సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
'ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్' నినాదాన్ని ప్రతిబింబించేలా ముంబైలో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ - 2023 ప్రారంభం
ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక బాబాసాహెబ్ అంబేద్కర్ టూరిస్ట్ సర్క్యూట్ రైలును ప్రారంభిస్తాం:శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
12 FEB 2023 2:18PM by PIB Hyderabad
రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ తిరిగి వచ్చింది, ఈ సారి ముంబైలో . ఇది ప్రతి ఒక్కరికీ దృశ్య , సంగీత విందుగా ఉంటుందని హామీ ఇస్తుంది. రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ 2023ను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముంబై చర్చిగేట్ లోని ఆజాద్ మైదానంలో శనివారం సాయంత్రం ప్రారంభించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 11 నుండి 19 వరకు సాంస్కృతిక మార్పిడి ద్వారా జాతీయ ఐక్యత , సమగ్రతను పెంపొందించడానికి ఈ మహోత్సవ్ ను నిర్వహిస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాలు, అటవీ, మత్స్య శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్, పర్యాటక, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రసంగిస్తూ, రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ శాశ్వత సందేశాన్ని తెలియజేస్తుందని, ఇది భాష ,సాంస్కృతిక వ్యక్తీకరణలలో అనేక వైవిధ్యాలు ఉన్నప్పటికీ, భారతదేశం ఐక్యంగా ,ఒకటిగా ఉందని సూచిస్తుందని అన్నారు. కుంభమేళా తరహాలో ఈ మహోత్సవం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని గవర్నర్ ఆకాంక్షించారు.
భారత ప్రభుత్వం భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి నాంది పలుకుతోందని గవర్నర్ అన్నారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచం గమనించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక, కాలాతీత సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ సజీవంగా ఉంచుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ముంబైవాసులందరితో పాటు రాష్ట్రం, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ మహోత్సవ్ ను సందర్శించాలని,మన సంస్కృతి, కళలు, వంటకాలు , ఇతర ప్రత్యేకతలను అనుభూతి చెందాలని ఆయన కోరారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ సర్క్యూట్ రైలును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ముంబై ప్రజల కోసం మహోత్సవ్ సందర్భంగా సుమారు 1000 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని కేంద్ర మంత్రి చెప్పారు. ముంబై నగరం సాంస్కృతికంగా సుసంపన్నమైన పర్యాటక ప్రదేశాలు, సంస్థలు, పండుగలు, నృత్యం మరియు సినిమా వంటి కళా రూపాలతో పురాతన సాంప్రదాయం -ఆధునికతల సంగమంగా ప్రత్యేకత కలిగి ఉందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో కళలు, సంస్కృతి ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని చాటిచెప్పడం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఈ మహోత్సవ్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ మహోత్సవ్ మన గొప్ప సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి ప్రసారం చేస్తుందని, మన దేశీయ సంస్కృతి,కళల పట్ల మన ప్రజలలో అభిమానాన్ని ప్రేమను పునరుజ్జీవింపజేస్తుందని మంత్రి అన్నారు. ‘‘వోకల్ ఫర్ లోకల్'ను కూడా ప్రోత్సహిస్తున్నామని, మన పుణ్యక్షేత్రాల అభివృద్ధిని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని అన్నారు.
ముంబైవాసులందరూ ఈ ఫెస్టివల్ ను సందర్శించి, భారతీయ సంస్కృతి లోని వివిధ రూపాలను ఆస్వాదించడం ద్వారా ప్రేరణ, విజ్ఞానం వవినోదాన్ని పొందాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాలు, అటవీ, మత్స్య శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యంత వైవిధ్యమైన, సాంస్కృతికంగా సంపన్నమైన దేశమని అన్నారు. దేశంలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని అనేక జానపద కళలను గుర్తు చేసిన మంత్రి, కేవలం సంపదతో సాధించలేని మనశ్శాంతికి సంస్కృతి దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి మహారాష్ట్ర క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అమితా సారాభాయ్ మాట్లాడుతూ, హస్తకళ, సంస్కృతి వంటకాల ” (3 సిల) ద్వారా వివిధ రాష్ట్రాల సంస్కృతులను ఒకదానితో మరొక దానిని సామాన్య పౌరులతో అనుసంధానించడమే మహోత్సవ్ లక్ష్యమని అన్నారు.
