ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రికార్డ్‌ స్థాయి క్యూ3 ఉత్పత్తిని సాధించిన ఎన్‌ఎండీసీ

Posted On: 15 FEB 2023 11:23AM by PIB Hyderabad

ప్రభుత్వ రంగం మైనింగ్‌ సంస్థ ఎన్‌ఎండీసీ, ఎఫ్‌వై23 మూడో త్రైమాసికంలో 10.66 మిలియన్ టన్నుల ఉత్పత్తితో అత్యుత్తమ క్యూ3 గణాంకాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.11,816 కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు 14.02.2023న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఎన్‌ఎండీసీ ప్రకటించింది. తొమ్మిది నెలలకు ఈ సంస్థ పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ.4351 కోట్లుగా, ఇదే కాలానికి పన్ను తర్వాతి లాభం (ప్యాట్‌) రూ.3252 కోట్లుగా లెక్క తేలింది.

ఎఫ్‌వై23 మూడో త్రైమాసికంలో, 10.66 మిలియన్ టన్నుల (ఎంఎన్‌టీ) ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ ఉత్పత్తి చేసింది, 9.58 మిలియన్ టన్నులను విక్రయించింది. మొదటి మూడు త్రైమాసికాల్లో మొత్తం ఉత్పత్తి, విక్రయాల గణాంకాలు వరుసగా 26.69 ఎంఎన్‌టీ, 25.81 ఎంఎన్‌టీగా ఉన్నాయి.

ఒక్కో షేరుకు రూ.3.75 మధ్యంతర డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది.

కంపెనీ పనితీరుపై మాట్లాడిన ఎన్‌ఎండీసీ సీఎండీ శ్రీ సుమిత్ దేబ్, "భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధికి ఇనుము & ఉక్కు పరిశ్రమ వెన్నెముక. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని పెంచడంపై దృష్టి సారించడం వల్ల దేశీయ ఉక్కు డిమాండ్‌ బలంగా పెరుగుతుంది. పెరుగుతున్న ఇనుప ఖనిజం ఉత్పత్తి & కంపెనీలతో పెట్టుబడుల సాయంతో, దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి ఎన్‌ఎండీసీ సిద్ధంగా ఉంది. అత్యుత్తమ క్యూ3 ఉత్పత్తి సాధించిన ఎన్‌ఎండీసీ బృందాన్ని అభినందిస్తున్నా" అని చెప్పారు.

 

****



(Release ID: 1899576) Visitor Counter : 166