ఆర్థిక మంత్రిత్వ శాఖ
11.94 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
- వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు
Posted On:
15 FEB 2023 6:37PM by PIB Hyderabad
ఇంటెలిజెన్స్ నుంచి పక్కాగా అందిన సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ (డీఆర్ఐ) అధికారులు నిన్న హరారే నుండి కెన్యా ఎయిర్‌వేస్ ద్వారా నైరోబీ మీదుగా ముంబయికి వస్తున్న ఒక భారతీయ మహిళా ప్రయాణికురాలిని అడ్డుకున్నారు. ఈ ప్రయాణికురాలి లగేజీని పరిశీలించగా అందులో 11.94 కిలోల క్రీము రంగు కణికలను గమనించి స్వాధీనం చేసుకున్నాయి. వీటిని నార్కోటిక్స్ ఫీల్డ్ టెస్టింగ్ కిట్‌తో పరీక్షించగా అందులోఎన్‌డీపీఎస్ చట్టం, 1985 కింద కవర్ చేయబడిన మాదకద్రవ్యమైన "హెరాయిన్" అనే పదార్ధం ఉన్నట్లు నిర్ధారించబడింది. స్వాధీనం చేసుకున్న ఎన్‌డీపీఎస్ పదార్ధం మొత్తంగా 11.94 కిలోల బరువు ఉంది, దీని విలువ అక్రమ మార్కెట్‌లో సుమారుగా రూ.84 కోట్ల మేర ఉంటుంది. ట్రాలీ బ్యాగ్‌ల లోపల మరియు ఫైల్ ఫోల్డర్‌లలో ఈ పదార్ధం తెలివిగా దాచబడింది. మహిళా ప్రయాణికురాలిని విచారించగా హరారేలో తనకు ఈ డ్రగ్స్ బ్యాగేజీ అందజేశారని, ముంబైలోని ఇద్దరికి డెలివరీ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ విషయం వేగంగా ప్సందించిన డీఆర్ఐ అధికారులు ముంబయి విమానాశ్రయం వెలుపల నిషిద్ధ వస్తువులను స్వీకరించడానికి వచ్చిన గ్రహీతలను గుర్తించి పట్టుకున్నారు. ఎన్.డి.పి.ఎస్ చట్టం- 1985లోని నిబంధనల ప్రకారం ప్రయాణీకురాలు మరియు ఇతర ఇద్దరిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
****
(Release ID: 1899639)
Visitor Counter : 152