ప్రారంభోత్సవంలో తేజస్విని సాథే, ఆమె బృందం శాస్త్రీయ కథక్ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.
ప్రతిభావంతులైన నృత్యకారుల బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం శక్తివంతమైన, లయబద్ధమైన , వ్యక్తీకరణ రూపం ద్వారా ప్రేక్షకులను కొత్త లోకాలకు తీసుకువెళ్ళింది. ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ 'తుమ్సే హి, 25 సాల్ కా సురీలా సఫర్' (25 ఏళ్ల సంగీత ప్రయాణం) పేరుతో తన ప్రదర్శనలో పలు పాటలను శ్రావ్యంగా ఆలపించారు.
స్వాతంత్య్ర పోరాటంలో మరచిపోయిన, అంతగా ప్రసిద్ధి చెందని వీరుల ఇతివృత్తంపై ఆర్ ఎస్ ఎం వేదికపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను మంత్రి సందర్శించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు మోహిత్ చౌహాన్ సంగీత కచేరీలో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు మోహిత్ చౌహాన్ సంగీత కచేరీలో కూడా పాల్గొన్నారు.
భారతదేశం నలుమూలల నుండి సుమారు 350 మంది జానపద , గిరిజన కళాకారులతో పాటు సుమారు 300 మంది స్థానిక జానపద కళాకారులు, కొంతమంది ట్రాన్స్జెండర్ ,వికలాంగ కళాకారులు, ప్రసిద్ధ శాస్త్రీయ కళాకారులు అలాగే ప్రసిద్ధ స్టార్ కళాకారులు తమ మనోహరమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
కళాకారులతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాల నుండి సుమారు 150 మంది హస్తకళాకారులను అంగన్ ఆధ్వర్యంలో వారి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సేల్ కమ్-ఎగ్జిబిషన్ కోసం ఆహ్వానించారు, దీని కోసం సుమారు 70 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర చేనేత శాఖ, స్టార్టప్ ల కోసం 25 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ మహోత్సవ్ ను నిర్వహిస్తుంది. 2019లో మధ్యప్రదేశ్ లో 2022లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్వహించగా ఇప్పుడు మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు.
రోజువారీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:
ఉదయం 11:00 నుంచి రాత్రి 10:00 గంటల వరకు హస్తకళలు -కళా ప్రదర్శన(ఎగ్జిబిషన్)
మధ్యాహ్నం 02:30 నుంచి 03:30 వరకు స్థానిక కళాకారులచే మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన
సాయంత్రం 04:00 నుండి 05:30 వరకు స్థానిక కళాకారులచే ప్రజంటేషన్
సాయంత్రం 06:00 నుంచి 06:45 వరకు కొరియోగ్రఫీ ప్రదర్శనతో సంప్రదాయ, గిరిజన ,జానపద నృత్యాలు
రాత్రి 07:00 నుండి 08:15 వరకు ప్రముఖ శాస్త్రీయ కళాకారులచే కార్యక్రమాలు.
రాత్రి 08:30 నుంచి 10:00 గంటల వరకు ప్రముఖ స్టార్ ఆర్టిస్టుల కార్యక్రమాలు.
ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా రోజువారీ కార్యక్రమాల వివరాలను ఇక్కడ కనుగొనండి.
వేదిక మైదానంలో ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తున్నారు, దీనిలో భారతదేశం నలుమూలల నుండి ఆహార రకాలను అందించే సుమారు 37 స్టాల్స్, స్థానిక ఫుడ్ స్టాల్స్ అలాగే చిరుధాన్యాల ఆహారం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏడు జోనల్ కల్చరల్ సెంటర్లు, అకాడమీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ అనేది మన గొప్ప సాంస్కృతిక వారసత్వం వేడుక. ప్రజలు అంతా కలిసి భారతీయ సాంస్కృతిక సంప్రదాయాల ఉత్తమమైన వాటిని అనుభూతి చెందడానికి ఒక అవకాశం. ఈ మొత్తం కార్యక్రమానికి పౌరులు, కళాభిమానులందరికీ ప్రవేశం ఉచితం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభవాన్ని కోల్పోవద్దు .మాతో సంగీత, సాంస్కృతిక ప్రయాణాన్ని ఆస్వాదించండి!
*****
(Release ID: 1898666)
Visitor Counter : 179