వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (IPEF) యొక్క పిల్లర్స్ II-IV కోసం 8-11 ఫిబ్రవరి 2023 వరకు న్యూ ఢిల్లీలో భారతదేశం ప్రత్యేక చర్చల రౌండ్ నిర్వహణ
పరస్పరం లాభదాయకమైన ఫలితాలను ఇచ్చే పంటలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చిన వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి
కెపాసిటీ బిల్డింగ్ వంటి సాధారణ ప్రత్యక్ష ప్రయోజనాలతో పాటూ నైపుణ్యం మరియు ఉత్తమ అభ్యాసాల భాగస్వామ్యంతో సహా సాంకేతిక సహాయం; పెట్టుబడులు, వినూత్న ప్రాజెక్టుల పై దృష్టి పెట్టాలని పిలుపు
Posted On:
13 FEB 2023 3:32PM by PIB Hyderabad
భారతదేశం ఫిబ్రవరి 8-11, 2023 వరకు భారతదేశంలోని న్యూ ఢిల్లీలో ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (IPEF) కోసం ప్రత్యేక చర్చల రౌండ్‌ను నిర్వహించింది. ఈ రౌండ్ IPEF పిల్లర్స్ II (సప్లై చెయిన్‌లు), III (క్లీన్ ఎకానమీ) మరియు IV (ఫెయిర్ ఎకానమీ) విభాగాలను కవర్ చేసింది.
భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజీ, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ మరియు వియత్నాం నుండి సుమారు 300 మంది అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
భారత వాణిజ్య కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్, 8 ఫిబ్రవరి 2023న ప్రత్యేక రౌండ్‌ను సంక్షిప్త ప్రారంభ వేడుకలో మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య IPEF దేశాలకు చెందిన చీఫ్ నెగోషియేటర్లు సాంప్రదాయ దీపాలను వెలిగించడంలో వాణిజ్య కార్యదర్శితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య కార్యదర్శి మాట్లాడుతూ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం గణనీయమైన పాత్ర పోషించడానికి కట్టుబడి ఉందని; అలాగే మరింత స్థిరమైన, సు సంపన్నమైన దేశ భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. విస్తృత లక్ష్యాలపై దృష్టి సారించాలని ప్రతినిధులందరినీ ఆయన ఈ సందర్భంగా కోరారు. వాణిజ్యం మరియు పెట్టుబడి మధ్య బంధాలను పెంపొందించడానికి మరింత అనుకూలమైన వాతావరణాలను సృష్టించడం, స్థితిస్థాపక సరఫరా గొలుసుల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేయడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
10 ఫిబ్రవరి 2023న, కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ IPEF భాగస్వామ్య దేశాలకు చెందిన సందర్శక ప్రతినిధులకు రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ విందులో IPEF భాగస్వామ్య దేశాలకు చెందిన చీఫ్ నెగోషియేటర్లు మరియు వారి ప్రతినిధులు, రాయబారులు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మే 2022లో IPEF ప్రారంభించిన సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, సమావేశాలను అభివృద్ధి చేయడానికి మరియు స్పష్టమైన ఫలితాలను సాధించడానికి సృజనాత్మక మరియు వినూత్న విధానాలతో ముందుకు రావాలని ఈ కార్యక్రమం వేదికగా మంత్రి సభ్యులను ప్రోత్సహించారు. సభ్యులందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఫలితాలను ఇచ్చే కోత పంటల పై శక్తిని కేంద్రీకరించాలని ఆయన సభ్యులను ప్రత్యేకంగా కోరారు. కెపాసిటీ బిల్డింగ్ వంటి కొన్ని సాధారణ ప్రత్యక్ష ప్రయోజనాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు; నైపుణ్యం మరియు ఉత్తమ అభ్యాసాల భాగస్వామ్యంతో సహా సాంకేతిక సహాయం; పెట్టుబడులు, వినూత్న ప్రాజెక్టులు మొదలైనవి ఈ చొరవ నుండి ఆశించడం జరుగుతుందని అన్నారు.
డిసెంబరు 2022లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో మునుపటి రౌండ్‌లో జరిగిన చర్చల ఆధారంగా, న్యూ ఢిల్లీలో మూడు పిల్లర్ లకు సంబంధించిన లోతైన టెక్స్ట్-ఆధారిత చర్చలు జరిగాయి. IPEF భాగస్వాములు ఆలోచనలు మరియు అభిప్రాయాల ఉత్పాదక మార్పిడిలో నిమగ్నమయ్యారు. అలాగే మూడు పిల్లర్ లలో ప్రతిదానిలో మరింత పురోగతి సాధించడానికి రాబోయే కాలంలో మరింత కష్టించి పని చేయడానికి అంగీకరించారు. IPEF భాగస్వాములు తమ తమ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక పోటీతత్వం మరియు శ్రేయస్సు కోసం భాగస్వామ్య దృష్టిని పెంపొందించడానికి కాంక్రీట్ ప్రయోజనాలను కలిగి ఉన్న ఒప్పందాలను త్వరితగతిన ముగించడానికి సహకారాన్ని కొనసాగించడానికి తమ కట్టుబాట్లను పునరుద్ఘాటించారు.
09 ఫిబ్రవరి 2023న స్పెషల్ రౌండ్‌లో భాగంగా జరిగిన స్టేక్‌హోల్డర్స్ సెషన్‌లో మాట్లాడుతూ, భారత ప్రధాన సంధానకర్త శ్రీ రాజేష్ అగర్వాల్, వాణిజ్య విభాగం అదనపు కార్యదర్శి, IPEF ఆర్థిక అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని మరియు అందరినీ కలుపుకుని పోవడాన్ని ప్రోత్సహిస్తుందని భారతదేశ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో వాణిజ్యం మరియు పెట్టుబడి పెంపుదల ద్వారా అభివృద్ధి; మరియు సంబంధిత వాటాదారులందరి అభిప్రాయాలు మరియు ఆలోచనలను కోరింది. IPEF భాగస్వామి అనుబంధం కొనసాగుతుంది అని; అలాగే తదుపరి వ్యక్తిగత చర్చల రౌండ్‌కు సంబంధించిన వివరాలు నిర్ణీత సమయంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
****
(Release ID: 1898957)
Visitor Counter : 222