వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
3వ ఇ-వేలంలో దేశ్యాప్తంగా ఉన్న 620 డిపోల ద్వారా 11.72 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను అందిస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
22.02.2023 ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఎఫ్ సిఐ 3 వేలం
Posted On:
18 FEB 2023 10:32AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 620 డిపోల ద్వారా 11.72 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను 3వ ఇ-వేలంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులో ఉంచుతోంది.
ఈ 3వ ఆ-వేలంలో ఎం జంక్షన్ ఇ పోర్టల్‌పై 17.02.2023 రాత్రి 10 గంటలవరకు నమోదు చేసుకున్న బిడ్డర్లను 22.02. 2023న జరుగనున్న ఇ-వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. డిపాజిట్ చేసేందుకు, ఇఎండిని అప్‌లోడ్ చేసేందుకు 21.02.2023న మధ్యాహ్నం 2.30 గంటలవరకు గడువు ఉంది.
ఓఎంఎస్ఎస్ (డి) పథకం కింద దేశవ్యాప్తంగా గోధుమల రిజర్వు ధరను భారత ప్రభుత్వం సవిరించింది. ప్రస్తుతం ఎఫ్ఎక్యూ గోధుమల సంచిత ధర క్వింటాలు రూ. 2150, యుఆర్ఎస్ గోధుమ ధర క్వింటాలు రూ. 2125గా ఉంటుంది. ఈ ధరలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరలను మరింతగా తగ్గించి, ఏకీకృత రిజర్వు ధరలతో గోధుమలు అందుబాటులో ఉంచేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన రిజర్వు ధరలు ఇ-వేలం ద్వారా గోధుమల మూడవ అమ్మకాలకు వర్తిస్తాయి. ఈ వేలాన్ని దేశవ్యాప్తంగా 22 ఫిబ్రవరి 2023, బుధవారం నాడు నిర్వహిస్తారు.
దేశంలో పెరుగుతున్న గోధుమ, గోదుమ పిండి ధరల సమస్యను మంత్రుల బృందం సూచన మేరకు పరిష్కరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర నిల్వల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ నిల్వలను ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (డొమెస్టిక్) కింద వివిధ మార్గాల ద్వారా మార్కెట్ లోకి విడుదల చేస్తోంది.
మొదటి, రెండవ ఇ-వేలం సందర్భంగా మొత్తం 12.98 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను విక్రయించగా, ఇందులో 8.96 ఎల్ఎంటిలను బిడ్డర్లు సేకరించిన ఫలితంగా గోధుమల, గోధుమ పిండి ధరలు తగ్గాయి.
దేశవ్యాప్తంగా ఏకీకృత రిజర్వు ధరలను భారత ప్రభుత్వం ప్రకటించడం అన్నది గోధుమలు, గోధుమ పిండి ధరలను కిందకు తెచ్చి వినియోగదారులకు లబ్ధి చేకూర్చనున్నది.
***
(Release ID: 1900523)
Visitor Counter : 171