జౌళి మంత్రిత్వ శాఖ
ప్రభుత్వం, ఎంసీఎక్స్, వాణిజ్యం & పరిశ్రమల సహకారంతో కాటన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో ట్రేడింగ్ ప్రారంభం
प्रविष्टि तिथि:
13 FEB 2023 7:04PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, ఎంసీఎక్స్, వాణిజ్యం & పరిశ్రమల సహకార ధోరణితో కొత్తగా ప్రారంభించబడిన, మరింత ప్రతినిథ్యం కాటన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో ట్రేడింగ్ 13.02.2023 నుండి ప్రారంభమైంది. ఫ్యూచర్స్ ధరలను ఊహాజనితంగా కాకుండా మరింత ప్రాతినిధ్య పరంగా ఉండేలా చేయడానికి, కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్, నాణ్యతా ప్రమాణాలు సవరించబడ్డాయి. కొత్త కాటన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 31 జనవరి 2023న ఎంసీఎక్స్ లో ప్రారంభించబడింది. ఇది వాస్తవ ధరను కనుగొనడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో ప్రతికూల ధరల అస్థిరతతో కూడిన ప్రమాదాన్ని నివారించడానికి పరిశ్రమకు ఒక వేదికను అందిస్తుంది. దీనికి తోడు రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. రైతులు మార్కెట్‌లో తమ ఉత్పత్తులను విక్రయించడానికి నిర్ణయం తీసుకునేటప్పుడు రిఫరెన్స్ ధర అందుబాటులో ఉంటుంది. పత్తి సీజన్ 2021-22లో భారతీయ పత్తి ధరలు గరిష్ట స్థాయిలో పత్తి క్యాండీ ధర 2022 మే నెలలో రూ. 100,000కి చేరింది. అకాల వర్షం, ఊహాజనిత వ్యాపారం, ప్రపంచ వ్యాప్తంగా పత్తి కొరత కారణంగా పత్తి ధరలు ఆకాశాన్నంటాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)పై కాటన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్, స్పెక్యులేషన్ గురించి పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో దేశీయ పత్తి ధరలలో వక్రీకరణ జరిగింది. 14 జూలై 2022న జరిగిన టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్ (ట్యాగ్) 2వ ఇంటరాక్టివ్ సమావేశంలో ఈ విషయం లేవనెత్తబడింది, దీని ఫలితంగా ఈ విషయమై ఎంసీఎక్స్ యొక్క ఉత్పత్తి సలహా కమిటీ తిరిగి ఏర్పాటు చేయబడింది. రైతుల నుండి తుది వినియోగదారుల వరకు టెక్స్‌టైల్ విలువ గొలుసు ప్రాతినిధ్యంతో విస్తరించబడింది ( అంటే స్పిన్నింగ్ మిల్లులు) ఊహాజనిత వర్తకం మరియు పత్తి ధరలలో అస్థిరతను అరికట్టడానికి దేశీయ మార్కెట్ ప్రకారం వ్యవస్థను మరింత నిర్మాణాత్మకంగా చేయడానికి చర్యలు చేపట్టబడినాయి. ఇప్పుడు, భారతీయ పత్తి ధరలు తగిన పోటీగా మరియు ప్రపంచ ధరలకు అనుగుణంగా నిలుస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 1899006)
आगंतुक पटल : 189