 19 FEB 2023 5:16PM by PIB Hyderabad

1. బాధ్యతాయుతమైన చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, సముద్ర పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ,  మత్స్యకారులు, సంబంధిత వర్గాల సంక్షేమం కోసం  ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్య సంబంధిత పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని వ్యాప్తి చేయడం ప్రధాన లక్ష్యంగా  సాగర్ పరిక్రమ అమలు 
2. దేశ ఆహార భద్రత కోసం సముద్ర మత్స్య వనరుల సక్రమ  వినియోగం, మత్సకారులకు జీవనోపాధి కల్పించి,  సముద్ర పర్యావరణ వ్యవస్థ రక్షణ, మత్స్యకారుల మధ్య తారతమ్యాలు పరిష్కరించడానికి సాగర్ పరిక్రమ కార్యక్రమం అమలు 

3.సాగర్ పరిక్రమ కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర  మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహా పలు శాఖలు, సంస్థలు 

4. తీర ప్రాంతాల సమస్యలు, మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడానికి మత్స్యకారులు, చేపల పెంపకందారులతో నేరుగా సంప్రదింపులు జరిపే విధంగా ప్రభుత్వం రూపొందించిన  దీర్ఘకాలిక విధాన వ్యూహాన్ని ప్రతిబింబించే విధంగా సాగర్ పరిక్రమ కార్యక్రమం 

... ,

 సాగర్ పరిక్రమ ఫేజ్-3 ను గుజరాత్ లోని హజీరా పోర్టు నుంచి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ఈరోజు  ప్రారంభించారు.హజీరాలో ప్రారంభమైన కార్యక్రమం మహారాష్ట్ర తీర ప్రాంతాలు అయిన   సత్పతి, వసాయి, వెర్సోవా మీదుగా సాగి  ముంబైలోని సాజన్ డాక్ వద్ద ముగుస్తుంది.

కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, గుజరాత్ ప్రభుత్వ మత్స్యశాఖ, మహారాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖ కమిషనర్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, గుజరాత్ మారిటైమ్ బోర్డు, మత్స్యకారుల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్, కార్యదర్శి,  కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, గుజరాత్ ప్రభుత్వ మత్స్యశాఖ, మహారాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖ కమిషనర్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్  అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యశాఖ ప్రతినిధులు, చేపల పెంపకం దారులు, పారిశ్రామికవేత్తలు, భాగస్వాములు, వృత్తి నిపుణులు, అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు   సాగర్ పరిక్రమ కార్యక్రమంలో పాల్గొంటారు. 
(1) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్య సంబంధిత వివిధ పథకాలు, కార్యక్రమాల వివరాలను  మత్స్యకారులు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, సంబంధిత వర్గాలకు అవగాహన కల్పించి ప్రచారం చేయడం,   (2) ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిగా మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, సంబంధిత భాగస్వాములం దరికీ సంఘీభావం తెలపడం (iii) దేశ ఆహార భద్రత కోసం సముద్ర మత్స్య వనరుల వినియోగం, మత్స్యకారులకు జీవనోపాధి కల్పించే అంశాల మధ్య సమతుల్యత సాధించడం  (4) సముద్ర పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ   బాధ్యతాయుతమైన చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా 

'సాగర్ పరిక్రమ' అమలు జరుగుతుంది. గుజరాత్ రాష్ట్రంలో   'సాగర్ పరిక్రమ'   మొదటి దశ కార్యక్రమం అమలు జరిగింది.  2022 మార్చి 5 న మాండ్వి లో ప్రారంభమైన 'సాగర్ పరిక్రమ'  2022 మార్చి 6న  పోర్బందర్ లో ముగిసింది.సాగర్ పరిక్రమ రెండో దశ  2022 సెప్టెంబర్ 22న మంగ్రోల్ లో ప్రారంభమై  వెరావల్ వరకు సాగింది. 2022  సెప్టెంబర్  23 న  ముల్ ద్వారకా వద్ద ముగిసింది. 'సాగర్ పరిక్రమ'  మూడవ దశ కార్యక్రమం ఈ రోజు అంటే 19 ఫిబ్రవరి 2023 న గుజరాత్లోని సూరత్ లో ప్రారంభమయ్యింది. 2023 ఫిబ్రవరి 21 న ముంబైలో సాజన్ డాక్ వద్ద ముగుస్తుంది.

