వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించిన రెండ‌వ ఇ-వేలంలో రూ. 901 కోట్లకు 3.85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల అమ్మ‌కం


పెరుగుతున్న గోధుమ‌లు, గోధుమ‌పిండి ధ‌ర‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు మార్చి 2023 రెండ‌వ వారం వ‌ర‌కు ప్ర‌తి బుధ‌వారం ఇ-వేలం కొన‌సాగింపు

Posted On: 16 FEB 2023 10:38AM by PIB Hyderabad

ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) 15.02.2023న నిర్వ‌హించిన రెండ‌వ‌ ఇ-వేలంలో 1060మంది బిడ్డ‌ర్లు పాల్గొన‌గా, 3.85 ఎలఎంటిల గోధుమ‌లు విక్ర‌య‌మ‌య్యాయి. వేలం సంద‌ర్భంగా 15.25 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను కార్పొరేష‌న్ విక్ర‌యానికి ఉంచింది.
రెండ‌వ ఇ-వేలం ప‌రిమాణాల‌లో 100 నుంచి 499 మెట్రిక్ టన్నుల వ‌ర‌కు గ‌రిష్ట గిరాకీని క‌లిగి ఉండ‌గా, త‌రువాత 500-1000 మెట్రిక్ ప‌రిమాణాలు, 50-100 మెట్రిక్ ట‌న్నుల ప‌రిమాణాలు ఉండ‌టం చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా పిండి మిల్ల‌ర్లు, వ్యాపారులు వేలంలో చురుకుగా పాల్గొన‌డాన్ని సూచిస్తున్నాయి. ఒకేసారి 3000 మెట్రిక్ ట‌న్నుల గ‌రిష్ట ప‌రిమాణాల కొనుగోలుకు కేవ‌లం 5 బిడ్లు మాత్ర‌మే అందాయి. 
తూకం వేసిన స‌రుకు గ‌రిష్ట రేటు ఒక క్వింటాలుకు రూ. 2338.01 వేలంలో ఎఫ్‌సిఐ పొందింది. రెండ‌వ ఇ-వేలంలో 901 కోట్ల ఆదాయం వ‌చ్చింది. 
దేశంలో పెరుగుతున్న గోధుమ‌, గోదుమ పిండి ధ‌ర‌ల స‌మ‌స్య‌ను మంత్రుల బృందం సూచ‌న మేర‌కు ప‌రిష్క‌రించేందుకు ఎఫ్‌సిఐ గోధుమ‌ల ఇ- వేలం వేస్తోంది. దేశంలో ఇ-వేలం ద్వారా గోధుమ‌ల అమ్మ‌కాలు మార్చి 2023 రెండవ వారం వ‌ర‌కు ప్ర‌తి బుధ‌వారం జ‌రుగ‌నున్నాయి. భార‌త ప్ర‌భుత్వం మూడు ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌ను ప్ర‌భుత్వానికి కేటాయించింది.
ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు/ స‌హ‌కార సంస్థ‌లు, కేంద్రీయ భండార్‌, ఎన్‌సిసిఎఫ్‌, ఎన్ఎఎఫ్ఇడిల‌కు ఇ- వేలం లేకుండా విక్ర‌యించ‌నున్నారు. ఈ ప‌థ‌కం కింద రాయితీ రేట్ల‌ను కేజీ రూ. 23.50 నుంచి  ఇవ్వాల‌ని, గోధుమ పిండిని కిలో రూ. 29.50 ఎంఎస్‌పీకి మించ‌కుండా  అమ్మాల‌న్న నిబంధ‌న‌ను భార‌త ప్ర‌భుత్వం స‌విరించి, గోధుమ‌లు కిలో రూ. 21.50, అటువంటి స్టాకు నుంచి వ‌చ్చిన గోధుమ‌పిండిని కిలోకి రూ. 27.50కి మించ‌కుండా ఎంఎస్‌పికి అమ్మాల‌ని నిర్ణ‌యించింది. 
పైన పేర్కొన్న ప‌థ‌కం కింద నేష‌న‌ల్ కోఆప‌రేటివ్ క‌న్సూమ‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సిసిఎఫ్‌) 68000 మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ను 08 రాష్ట్రాల నుంచి సేక‌రించేందుకు అనుమ‌తించారు. దేశ‌వ్యాప్తంగా గోధుమ‌పిండి ధ‌ర‌ల‌ను కింద‌కు తెచ్చేందుకు ఎన్ఎఎఫ్ఇడి (నాఫెడ్‌)కు 1 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, కేంద్రీయ భండార్‌కు 1.32 ఎల్ఎంటిల‌ను కేటాయించారు. ఈ స‌హ‌కార సంస్థ‌లు ఎఫ్‌సిఐ నుంచి స్టాక్‌ను సేక‌రించిన త‌ర్వాత గోధుమ‌పిండిని విక్ర‌యాల‌ను నిర్వ‌హిస్తాయి. 
ఒఎంఎస్ఎస్‌డి (డి) కింద మార్కెట్‌లో ఒఎంఎస్ఎస్‌డి (డి) కింద విక్ర‌యించేందుకు కేటాయించిన 30 ఎల్ఎంటిలో 25 ఎల్ఎంటిల కంట ఎక్కువ‌గా గోధుమ‌ల‌ను రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో బ‌హుళ మార్గాల ద్వారా అందించ‌డం వ‌ల్ల గోధుమ‌, ద్ర‌వ్యోల్బ‌ణ ధ‌ర‌ల ధోర‌ణిని నియంత్రించ‌డంలో ప్ర‌భావం చూప‌డం ద్వారా,  ఆహ‌ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో స్థిర‌మైన ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు అవ‌కాశ‌మిస్తూ ప‌త‌క ల‌క్ష్య‌మైన సాధార‌ణ పౌరుడికి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుంది. 

***



(Release ID: 1899994) Visitor Counter : 139