గనుల మంత్రిత్వ శాఖ

గత ఐదేళ్లలో వేలం ద్వారా 133 ఖనిజ గనులను ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాయి

Posted On: 13 FEB 2023 1:10PM by PIB Hyderabad

సవరించిన 'గనులు & ఖనిజాల (అభివృద్ధి & నియంత్రణ) చట్టం-1957' 12.01.2015 నుంచి అమల్లోకి వచ్చింది. ఖనిజ గనుల లీజులో రాయితీల మంజూరు కోసం పారదర్శకతను తీసుకురావడానికి, అన్ని స్థాయిలలో వివక్షత తొలగించడానికి ఈ సవరణ తీసుకురావడం జరిగింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గనుల వేలం నిర్వహిస్తాయి. వేలంతో పాటు, ఎంఎండీఆర్‌ చట్టం-1957లోని సెక్షన్ 17ఏ ప్రకారం ప్రాంతీయ కోటా కింద ప్రభుత్వ కంపెనీలకు ఖనిజ గనుల లీజులో రాయితీలు ఇవ్వడం జరిగింది. గత ఐదేళ్లలో 133 ఖనిజ గనులను వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాయి. ఎంఎండీఆర్‌ చట్టం-1957లోని సెక్షన్ 17ఏ ప్రకారం ప్రభుత్వ కంపెనీలకు ప్రాంతీయ కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన 16 ప్రతిపాదనలకు  కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రాల వారీగా, సంవత్సరం వారీగా ఆ వివరాలను అనుబంధం 1లో జత చేయడం జరిగింది.

కేంద్ర 'పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ' నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, గత ఐదు సంవత్సరాల్లో గనుల తవ్వకం కార్యకలాపాల కారణంగా మొత్తం 19267.47 హెక్టార్ల అటవీ భూమి మారిపోయింది. ఆ వివరాలు రాష్ట్రాల వారీగా అనుబంధం-IIలో ఇవ్వడం జరిగింది.

మైనింగ్ కార్యకలాపాల కారణంగా నిర్వాసితులైన, పునరావాసం పొందినవారికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.



(Release ID: 1898955) Visitor Counter : 120