 దేశ ఆహార భద్రత కోసం సముద్ర మత్స్య వనరుల సక్రమ  వినియోగం, మత్సకారులకు జీవనోపాధి కల్పించి,  సముద్ర పర్యావరణ వ్యవస్థ రక్షణ, మత్స్యకారుల మధ్య తారతమ్యాలు పరిష్కరించడానికి సాగర్ పరిక్రమ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. మత్సకారుల మధ్య అంతరాలను నివారించడానికి, మత్స్యకారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి సాగుతున్న కృషి, మత్స్యకార గ్రామాల అభివృద్ధి,  పర్యావరణ వ్యవస్థ ద్వారా సుస్థిర  బాధ్యతాయుతమైన అభివృద్ధి సాధించడానికి ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అభివృద్ధి చేసే అంశాలు 'సాగర్ పరిక్రమ' దృష్టి పెడుతుంది.

గుజరాత్, డయ్యూ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్, లక్ష దీవుల నుంచి ముందుగా నిర్ణయించిన సముద్ర మార్గం ద్వారా అన్ని కోస్తా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో సాగర్ పరిక్రమ కింద కార్యక్రమాలు నిర్వహిస్తారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని  గ్రామీణ ప్రాంతాల్లోని మత్స్యకారుల అభివృద్ధి, మత్స్యకారుల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను  మెరుగుపరచడానికి, మరికొన్ని జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి 'సాగర్ పరిక్రమ' ద్వారా  సమగ్ర విధానానికి రూపకల్పన చేస్తారు.


సాగర్ పరిక్రమ ఫేజ్-3 పై ఈ రోజు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల నిర్వహించిన విలేకరుల సమావేశంలో  మత్స్యకార నాయకులు శ్రీ వెల్జీభాయ్ మాసాని, మాజీ ఎమ్మెల్యే శ్రీ భరత్ భాయ్ పాండి,   రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.  ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సి.సువర్ణ , కేంద్ర మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి   శ్రీ. సాగర్ మెహ్రా, గుజరాత్ ప్రభుత్వ డైరెక్టర్ శ్రీ ఐఏఎస్ నితిన్ సంగ్వాన్. కూడా పాల్గొన్నారు.

మత్స్య రంగంలో సాధించిన ప్రగతిని, మత్స్యకారుల అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను  శ్రీ పురుషోత్తం రూపాల తెలిపారు. దేశంలోని మొత్తం సముద్ర చేపల ఉత్పత్తిలో 16.67 శాతం భాగస్వామ్యంతో గుజరాత్ సముద్ర చేపల ఉత్పత్తిలో అగ్రగామి గా ఉందన్నారు. సముద్ర చేపల ఉత్పత్తిలో  భారతదేశం లో ఆరో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో  4.33 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతున్నదని శ్రీ రూపాల వివరించారు.  2021 లో భారతదేశంలో  3.71 మిలియన్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అయ్యిందన్నారు.  సాగర్ పరిక్రమ వంటి కార్యక్రమాల ద్వారా మత్స్యకారులకు అవగాహన కల్పించి  చిన్న తరహా మత్స్యకారులు వారి ప్రయోజనాలకు తగిన ప్రాముఖ్యతతో సుస్థిర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కరపత్రాల పంపిణీ, ప్రాంతీయ భాషల్లో అవగాహన ప్రచారం నిర్వహించడం, వార్తాపత్రిక కథనాలు, ప్రకటనలు వంటి సామూహిక, వ్యక్తిగత విస్తరణ కార్యక్రమాలు నిర్వహించి  మత్స్యకారులు,చేపల పెంపకందారులకు  కెసిసి సౌకర్యాలు అందించడానికి మత్స్యశాఖ కృషి చేస్తుందన్నారు. 

తీరప్రాంత సమస్యలు, మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు మత్స్యకారులు, చేపల పెంపకందారులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టితో కూడిన విధాన వ్యూహాన్ని ప్రతిబింబించే కార్యక్రమం సాగర్ పరిక్రమ. మొదటి మరియు రెండవ దశ కార్యక్రమాలతో  కృత్రిమ దిబ్బలు, సముద్రంలో చేపల పెంపకం లాంటి  అనేక ఇతర అసంఖ్యాక ప్రయోజనాలు కలిగాయి. 

 

***


(Release ID: 1900678) Visitor Counter : 200