మంత్రిమండలి
azadi ka amrit mahotsav

వ్యవసాయ రంగం లో  మరియు సంబంధం గల రంగాలలో సహకారం కోసం భారతదేశం మరియు చిలీ కి మధ్య ఎమ్ఒయు పై సంతాల కు ఆమోదం తెలిపినమంత్రిమండలి

Posted On: 15 FEB 2023 3:52PM by PIB Hyderabad

వ్యవసాయ రంగం లో, దానితో సంబంధం గల రంగాల లో సహకారాని కి గాను భారతదేశ గణతంత్ర ప్రభుత్వం మరియు చిలీ గణతంత్ర ప్రభుత్వాని కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని ఇచ్చింది.

ఈ ఎమ్ఒయు వ్యవసాయ రంగం లోను, దానితో సంబంధం గల రంగాల లోను సహకారాని కి బాట ను వేస్తుంది. సహకారాని కి ఉద్దేశించిన ప్రధాన రంగాల లో ఆధునిక వ్యవసాయం అభివృద్ధి కై అనుసరించవలసిన వ్యావసాయిక విధానాలు, సేంద్రియ ఉత్పత్తుల ద్వైపాక్షిక వ్యాపారాని కి మార్గాన్ని సుగమం చేసే సేంద్రియ వ్యవసాయం లతో పాటుగా ఉభయ దేశాల లో సేంద్రియ ఉత్పత్తి ని అభివృద్ధి పరచేందుకు ఉద్దేశించిన విధానాల ను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రోత్సహించడం, భారతదేశ సంస్థల కు మరియు చిలీ కి చెందిన సంస్థల కు మధ్య వ్యవసాయ రంగం లో నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహించడం కోసం భాగస్వామ్యాల ను నెలకొల్పుకోవడాని కి విజ్ఞాన శాస్త్రాన్ని వినియోగించడం మరియు ఉమ్మడి సవాళ్ళ ను ఎదుర్కోవడాని కి సమన్వయాన్ని ఏర్పరచుకోవడం వంటివి ఉన్నాయి.

 

ఎమ్ఒయు లో భాగం గా, ఒక చిలీ-ఇండియా ఎగ్రీకల్చరల్ వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యాచరణ బృందం ఎమ్ఒయు యొక్క అమలు సంబంధి పర్యవేక్షణ బాధ్యత ను, సమీక్ష బాధ్యత ను మరియు నిర్ధారణ బాధ్యత ను స్వీకరిస్తుంది. దీనికి తోడు తరచు గా (ఉభయ పక్షాల మధ్య) సందేశాల ను ప్రసారం చేస్తూ మరి సమన్వయాని కి కూడాను పూచీ పడుతుంది.

వ్యవసాయ సంబంధి కార్యాచరణ బృందం యొక్క సమావేశాల ను ఏడాది కి ఒకసారి వంతున అటు చిలీ లో, ఇటు భారతదేశం లో నిర్వహించడం జరుగుతుంది. ఎమ్ఒయు తత్సంబంధి పత్రం పైన సంతకాలు కావడం తో అమలు లోకి వచ్చి అయిదు సంవత్సరాల కాలం పాటు వర్తింపు లో ఉంటుంది. ఆ తరువాత దీనిని ఆటోమేటిక్ గా మరొక అయిదు సంవత్సరాల కాలాని కి పునరుద్ధరణ కు పాత్రమవుతుంది.

 

***

 


(Release ID: 1899602) Visitor Counter : 268