ఆర్థిక మంత్రిత్వ శాఖ
బెంగళూరులో ఫిబ్రవరి 22 నుంచి 25 తేదీల వరకు తొలి జి20 ఆర్థికమంత్రులు & కేంద్ర బ్యాంకు గవర్నర్లు, 2వ జి20 విత్త & కేంద్ర బ్యాంకు డిప్యూటీల సమావేశాలు
Posted On:
19 FEB 2023 2:21PM by PIB Hyderabad
భారత అధ్యక్షతన జరుగుతున్న జీ 20 సమావశాలలో తొలి ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్లు (ఎఫ్ఎంసిబిజి) సమావేశం 24-25 ఫిబ్రవరి, 2023లో కర్ణాటకలోని బెంగుళూరులో జరుగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ డాక్టర్ శితికంఠదాస్ ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు.
జి20 ఎఫ్ఎంసిబిజి సమావేశానికి ముందుగా జి20 ఆర్థిక, కేంద్ర బ్యాంక్ డిప్యూటీల (ఎఫ్‌సిబిడి) సమావేశం 22 ఫిబ్రవరి, 2023న జరుగనుంది. ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్, ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైకెల్ డి. పాత్రా కలిసి అధ్యక్షత వహిస్తారు.
జి20 ఎఫ్‌సిబిడి సమావేశాన్ని కేంద్ర సమాచార & ప్రసార, యువ వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రారంభిస్తారు.
భారత అధ్యక్షతన జి 20 సమావేశాలలో తొలి జి20 ఎఫ్ఎంసిబిజి సమావేశంలో జి 20 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్లు, ఆహ్వానిత సభ్యులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాలుపంచుకుంటారు. ఈ సమావేశానికి మొత్తం 72మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
కొన్ని కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు అర్థవంతమైన, ఆచరణాత్మక విధానాలపై మంత్రులు, గవర్నర్ల మధ్య సార్ధకమైన ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించే విధంగా భారత్ అధ్యక్ష హోదాలో సమావేశ అజెండాను రూపొందించింది.
ఫిబ్రవరి 24-25వ తేదీలలో జరుగనున్న ఈ సమావేశం, 21వ శతాబ్దంలో ప్రపంచమంతా సమానంగా ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించేందుకు మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంకులను బలోపేతం చేయడం, బలమైన, సమ్మిళిత, నిలకడైన రేపటి నగరాలకు ఆర్థిక మద్దతు, సమ్మిళిత ఆర్థిక మద్దతు, ఉత్పాదక లాభాలను మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ)ను ఉపయోగించుకోవడం వంటి అంశాలను కవర్ చేస్తూ మూడు సెషన్లలో జరుగనున్నాయి. ఈ సెషన్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆరోగ్యం, అంతర్జాతీయ పన్నులకు సంబంధించిన సమస్యలను కూడా కవర్ చేస్తాయి.
జి20 ఎఫ్ఎంసిబిజి సమావేశంలో జరుగనున్న చర్చలు 2023లో జి 20 విత్త మార్గానికి వివిధ పని ప్రవాహాల పై స్పష్టమైన ఆదేశానికి అందించేందుకు ఉద్దేశించబడ్డాయి.
ఈ సమావేశాల నేపథ్యంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్రిప్టో ఆస్తుల పై విధాన దృక్పధాలు, సీమాంతర చెల్లింపులలో జాతీయ చెల్లింపు వ్యవస్థల పాత్రపై సందర్శించే మంత్రులు, గవర్నర్లు, డిప్యూటీలు, ఇతర ప్రతినిధుల కోసం అనేక ఉప కార్యక్రమాలను రూపొందించారు.
భారతీయ వైవిధ్యభరితమైన వంటకాలను, సంస్కృతిని ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్లు, వారి ప్రతినిధి బృందాలకు ప్రదర్శించేందుకు రాత్రి భోజ్ పర్ సంవాద్, ప్రత్యేకంగా రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.
జి20 సభ్య దేశాలు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ళకు అందుబాటులో, కొలవదగ్గ పరిష్కారపై పని చేస్తున్న సాంకేతిక ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులతో ముచ్చటించేందుకు మంత్రులు, గవర్నర్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్)ను సందర్శించేందుకు వాక్ ది టాక్ః పాలసీ ఇన్ యాక్షన్ (చెప్పింది ఆచరించుః ఆచరణలో విధానం) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు.
మంత్రులు, గవర్నర్, డిప్యూటీలు, ప్రతినిధి బృందాలను ఆహ్వానించేందుకు లోతైన సాంస్కృతిక మూలాలను కలిగి, వివిధ కళలు, చేతివృత్తులతో వైవిధ్య భరితమైన కళాత్మక వారసత్వాన్ని కర్ణాటక వ్యాప్తంగా భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక ఒడిస్సీని ప్రదర్శించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలు కర్ణాటక సాంస్కృతిక పద్ధతులు, వారసత్వ కళాత్మక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.
ఫిబ్రవరి 26న కర్ణాటకలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను ప్రతినిధులు ఆస్వాదించే అవకాశాన్ని కల్పించేందుకు వారికి విహార యాత్రలలో ఎంపికలు అందిస్తున్నారు.
***
(Release ID: 1900613)
Visitor Counter : 292