వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ
సరసమైన ధర దుకాణాల డీలర్లు అదనపు కమ్యూనిటీ సేవలను అందించడం ద్వారా రూ.50,000 సంపాదనకు అవకాశం : కేంద్రప్రభుత్వం
కమ్యూనిటీ సేవలను అందించే బోర్డులో 40,000 సరస ధరల దుకాణాల డీలర్లు లు
75 నమూనా దుకాణాలు, టాయిలెట్, తాగునీరు, నిఘా కెమెరాలు ఇతర సౌకర్యాలను తెరవాలి: ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి
ఐఐటి ఢిల్లీ, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రవాణా ఖర్చును తగ్గించడానికి సులభ రవాణా నిర్వహణ కోసం నిమగ్నమై ఉన్నాయి
Posted On:
16 FEB 2023 5:23PM by PIB Hyderabad
దేశంలోని దాదాపు 40,000 సరసమైన ధరల దుకాణాలు (FPS) డీలర్లు ఇతర సేవలను అందిస్తూ రూ. 50,000 ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని ఆహార, ప్రజా పంపిణీ శాఖ (DFPD) కార్యదర్శి సంజీవ్ చోప్రా 'ది నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫెయిర్ ఆఫ్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్'పై జరిగిన కార్యక్రమంలో తెలిపారు.
ప్రారంభోపన్యాసంలో, సెక్రటరీ, చౌక ధరల దుకాణాలలో అమలు అవుతున్న నూతన సాంకేతిక జోక్యాలను సుస్థిర పరచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు, ఇప్పుడు వాటిని PDS కార్యకలాపాలను అమలు చేయడంతో పాటు మరిన్ని ఉత్పత్తులు సేవలు అందించడం ద్వారా రేషన్ షాపులను శక్తివంతమైన, ఆధునిక, ఆచరణీయ అంగళ్లుగా వాటిని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులు వంటి పిడిఎస్‌యేతర వస్తువులను రేషన్ షాపు డీలర్లు ఉంచుకోవడానికి అనుమతించాలని డిఎఫ్‌పిడి రాష్ట్రాలకు లేఖ రాసింది. చాలా రాష్ట్రాలు వాటిని అనుమతించాయి. లబ్ధిదారులు/రేషన్ కార్డ్ హోల్డర్లు, ముఖ్యంగా ఆహార భద్రత కార్యక్రమం కింద ఉన్న వలస జనాభా, ఇప్పుడు ఆధార్ ప్రామాణీకరణ ద్వారా దేశంలోని ఏదైనా ఎఫ్‌పిఎస్ నుండి ఆహార ధాన్యాలను తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టబిలిటీ వ్యవస్థ లబ్ధిదారునికి సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఆహార, ప్రజా పంపిణీ శాఖ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 3.5 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు జరుగుతున్నాయి.
అదనంగా, ఈ సరసమైన ధరల దుకాణాలకు మార్గాల ఆప్టిమైజేషన్ కోసం ఆహార, ప్రజా పంపిణీ శాఖ, ఐఐటి, ఢిల్లీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ను నిమగ్నం చేసిందని, తద్వారా ఇది రవాణా ఖర్చు తగ్గించి, ఆహార సబ్సిడీపై ఆదా చేస్తుందని ఆయన ప్రముఖంగా చెప్పారు. ఇది సరఫరా గొలుసు వ్యవస్థలను ఆహార, ప్రజా పంపిణీ శాఖలు ఇంటింటి బట్వాడా కింద ఆహార ధాన్యాల తరలింపును కూడా క్రమబద్ధీకరిస్తుంది. అదనపు సేవలు అందించడం ద్వారా రూ. 50,000 సంపాదిస్తున్న గుజరాత్‌లోని డీలర్ల విజయగాథల్లో కొన్నింటిని కూడా ఆయన హైలైట్ చేశారు. చివరగా, ఆహార, ప్రజా పంపిణీ శాఖ ద్వారా పంచుకున్న సూచనాత్మక లక్షణాల ప్రకారం ప్రతి జిల్లాలో 75 మోడల్ FPSలను గుర్తించి అభివృద్ధి చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అభ్యర్థించారు. ఈ మోడల్ షాపుల్లో వెయిటింగ్ స్పేస్‌లు, CCTV కెమెరాలు, టాయిలెట్లు మరియు తాగునీటి సౌకర్యం వంటివి ఉంటాయి.
మైక్రోసేవ్ కన్సల్టింగ్ (MSC) సహకారంతో ఆహార, ప్రజా పంపిణీ శాఖ 15 ఫిబ్రవరి 2023 న చౌక దుకాణాల పరివర్తనపై జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వివిధ సర్వీస్ ప్రొవైడర్‌ల మధ్య ఆలోచనలు అంతర్దృష్టుల మార్పిడికి ఈ సమావేశం ఒక ఉమ్మడి వేదికను అందించింది. దేశవ్యాప్తంగా చౌక దుకాణాల పరివర్తన కార్యకలాపాలను అమలు పరచడానికి దోహదకారిగా ఉంది.
సదస్సుకు డీఎఫ్‌పీడీ కార్యదర్శి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీలు / సెక్రటరీలు/ ఇతర సీనియర్ అధికారులు;కామన్ సర్వీసెస్ సెంటర్స్ (CSCలు), టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్/IPPB, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బీఎంజీఎఫ్),సీనియర్ అధికారులు/నిపుణులు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందున్న కార్యాచరణ మూడు కీలక అంశాల పరిధిలో మార్పుల అవసరాన్ని నొక్కి చెప్పింది -
1. అవగాహన: ప్రతి చౌకడిపో డీలర్‌కి పరివర్తన కింద వారికి అందించే బహుళ సేవా ఆఫర్‌ల గురించి స్పష్టంగా తెలియజేయాలి. దీని కోసం, అందరూ కలిసి పని చేయాలి, ఒకరికొకరు సహకరించాలి. డీలర్‌లను గందరగోళానికి గురిచేసే సమాచారాన్ని అతిగా ప్రసారం కాకుండా చూసుకోవాలి.
2. కెపాసిటీ బిల్డింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: డీలర్‌ల అవసరాలకు అనుగుణంగా సమర్థమైన ప్రత్యేకమైన అమలు నమూనాలను రూపొందించడంలో పని చేయడం, వ్యవస్థాపకత ఆర్థిక సేవలు వారి సామర్థ్యం, నైపుణ్యాలను పెంపొందించడం
3. పెట్టుబడి, రుణ సహాయం : సరసమైన ధరల దుకాణాల్లో (FPSలు) సేవా సమర్పణలు కొనసాగించడానికి అవసరమైన ప్రారంభ మౌలిక సదుపాయాలను మరియు వర్కింగ్ క్యాపిటల్‌ను వేగంగా అభివృద్ధి చేయడానికి అనుమతించడం.
***
(Release ID: 1900429)